For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

International women's day 2023:ప్రతి ఒక్క అమ్మాయికీ ప్రేరణనిచ్చే మహిళలు వీరే...

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారతదేశంలో స్ఫూర్తిదాయక మహిళల గురించి ఓసారి గుర్తు చేసుకుందాం.

|

ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటారు. ఈ మహిళా దినోత్సవం 1908వ సంవత్సరంలో ప్రారంభమైనప్పటికీ, దీనిని ఐక్యరాజ్యసమితి(UNO) 1975లో గుర్తించింది. అప్పటి నుండి ప్రతి ఏటా ప్రపంచంలోని అనేక దేశాల్లో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

International womens day 2021: Indias Most Inspiring Women Telugu

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం యొక్క ముఖ్య లక్ష్యం మహిళల హక్కులను ప్రోత్సహించడం మరియు ప్రపంచ శాంతిని కాపాడటం.

International womens day 2021: Indias Most Inspiring Women Telugu

వాస్తవానికి, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఉన్నాయి, ఇక్కడ మహిళలు తమ హక్కుల కోసం ఆందోళన చేయాల్సి ఉంటుంది. ఏదేమైనా, చాలా దేశాలలో, కాలక్రమేణా, మహిళలు తమ కదలికలలో గెలిచారు మరియు మహిళల పట్ల పరిస్థితి కూడా మారిపోయింది. కానీ ఇప్పుడు మహిళల పట్ల ప్రజల వైఖరి ప్రపంచవ్యాప్తంగా మారడం ప్రారంభించింది. అటువంటి పరిస్థితిలో, రాజకీయాలు, విద్య, కళలు మరియు ఇతర రంగాలలో మహిళల భాగస్వామ్యం పెరగడం ప్రారంభమైంది.

International womens day 2021: Indias Most Inspiring Women Telugu

అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క ఉద్దేశ్యం రాబోయే సంవత్సరాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతుంది. ఈ సందర్భంగా మన దేశంలో కూడా మహిళలకు గొప్ప చరిత్ర ఉంది. చరిత్రను పరిశీలిస్తే రాజకీయాలు, కళలు, విజ్ణానశాస్త్రం, క్రీడలు తదితర రంగాలలో చాలా మంది భారత మహిళలు ఎందరో అమ్మాయిలకు ప్రేరణగా నిలిచారు. ఈ మహిళా దినోత్సవం భారతదేశంలో ఉత్తేజకరమైన మహిళల(విజయవంతమైన వీరనారమణులు) గురించి చెబుతోంది. ఈ సందర్భంగా తమ తమ రంగాలలో భారతదేశంలో మొట్టమొదటగా అడుగుపెట్టిన మహిళల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

#HimaDas: హిమదాస్ ఎవరు? ఇంత చిన్న వయసులో డిఎస్పీ ఎలా అయ్యిందో తెలుసా...#HimaDas: హిమదాస్ ఎవరు? ఇంత చిన్న వయసులో డిఎస్పీ ఎలా అయ్యిందో తెలుసా...

ఆనందీబాయి గోపాల్ రావ్ జోషి..

ఆనందీబాయి గోపాల్ రావ్ జోషి..

ఈమె 1887వ సంవత్సరంలో మొదటిసారిగా భారతదేశంలో మహిళా వైద్యురాలిగా నియమితులయ్యారు. పాశ్చాత్య వైద్యంలో శిక్షణ పొందిన మొదటి భారతీయ మహిళ మరియు యునైటెడ్ స్టేట్స్(US)అమెరికాకు ప్రయాణించిన మొదటి మహిళ కూడా ఈమెనే కావడం విశేషం. ఈమె నుండి స్ఫూర్తి పొందిన ఎందరో మహిళలు నేడు డాక్టర్లుగా మారారు. మారుతున్నారు కూడా.

షీలా దావ్రే..

షీలా దావ్రే..

PC : Jansatta

ఈమె మగవారికే సాధ్యమనుకున్న ఆటో రంగంలోకి అడుగుపెట్టినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. దేశంలో షీలా దావ్రే.. తొలి మహిళా ఆటో రిక్షా డ్రైవర్ అయ్యారు. మహారాష్ట్రలోని పూణెకు చెందిన దావ్రే ప్రస్తుతం శిక్షణ పొందిన డ్రైవర్లుగా మారాలని కోరుకునే మహిళలందరికీ ఆదర్శంగా నిలిచారు. అంతేకాదు ఈమె ఒక డ్రైవింగ్ ట్రైనింగ్ అకాడమీని కూడా ప్రారంభించాలనుకుంటున్నారు.

అరుణిమా సిన్హా..

అరుణిమా సిన్హా..

మన భారతదేశంలో మొట్టమొదటిసారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మహిళగా అరుణిమా సిన్హా కొత్త రికార్డు నెలకొల్పారు. ఈమె జాతీయ స్థాయి వాలీబాల్ ప్లేయర్ గా కూడా రాణించారు. అయితే ఈమె ఒంటికాలితో ఈ పర్వతాన్ని అధిరోహించడం మరో విశేషం. ఎందుకంటే తనకు ఓ ప్రమాదంలో ఒక కాలు తీసివేయాల్సి వచ్చింది.

