For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

International Coffee Day 2021: కాఫీని ఎవరు కనిపెట్టారు? మన దేశంలో తొలిసారిగా కాఫీని తయారు చేసిందేవరో తెలుసా...

ఇంటర్నేషనల్ కాఫీ డే 2021 తేదీ, చరిత్ర మరియు ప్రాముఖ్యత ఇప్పుడు తెలుసుకుందాం.

|

మనలో చాలా మంది ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే కాఫీ కప్పుతోనే రోజుని తాజాగా ప్రారంభిస్తాం. అదే కాఫీతో రోజుకు ముగింపు కూడా పలుకుతారు కాఫీ ప్రియులు.

International Coffee Day 2021: Date, history and significance in Telugu

ప్రపంచవ్యాప్తంగా కాఫీకి కోట్లాది మంది అభిమానులు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా.. ప్రతి సంవత్సరం అక్టోబర్ ఒకటో తేదీన ఇంటర్నేషనల్ కాఫీ డే జరుపుకుంటారు.

International Coffee Day 2021: Date, history and significance in Telugu

ఈరోజు కేవలం కాఫీ ప్రియులకే కాదు. కాఫీపై ఆధారపడుతున్న ఎంతో మంది రైతులను, కార్మికులను ప్రోత్సహించేందుకు కాఫీ డేను నిర్వహిస్తున్నారు. అయితే ఈ కాఫీని ఎవరు కనిపెట్టారు? అసలు కాఫీ ఎలా మనుగడలోకొచ్చింది? దీన్ని ఎప్పుడు.. ఎక్కడ ప్రపంచానికి పరిచయం చేశారు? మన దేశానికి ఎవరు తీసుకొచ్చారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

కాఫీ గురించి మనం నమ్మలేని నిజాలెన్నో ఉన్నాయని తెలుసా...కాఫీ గురించి మనం నమ్మలేని నిజాలెన్నో ఉన్నాయని తెలుసా...

ఎర్రటి పండ్లు..

ఎర్రటి పండ్లు..

ఓ రోజు ఖాలీద్ అనే గొర్రెల కాపరి రోజు మాదిరిగానే గొర్రెలను మేపేందుకు కొండ మీదకు వెళ్లాడు. అక్కడ చుట్టూ పచ్చని చెట్లతో అందంగా ఉంది. అయితే అదే సమయంలో అతనికి ఓ చిన్న చెట్టుకు ఎర్రని పండ్లు కనిపించాయి. గొర్రెలు వాటిని కూడా తినేశాయి. వాటిని తిన్నాక అవి మరింత ఉల్లాసంగా, చురుకుగా మారడాన్ని గమనించాడు. అప్పుడు తాను కూడా ఆ పండ్లను తిని చూశాడు.

ఏదో తెలియని శక్తి..

ఏదో తెలియని శక్తి..

తాను కూడా ఆ పండ్లను తిన్న తర్వాత తనలో కూడా ఉత్సాహం పెరిగింది. ఏదో శక్తి పెరిగినట్టు అనిపించింది. వెంటనే ఆ ఎర్రని పండ్లన్నింటినీ తీసుకుని ఓ చిన్న మూటలో కట్టుకుని తమ మత గురువు వద్దకు వెళ్లాడు. అయితే తన మత గురువు వాటిని పనికి రానివంటూ పక్కనున్న మంటలో పడేశాడు. మంటల్లో కాలిపోతున్న ఆ పండ్లు మరింత సువాసనను వెదజల్లాయి. ఆ వాసనకు అక్కడున్న వారంత పరవశించిపోయారు.

ఆ గింజలనే..

ఆ గింజలనే..

ఆ మంటల్లో కాలిన గింజలను తీసి పొడిలా మార్చేసి, వాటిని వేడి నీటిలో వేసుకుని తాగారు ఖాలీద్. అదే ప్రపంచంలో తొలి కాఫీ. ఆ పానీయం తన మత గురువుకు కూడా బాగా నచ్చింది. దీంతో అప్పటినుండి వారు కాఫీని రెగ్యులర్ గా తాగడం మొదలుపెట్టారు. అప్పటి నుండి ఖాలీద్ గొర్రెలు మోపడంతో పాటూ, కాఫీ పానీయాన్ని కూడా విక్రయించడం మొదలుపెట్టాడు.

