For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

International Friendship Day 2021: నిజమైన స్నేహితులు తోడుంటే.. ప్రపంచాన్నే జయించొచ్చు...!

|

మన జీవితంలో పుట్టినప్పటి నుండి మనం పెరిగే పెద్దయ్యేవరకు ఎవరో ఒకరితో ఏదో ఒక పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కొందరితో బంధంగా మారుతుంది.

అందులో అమ్మ, నాన్న, పిన్ని, బాబాయ్, మామ, అక్క, తమ్ముడు, చెల్లి, అన్న వంటి బంధాలెన్నో ఉంటాయి. వీటన్నింటికీ మించి ప్రేమ, పెళ్లి బంధం గొప్పవని బావిస్తారు కొందరు. కానీ ఈ ప్రపంచంలో అన్నింటికన్నా బలమైన బంధం స్నేహ బంధం.

ఈ లోకంలో స్నేహానికన్నా మిన్న ఏదీ లేదని, ఎదుటి వారిలో ఉండే కోపాన్ని, లోపాన్ని భరించేవాడే నిజమైన స్నేహితుడని చెబుతుంటారు. కష్ట సమయంలో కలవరపడుతున్న మనకు సహాయం చేయకపోయినా.. కొండంత భరోసానిచ్చే వాడే స్నేహితుడు. అందుకే నిజమైన స్నేహితుడు మన తోడుంటే ఈ ప్రపంచాన్ని చాలా ఈజీగా గెలిచేయొచ్చు అని చెబుతుంటారు. కులం, మతం, ఆస్తి, పాస్తులతో సంబంధం లేకుండా పుట్టేదే స్నేహం.

స్నేహం అనేది ఇలా ఉండాలి.. అలా ఉండాలి అంటూ దానికి ఒక నిర్దిష్టమైన నియమాలు, నిబంధనలు, అంచనాలు ఏమీ లేవు. మనం ఏదైనా తప్పుడు దారిలో వెళ్తునప్పుడు.. లేదా ఏదైనా పొరపాటు చేసినప్పుడు వారిని మందలించి సంరక్షకునిలా రక్షిస్తూ దారి చూపే వాడే నిజమైన స్నేహితుడు. అందుకే బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య ఎలాంటి మొహమాటాలనేవే ఉండవు. అందుకే చాలా మంది తమ ఫ్యామిలీ మెంబర్లతో డిస్కస్ చేయలేని విషయాలను కూడా స్నేహితులతోనే ఎక్కువగా షేర్ చేసుకుంటారు. ఇలాంటి స్నేహితులందరి కోసం ఓ ప్రత్యేక రోజు ఉంది. అదే అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం. ఈ సందర్భంగా స్నేహితుల దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు? దాని ప్రాముఖ్యతలేంటి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మీ స్నేహితులను హత్తుకునే బెస్ట్ విషెస్, కోట్స్, వాట్సాప్ మెసెజెస్ ను ఇప్పుడే షేర్ చేసుకోండి...మీ స్నేహితులను హత్తుకునే బెస్ట్ విషెస్, కోట్స్, వాట్సాప్ మెసెజెస్ ను ఇప్పుడే షేర్ చేసుకోండి...

తొలిసారి ఎప్పుడంటే..

తొలిసారి ఎప్పుడంటే..

ప్రపంచంలో మొట్టమొదటిసారిగా స్నేహితుల దినోత్సవాన్ని 1930 సంవత్సరంలో ఫక్తు మార్కెట్ వ్యూహాలతో ప్రారంభమైంది. హాల్ మార్క్ కార్డ్స్ కంపెనీ అధినేత జాయిన్ హాల్ మొదటిసారిగా ‘ఫ్రెండ్ షిప్ డే' అనే ఒకరోజును ప్రతిపాదించారు. ఆ వేడుకకు సంబంధించిన కార్డులను మార్కెట్లో విడుదల చేశారు.

తొలిరోజుల్లో విమర్శలు..

తొలిరోజుల్లో విమర్శలు..

