For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

International Daughter's Day 2021:మీ కూతురికి ఇలాంటి కానుకలిచ్చేయండి.. వారిని సర్ ప్రైజ్ చేయండి...

|

మనలో ఏ ఒక్క అమ్మాయిని అడిగినా తన తొలి హీరో తండ్రి అనే చెబుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే చాలా మంది కూతుళ్లందరికీ తొలి స్నేహం తల్లితో ఏర్పడుతుందనే చెబుతుంటారు.

కానీ తనతో స్నేహంగా ఉన్నప్పటికీ.. నాన్నంటేనే ఎక్కువ ప్రేమ చూపుతారు. ఎందుకంటే చాలా మంది నాన్నలు తమకు కూతురు పుట్టిందంటే వారింటికి లక్ష్మీకళ వచ్చినట్లు సంతోషపడతారు. అలా మీరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే మీ గారాల పట్టి పుట్టినరోజు, లేదా పెళ్లి రోజు ఇంకేదైనా ప్రత్యేకమైన రోజు వంటి సందర్భాల్లో తనకు ఒక మంచి బహుమతి ఇవ్వాలని..

తనను సర్ ప్రైజ్ చేసి సంతోషపెట్టాలని చాలా మంది ఆలోచిస్తుంటారు. అయితే కూతుళ్ల కోసం ప్రత్యేకంగా 'ఇంటర్నేషనల్ డాటర్స్ డే' కూడా జరుపుకోవడం మన దేశంలో ఆనవాయితీగా వస్తోంది. కాబట్టి ఈ సందర్భంగా మీరు కూడా ఈ 'కూతుళ్ల దినోత్సవం' సందర్భంగా మీ చిన్నారికి ఎలాంటి కానుకలు ఇస్తే బాగుంటుందో చూసెయ్యండి...

ఇంటర్నేషనల్ డాటర్స్ డే ఎందుకు జరుపుకుంటారో తెలుసా...

స్మార్ట్ వాచ్..

స్మార్ట్ వాచ్..

సాధారణంగా పేరేంట్స్ తమ బిడ్డను చాలా మురిపెంగా చూసుకుంటూ ఉంటారు. ఇది అత్యంత సహజమైన విషయం. అలాగే వీరికి ఎప్పుడు ఏది కావాలో తెలుసుకుంటూ.. వాటిని సమకూర్చడాన్ని కూడా తమ రెస్పాన్సిబిలిటీగా ఫీలవుతుంటారు. ఈ సందర్భంగా ప్రస్తుత డిజిటల్ యుగంలో తనకు ఒక మంచి బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ ను గిఫ్టుగా ఇవ్వండి. దీని వల్ల తన హెల్త్ కు సంబంధించి హార్ట్ బీట్, వెయిట్, వాకింగ్ ఇతర ఎన్నో విషయాలను స్మార్ట్ వాచ్ ద్వారా తెలుసుకోవచ్చు. అంతేకాదు అందులోని సమయం చూసినప్పుడల్లా మీరే గుర్తొస్తారు.

గులాబీ పూలు..

గులాబీ పూలు..

చాలా మంది అమ్మాయిలకు గులాబీ(పింక్) రంగు అంటే చాలా ఇష్టం. అందుకే వారు సహజంగా వాడే వస్తువులలో కూడా పింక్ కలర్ ఉండేలా చూసుకుంటారు. మనకు కూడా అవే ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి ఈ డాటర్స్ డే సందర్భంగా మీ కూతురు పువ్వులను ఇష్టపడుతుంటే తనకు గులాబీ పూల బోకేను కానుకగా ఇవ్వండి. ఇది చూసిన తన ముఖం కోటి వెలుగుల కాంతులతో వెలిగిపోతుంది.

డైరీ మిల్క్ చాక్లెట్..

డైరీ మిల్క్ చాక్లెట్..

మీ కూతురికి చాక్లెట్ అంటే ఇష్టమా? అయితే ఈ కూతుళ్ల దినోత్సవం రోజున తనకు ఇష్టమైన డైరీ మిల్క్ చాక్లెట్ కలెక్షన్ ను కానుకగా ఇచ్చేయండి. ఒకవేళ తను మూడ్ ఆఫ్ లో ఉంటే.. ఇది చూసిన వెంటనే తను ఎగిరి గంతేస్తుంది. అలా తనను సర్ ప్రైజ్ చేయండి.

అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎందుకు బెటరో తెలుసా..

#insync #pulse #daughter #happydaughtersday #better

కీ ఛైన్లు..

కీ ఛైన్లు..

మీరు ఇచ్చే కానుకను చూసినప్పుడల్లా తనకు మీరు గుర్తు రావాలంటే.. మంచి డిజైన్లతో చేయించిన కీ చైన్స్ ను గిఫ్టుగా ఇవ్వండి. ఇలాంటి బహుమతులను ఇవ్వడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. అయితే ఇలాంటి ట్రెండ్ ఎప్పుడో మొదలైంది. మనం కూడా నచ్చిన వ్యక్తులకు వారికి నచ్చే ఫొటోలు, కొటేషన్స్ తదితర కీ చైన్లపై డిజైన్ రూపంలో చేయించి గిఫ్టుగా ఇవ్వొచ్చు.

ఫొటో ఫ్రేమ్..

ఫొటో ఫ్రేమ్..

మీకు మీ కూతురితో ఉన్న అనుబంధానికి గుర్తుగా వారితో దిగిన ఫొటోలలో.. ది బెస్ట్ అనిపించే ఫొటో ఒక్కదాన్ని సెలెక్ట్ చేయండి. దాన్ని ఫొటో ఫ్రేమ్ లో కట్టించుకొని వారి ఇంట్లో ఎప్పటికీ చెరిగిపోయిన ఒక జ్ణాపకంగా మలచుకోవచ్చు. ఈ డాటర్స్ డే సందర్భంగా ఇలాంటి కానుకలు అద్భుతంగా ఉంటాయి.

ఎలక్ట్రానిక్ క్యాండిల్స్..

ఎలక్ట్రానిక్ క్యాండిల్స్..

సాధారణ క్యాండిల్స్ ని మీ కూతురికి బహుమతిగా ఇస్తే.. దాన్ని వెలిగించడం ద్వారా అవి కరిగిపోతాయి. అయితే అదే ఫ్లేమ్ లెస్ క్యాండిల్స్ ఇస్తే.. అది ఒక ఎలక్ట్రానిక్ క్యాండిల్ కాబట్టి అది ఎప్పటికీ వారితోనే ఉంటుంది. ఇలాంటి బహుమతులను కూడా మీ చిన్నారికి ఇవ్వొచ్చు.

మీ కూతుళ్లకు విషెస్ చెప్పేయండిలా..

#happydaugtersday #daughter #wishes #messages #quotes #facebookstatus #whatsapp status

విలువైనదిగా..

విలువైనదిగా..

చాలా మంది అమ్మాయిలు జ్యువెలరీని బాగా ఇష్టపడతారు. వాటిని చాలా భద్రంగా కూడా పెట్టుకుంటారు. కాబట్టి ఈ డాటర్స్ డే సందర్భంగా తనకు జ్యువెలరీ బాక్స్ ను గిఫ్టుగా ఇవ్వొచ్చు. ఇలాంటి బహుమతులను చదువుకునే యువతులు మరియు ఉద్యోగం చేస్తూ ఇతర చోట్ల ఉన్న వారికి ఎక్కువగా అవసరమవుతాయి.

పూల కుండీ లేదా మొక్కలు..

పూల కుండీ లేదా మొక్కలు..

కొందరు అమ్మాయిలు మొక్కలంటే బాగా ఇష్టపడతారు. అందులో పూలు కాచే మొక్కలంటే మరీ ఎక్కువగా ఇష్టపడతారు. కాబట్టి ఈ కూతుళ్ల దినోత్సవం సందర్భంగా మీ చిన్నారికి ఒక మంచి పూలకుండీని లేదా పూల మొక్కలను గిఫ్టుగా ఇచ్చేయండి.

English summary

International Daughter's Day 2021: gift ideas for your daughter

Here we are talking about the International Daughter's Day 2021:gift ideas for your daughter. Have a look
Story first published: Saturday, September 25, 2021, 13:54 [IST]