For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

International Kissing Day: ఇలా కిస్ చేస్తే కిక్ గ్యారంటీ... మీరూ ఓసారి ట్రై చేయండి...!

ఇంటర్నేషనల్ కిస్ డే సందర్భంగా ముద్దుల్లోని రకాలు వాటి అర్థాలేంటో తెలుసుకుందామా...

|

మనం ఇతరులపై ప్రేమను వ్యక్తం చేసేటప్పుడు చాలా సందర్భాల్లో ముద్దు చాలా ముఖ్యమైనది. వారిపై మనకు ఎంత ప్రేమ ఉందని..వారు మనకు ఎంత అవసరమో చెప్పేందుకు Kiss ఒక చక్కని మార్గం అని చెప్పొచ్చు.

International Kissing Day : Different Types Of Kisses & Meanings in Telugu

అయితే ఇది కేవలం ఫీలింగ్స్ గురించో.. లేదా వాటి వ్యక్తీకరణ గురించో మాత్రమే కాదు.. ఇలా కిస్ చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా ఎన్నో ప్రయోజనాలు అందడమే కాదు.. మీ బంధం కూడా మరింత బలపడుతుందట.

International Kissing Day : Different Types Of Kisses & Meanings in Telugu

ఇదిలా ఉండగా ఈరోజు ఇంటర్నేషనల్ కిస్సింగ్ డే. ఈ సందర్భంగా ముద్దుల్లోని రకాలు.. వాటి అర్థాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

'ఆ' బంధం బలపడాలంటే.. ప్రతిరోజూ ఓ కిస్.. ఓ కౌగిలింత... కావాల్సిందేనా...!'ఆ' బంధం బలపడాలంటే.. ప్రతిరోజూ ఓ కిస్.. ఓ కౌగిలింత... కావాల్సిందేనా...!

ముద్దు పెట్టుకోవడం..

ముద్దు పెట్టుకోవడం..

యవ్వనంలో ఉన్న ప్రతి ఒక్కరూ రొమాన్స్ చేయడాన్ని బాగా ఇష్టపడతారు. ఇక ముద్దుల విషయానికొస్తే.. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఎంతగానో ఇష్టపడతారు. కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు, ప్రేమలో ఉండే వారు ముద్దు(Kiss)ను ఎంతలా ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ప్రతి ఒక్క ముద్దు..

ప్రతి ఒక్క ముద్దు..

ముద్దుల్లో తొలిముద్దు.. అందరూ ఉన్నప్పుడు ఎవ్వరికీ కనిపించకుండా రహస్యంగా పెట్టే ముద్దు.. తొలిసారిగా గాఢమైన ముద్దు.. ఇలా ప్రతి ఒక్క ముద్దు ప్రత్యేకమైనదే. ఈ సందర్భంగా మేం మీకు కొన్ని ముద్దుల గురించి తెలియజేస్తున్నాం. అవి మీ జీవితంలో ఒక్కసారైనా ప్రయత్నించాల్సిందే.

పెదాలపై ముద్దు..

పెదాలపై ముద్దు..

ప్రియుడు తన ప్రియురాలు పెదాలపై కిస్ చేయడం ద్వారా తన ప్రేమను నిజంగా విలువైనదిగా భావిస్తాడు. అదే విధంగా భార్యభర్తల విషయానికొస్తే ఇంట్లో ఎవరూ చూడని సమయంలో మీ భర్త అకస్మాత్తుగా, వేగంగా మీరు ముద్దు ఇస్తే, వారు మీ జీవితంలో ఒక భాగం అయ్యారని అర్థం. ఒకవేళ ప్రేమికులు ఓపెన్ గానే అలా కిస్ చేసుకుంటే వారి రిలేషన్ షిప్ ఎంత బలంగా ఉందో అందరూ ఊహించగలరని వారు భావిస్తారు. అందుకే మన సినిమాల్లో ప్రేమ గురించి వచ్చిన ఎన్నో సినిమాల్లో లిప్ లాకులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు.

అక్కడ కిస్ పెడితే కిక్ తో పాటు.. కోరికలు కూడా అమాంతం పెరిగిపోతాయంట...!అక్కడ కిస్ పెడితే కిక్ తో పాటు.. కోరికలు కూడా అమాంతం పెరిగిపోతాయంట...!

నుదుటిపై ముద్దు..

నుదుటిపై ముద్దు..