ఉమెన్స్ డే 2021 : ఈ భూమి మీద అత్యంత శక్తిమంతురాలు ‘ఆమె‘నే.. ఆమె తర్వాతే ఎవరైనా...ఉమెన్స్ డే 2021 : ఈ భూమి మీద అత్యంత శక్తిమంతురాలు ‘ఆమె‘నే.. ఆమె తర్వాతే ఎవరైనా...

రీటా ఫరియా పావెల్..

రీటా ఫరియా పావెల్..

PC:Jagran

రీటా ఫరియా పావెల్

ఈమె ఒక భారతీయ మోడల్. అంతేకాదు మహిళా వైద్యరాలు కూడా. అయితే ఈమె అందాల పోటీలో అనూహ్యంగా విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. 1996 సంవత్సరంలో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న మొట్టమొదటి ఆసియా మహిళగా రికార్డు నెలకొల్పింది. డాక్టర్ గా అర్హత సాధించిన తొలి మిస్ వరల్డ్ విజేతగా కూడా ఈమెనే కావడం విశేషం.

ఆర్తి సాహా..

ఆర్తి సాహా..

మన దేశానికి స్వాత్యంత్య్రం వచ్చిన కొన్ని సంవత్సరాలకే.. ఆర్తి సాహా 1959 సంవత్సరంలో ఇంగ్లీస్ ఛానెల్ లో ఈత కొట్టిన తొలి భారత మహిళా మరియు ఆసియా మహిళ. ఈమె ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం 1960 సంవత్సరంలోనే పద్మశ్రీ అవార్డు అందజేసింది.

మిథాలీ రాజ్..

మిథాలీ రాజ్..

మన తెలుగమ్మాయి అయిన మిథాలీ రాజ్ క్రికెట్లో కెప్టెన్ గానే కాదు.. టెస్టు క్రికెట్లో తొలిసారి డబుల్ సెంచరీ చేసిన మహిళగా కొత్త రికార్డు నెలకొల్పింది. 2004లో న్యూజిలాండ్ తో జరిగిన టెస్టు మ్యాచ్ లో 214 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. ప్రపంచంలోనే ఇలాంటి అరుదైన ఘనతను సాధించిన తొలి మహిళగా మన మిథాలీరాజ్ నిలిచింది.

ఇందిరా గాంధీ..

ఇందిరా గాంధీ..

మన దేశపు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ చెరగని ముద్ర వేశారు. 1966 నుండి 1977 వరకు ఈమె ఆ బాధ్యతను విజయవంతంగా నిర్వహించారు. అంతేకాదు 1999లో బిబిసిలో నిర్వహించిన ‘ఉమెన్ ఆఫ్ ది మిలీనియం' పోల్ లో ఇందిరా గాంధీ పేరు ముందు వరుసలో నిలిచింది. ఈమె సేవలను గుర్తించిన ప్రభుత్వం 1971 సంవత్సరంలో భారతరత్న అవార్డు అందజేసింది. ఈ అవార్డు అందుకున్న తొలి భారత మహిళగానూ మరో రికార్డు సాధించారు ఇందిరా గాంధీ.

కల్పనా చావ్లా..

కల్పనా చావ్లా..

మన భారతదేశం తరపున అంతరిక్షం చేరుకున్న తొలి మహిళగా కల్పనా చావ్లా సరికొత్త రికార్డు నెలకొల్పారు. 1997లో మిషన్ స్పెషలిస్ట్ మరియు ప్రాథమిక రోబోటిక్ ఆర్మ్ ఆపరేటర్ గా అంతరిక్షంలోకి వెళ్లింది.

కిరణ్ బేడీ..

కిరణ్ బేడీ..

1972 సంవత్సరంలోనే ఇండియన్ పోలీస్ సర్వీస్(IPS)లో చేరి తొలి మహిళా పోలీస్ ఆఫీసర్ గా రికార్డు నెలకొల్పారు. అంతేకాదు 2003లో ఐక్యరాజ్య సమితికి సివిల్ పోలీస్ సలహాదారుగా నియమించబడ్డారు. ఇందులో తొలి మహిళగా కిరణ్ బేడీనే నిలిచారు.

అంజలి గుప్తా..

అంజలి గుప్తా..

భారత వైమానిక దళంలో కోర్టు మార్టియల్ చేసిన మొట్ట మొదటి మహిళగా అంజలి గుప్తా రికార్డు నెలకొల్పారు. ఈమె బెంగళూరులోని ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్స్ అండ్ టెస్టింగ్ ఎస్టాబ్లిష్మెంట్ యూనిట్ కోసం పనిచేసేవారు. అంజలీగుప్త ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి సోషియాలజీలో మాస్టర్స్ పూర్తి చేశారు. 2001లో తొలిసారిగా బెల్గాంలో డ్యూటీలో జాయిన్ అయ్యారు.

English summary

International women's day 2023: India's Most Inspiring Women Telugu

Here we are talking about the International women's day 2023: India's Most Inspiring Women Telugu. Read on
Desktop Bottom Promotion