ఆ సమయం నుండే ఫ్రెండ్ షిప్ డేకు అంకురార్పణ జరిగింది. కాకపోతే ఆ కార్డులు కేవలం గ్రీటింగ్ కార్డ్స్ మాత్రమే అని.. బిజినెస్ కోసమే ఇలాంటి ఒక రోజు అని అప్పట్లో విమర్శలు వచ్చాయి. అయితే 1935 సంవత్సరంలో యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ మొదటి ఆదివారాన్ని జాతీయ స్నేహితుల దినోత్సవంగా ప్రకటించింది. అప్పటి నుండి జాతీయ స్నేహితుల దినోత్సవం వార్షికోత్సవం వేడుకగా మారింది. అందుకు తగ్గట్టు కొన్ని గ్రీటింగ్ కార్డులు మార్కెట్లోకి వచ్చాయి.

పరాగ్వేలో తొలిసారిగా..

పరాగ్వేలో తొలిసారిగా..

అలా 28 సంవత్సరాలు పూర్తయ్యాక, 1958లో జులై 30వ తేదీ పరాగ్వే దేశంలో తొలిసారి అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవాన్ని ప్రతిపాదించడం జరిగింది. వరల్డ్ ఫ్రెండ్ షిప్ క్రూసెడ్ అనే సంస్థ ఈ ప్రతిపాదనను తీసుకొచ్చింది. అలా ప్రారంభమైన ఫ్రెండ్ షిప్ డే కల్చర్ నెమ్మదిగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది.

ఐరాస కూడా..

ఐరాస కూడా..

అనంతరం 2011 సంవత్సరంలో ఐక్య రాజ్య సమితి కూడా ఆగస్టు మాసంలోని తొలి ఆదివారాన్ని అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంగా జరుపుకోవాలని తీర్మానించింది. అప్పటి నుండి ప్రపంచదేశాలన్నీ దీన్ని పాటించడం ప్రారంభించాయి. మన దేశంతో పాటు బంగ్లాదేశ్, మలేషియా, కొన్ని అరబ్ దేశాల్లో స్నేహితుల దినోత్సవాన్ని ఆగస్టు మాసంలోని తొలి ఆదివారం రోజున జరుపుకుంటారు.

ఇతర దేశాల్లో..

ఇతర దేశాల్లో..

కానీ అర్జెంటీనా, ఈక్వెడార్, ఉరుగ్వేల్లో జులై 20వ తేదీన నిర్వహిస్తారు. మన దాయాది దేశమైన పాకిస్థాన్ లో మాత్రం జులై 30వ తేదీన ఫ్రెండ్ షిప్ డే జరుపుకుంటారు. పాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న బ్రెజిల్ లో మాత్రం ఏప్రిల్ 18వ తేదీన స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఒబెరిన్, ఓహీయో దేశాలు ఏప్రిల్ 9వ తేదీన జరుపుకుంటాయి.

ఫ్రెండ్ షిప్ డే విషెస్..

ఫ్రెండ్ షిప్ డే విషెస్..

అయితే ఈ విషయాల గురించి చాలా మందికి తెలియదు. ఒకప్పుడు ఫ్రెండ్ షిప్ డే విషెస్ చెప్పుకోవాలంటే.. అందరూ గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చిపుచ్చుకునే వారు. తర్వాతి కాలంలో స్పెషల్ గిఫ్ట్స్ కూడా ఇస్తుండేవారు. అయితే నెమ్మదిగా ఈ కల్చర్ పోయి.. ప్రస్తుతం అంతా సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్పుకుంటున్నారు. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, టెలిగ్రామ్, కూ వంటి వేదికల ద్వారా స్నేహితులకు సందేశాలు పంపుతున్నారు.

ఈ సందర్భంగా బోల్డ్ స్కై తెలుగు తరపున అందరికంటే ముందుగా అడ్వాన్స్ Happy Friendship Day.

English summary

International Friendship Day 2021 Date, History and Significance in Telugu

Here we are talking about the international friendship day 2021 date, history and significance in Telugu. Read on
Story first published: Tuesday, July 27, 2021, 12:38 [IST]