మీ ప్రియుడు లేదా ప్రియురాలు మీ నుదుటిపై ముద్దు పెడితే మిమ్మల్ని చాలా కేర్ ఫుల్ గా చూసుకోవాలనుకుంటున్నాడు అని అర్థం. అంతేకాదు మీకు ఏ సమయంలో అయినా, ఎలాంటి ఆపద వచ్చినా మీకు రక్షణగా నిలవాలనుకుంటున్నారు అని అర్థం. అలాగే వారి వారి రహస్యాలు మరియు జీవితాలను మీతో పంచుకోవాలని అనుకుంటారు. ఆఖరిగా మీరు వారి జీవితంలో అత్యంత కీలకమైన వారు అని భావించినప్పుడు కూడా మీ నుదిటిపై ముద్దు పెట్టుకుంటారు.

చేతిపై ముద్దు..

చేతిపై ముద్దు..

ప్రియురాలు లేదా ప్రియుడి చేతిపై ముద్దు పెట్టుకునే వ్యక్తుల నుండి కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. వీరు ఎక్కువగా సాగర తీరంలాగా ప్రవర్తిస్తుంటారు. అమ్మాయిల అందమైన మరియు సుకుమారమైన చేతిని ముద్దాడేందుకు ఒక ప్రత్యేకమైన ధైర్యం కావాలి. కాబట్టి వీరు పూర్తి విశ్వాసంతో ఉంటారు. అమ్మాయి చేతికి ముద్దు పెట్టడం ద్వారా వారు దేనికైనా సిద్ధంగా ఉన్నారని అర్థం చేసుకోవాలి.

మణికట్టు లోపలి భాగంలో..

మణికట్టు లోపలి భాగంలో..

మీ మణికట్టు లోపలి భాగం చాలా మనోహరమైనది. మీ ప్రియుడు లేదా ప్రియురాలు మీ మణికట్టు లోపలి భాగంలో ముద్దు పెట్టుకునే సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. అంటే దీని అర్థం మిమ్మల్ని బలవంతం చేస్తాడు అని కాదు. ఈ భాగంలో ముద్దు పెట్టడం ద్వారా అమ్మాయి లేదా అబ్బాయి శరీరం ఎలా పని చేస్తుందో తెలుసుకుంటారు. అలాగే అతని లైంగిక పనితీరు ఏంటో కూడా మీకే తెలుస్తుంది.

మీ భాగస్వామిని ముద్దుల్లో ముంచెత్తే ముందు ఈ విషయాలను మరవొద్దు సుమా...!మీ భాగస్వామిని ముద్దుల్లో ముంచెత్తే ముందు ఈ విషయాలను మరవొద్దు సుమా...!

మెడపై ముద్దు..

మెడపై ముద్దు..

మీ ప్రియుడు లేదా ప్రియురాలు మీ మెడపై ముద్దు పెడితే మీతో తీవ్రమైన ప్రేమ వ్యవహారంలో ఉన్నారని అర్థం. ఈ ముద్దు అన్ని ముద్దుల కంటే ఉత్తమ ముద్దుగా పరిగణించబడతుంది. శృంగారాన్ని ఇష్టపడే వారిలో చాలా మంది మహిళల మెడపైనే ఎక్కువగా ముద్దు పెట్టుకుంటారు. మీ ప్రియుడు మిమ్మల్ని మెడపై ముద్దు పెట్టుకున్నప్పుడు, మీరు ఆ సమయంలో అతనితో ఉండాలని కోరుకుంటారు.

చెంపపై ముద్దు..

చెంపపై ముద్దు..

మీ ప్రియుడు లేదా ప్రియురాలు మీ చెంపపై ముద్దు పెడితే తన ఆందోళనను వ్యక్తం చేస్తున్నారని అర్థం. అయితే వారు తమ ప్రేమను మీకు తెలియజేయాలని కోరుకుంటారు. అయితే వారు తమ లైంగిక కోరికను మీకు తెలియజేయడానికి ఇష్టపడరు. వారి ప్రస్తుత అవసరం ప్రేమ మాత్రమే అని మీరు గుర్తుంచుకోవాలి.

ఛాతీపై ముద్దు...

ఛాతీపై ముద్దు...

మీ ప్రియుడు లేదా ప్రియురాలి ఛాతీపై ముద్దు పెట్టడం ద్వారా వారు మీతో కలయికను కోరుతున్నాడని అర్థం. తమలో తాము కోరికను, కామాన్ని వ్యక్తపరచాలనుకునే పురుషులు రొమ్ములపై ముద్దు పెట్టుకుంటారు.

ఫ్రెంచ్ కిస్..

ఫ్రెంచ్ కిస్..