ఒక రోజులో 3 కప్పుల కాఫీని తాగటం, మీ ఆరోగ్యానికి మంచిదే!

ఎక్కడంటే..

ఎక్కడంటే..

ఈ కాఫీ కథ మొత్తం నిజమేనని ‘నేషనల్ కాఫీ అసొసియేషన్' చెబుతోంది. అంతేకాదు అందుకు ఆధారాలు కూడా ఉన్నాయంటోంది. ఇంతకీ ఖాలీద్ ఏ ప్రాంతంలో కాఫీని కనిపెట్టాడంటే.. ఇథియోపియా అనే ప్రాంతంలో. ఇథియోపియా నుండి కాఫీ ప్రస్థానం ప్రారంభమై ప్రస్తుతం సుమారు 75 దేశాల్లో ప్రధాన వాణిజ్య పంటగా మారింది.

కాఫీ ప్రియులకు పండగ..

కాఫీ ప్రియులకు పండగ..

ప్రపంచ వ్యాప్తంగా కాఫీ ప్రియులందరూ అక్టోబర్ ఒకటో తేదీన వేడుకలు జరుపుకుంటారు. ఓ అధ్యయనం ప్రకారం, ప్రతిరోజూ ప్రపంచవ్యాప్తంగా 400 బిలియన్ కాఫీ కప్పులు తాగేస్తున్నారట కాఫీ ప్రియులు. ప్రతి సంవత్సరం కాఫీ పంటపై ఆధారపడి జీవిస్తున్న రైతులు, కార్మికులను ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం అక్టోబర్ ఒకటో తేదీన ‘ఇంటర్నేషనల్ కాఫీ డే' జరుపుకుంటారు. ఈ వేడుకలను తొలిసారి అమెరికాలోని నేషనల్ కాఫీ అసొసియేషన్ 2004 సంవత్సరంలో నిర్వహించింది. అప్పటినుంచి ప్రతి ఏటా కాఫీ దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అతి పెద్ద కాఫీ ఉత్పత్తిదారు బ్రెజిల్. ఈ దేశం నుంచి ప్రతి సంవత్సరం దాదాపు 25 లక్షల మెట్రిక్ టన్నుల కాఫీ గింజలు ఉత్పత్తి అవుతాయి. మన దేశం కూడా కాఫీ అధికంగా పండించే దేశాల స్థానంలో ఏడో స్థానంలో ఉంది.

మన దేశంలో..

మన దేశంలో..

మన దేశానికి కాఫీ గింజలు తొలిసారి చేరింది 16వ శతాబ్దంలో అని చెబుతోంది కాఫీ బోర్డు. సూఫీ సన్యాసి బాబా బుడాన్ ఏడు కాఫీ గింజల్ని అరేబియా నుండి మన దేశానికి తీసుకొచ్చారని చెబుతోంది. ఆ గింజల్ని కర్నాటకలోని చిక్ మంగళూరులోని తన ఆశ్రమంలో నాటారని తెలిపింది. అక్కడి నుండే మిగిలిన రాష్ట్రాలకు కూడా కాఫీ విస్తరించిందని చెబుతోంది.

FAQ's
  • ఇంటర్నేషనల్ కాఫీ డే ఎప్పుడు జరుపుకుంటారు?

    ప్రతి సంవత్సరం అక్టోబర్ ఒకటో తేదీన ఇంటర్నేషనల్ కాఫీ డే జరుపుకుంటారు.

English summary

International Coffee Day 2021: Date, history and significance in Telugu

Here we are talking about the International Coffee Day 2021: Date, history and significance in Telugu. Have a look
Story first published:Friday, October 1, 2021, 11:44 [IST]
Desktop Bottom Promotion