ముద్దు పెట్టేటప్పుడు అమ్మాయి నాలుక అబ్బాయి నాలుకకు తగిలితే.. దాన్నే ఫ్రెంచ్ కిస్ అంటారు. దీన్ని టంగ్ కిస్ అని కూడా అంటారు. ఇద్దరూ ఇలాంటి ముద్దు పెట్టుకున్నారంటే వారిద్దరూ చాలా దగ్గరైపోయారని అర్థం.

ఎస్కిమో కిస్..

ఎస్కిమో కిస్..

మంచు ప్రదేశంలో ఉండే ఎస్కిమోల నుండి పుట్టిన ముద్దు ఇది. నిజానికి ఇది ముద్దు కాదు. మీ భాగస్వామి ముక్కుని, మీ ముక్కుకి ఆనించి అటు, ఇటు తిప్పాలి. మీరిద్దరూ గాఢమైన ముద్దుల్లో ఒకటి కాకపోయినా పెళ్లయిన కొత్తల్లో రొమాన్స్ ప్రారంభించేందుకు, ఇద్దరి మధ్య ఉన్న బలమైన ప్రేమను, ఆనందాన్ని పంచుకునేందుకు చక్కని ఎంపిక.

ఏంజిల్ కిస్..

ఏంజిల్ కిస్..

మీ పార్ట్నర్ కళ్లలో కళ్లు పెట్టి.. పెదాలపై సుకుమారంగా పెట్టే కిస్ ను ఏంజిల్ కిస్ అంటారు. ఇది ప్రేమను, సాన్నిహిత్యాన్ని చూపేందుకు చక్కని మార్గం. మీ స్వచ్ఛమైన ప్రేమను ఈ ముద్దు సాయంతో చెప్పొచ్చు.

టీజర్ కిస్..

టీజర్ కిస్..

మీరు నుదుటి దగ్గర నుండి ప్రారంభించి బుగ్గలు, పెదాలు, చేతులు, ఇలా కింద వరకూ కిస్ చేసుకుంటూ పోయే ప్రక్రియనే టీజర్ కిస్ అంటారు. ఈ ముద్దు బెడ్ పడుకుని పై నుండి కిందవరకూ కిస్ చేయడం వల్ల మీరు రొమాన్స్ కు రెడీ అయినట్లు పార్ట్నర్ కు హింట్ ఇచ్చినట్టవుతుంది.

ఫుట్ కిస్..

ఫుట్ కిస్..

మీరు మీ భాగస్వామి అరికాళ్లను ముద్దు పెట్టుకుంటే.. చాలా మందికి కితకితలు పెట్టినట్టుగా ఉంటుంది. ఆ సమయంలో వారు చాలా సంతోషంగా ఉంటారట. అంతేకాదు అరికాళ్లలో చాలా నరాల కొనలు ఉండటం వల్ల అక్కడ ముద్దు పెడితే.. ఒళ్లంతా మత్తెక్కినట్టుగా అనిపిస్తుందట.

బటర్ ఫ్లై కిస్..

బటర్ ఫ్లై కిస్..

మీ భాగస్వామికి చాలా దగ్గరగా నిలబడి చేసే కిస్.. ఎంతలా అంటే మీ ఇద్దరి మధ్య కనీసం గాలి కూడా దూరలేనంత దగ్గరగా నిలబడి లేదా పడుకొని పెట్టే ముద్దునే బలర్ ఫ్లై కిస్ అంటారు. దీంట్లో భాగంగా మీ కనుబొమ్మలు కూడా ఒకరికొకరు తగిలేలా ఉంటుంది. దీన్ని బట్టి మీ పార్ట్నర్ మిమ్మల్ని పిచ్చిపిచ్చిగా ప్రేమిస్తున్నారని అర్థం.

ఫ్లయింగ్ కిస్..

ఫ్లయింగ్ కిస్..

మీకు ఇష్టమైన వ్యక్తి దూరంగా ఉంటే.. తనని కిస్ చేయాలని అనిపిస్తే.. ఆ సమయంలో ఇచ్చే కిస్ నే ఫ్లయింగ్ కిస్ లేదా ఎయిర్ కిస్ అంటారు. అయితే ఈ కిస్ మీ భాగస్వామితో ప్రయత్నించకండి. ఎందుకంటే ఇది చాలా అన్ రొమాంటిక్ గా ఉంటుంది.

English summary

International Kissing Day : Different Types Of Kisses & Meanings in Telugu

Here we are talkin about the International Kissing Day : Different Types Of Kisses & Meanings in Telugu. Have a look
Story first published:Tuesday, July 6, 2021, 14:48 [IST]
Desktop Bottom Promotion