Latest Updates
-
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు! -
ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం! -
గురు గ్రహ సంచారం..ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం..మీ రాశి ఇందులో ఉందా? -
షుగర్ పేషెంట్స్,బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ..ఎలా చేసుకోవాలంటే.. -
గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రెషర్ కుక్కర్ మూత పక్కల నుండి ఆవిరి లీక్ అవుతోందా? ఈ చిట్కాతో ఆ సమస్యకు చెక్! -
సిరిసంపదలు పెరగాలంటే ఇల్లు ఎలా తుడవాలి? కచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలు -
నవరాత్రి ఉపవాస స్పెషల్.. నానబెట్టే పనే లేకుండా అప్పటికప్పుడు సగ్గుబియ్యం వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా..
ఈ ఉమెన్స్ డే కి, అమ్మ, సోదరి, భార్య మరియు గర్ల్ ఫ్రెండ్ కు ఈ ప్రత్యేకమైన భహుమతులిచ్చి వారి మనస్సు గెలుచుకోండి.
ఈ ఉమెన్స్ డే కి, అమ్మ, సోదరి, భార్య మరియు గర్ల్ ఫ్రెండ్ కు ఈ ప్రత్యేకమైన భహుమతులిచ్చి వారి మనస్సు గెలుచుకోండి.

ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీ. ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవాన్ని ఒక థీమ్ తో జరుపుకుంటారు,. ఈ సంవత్సరం థీమ్ ఏంటో తెలుసా? ఈ సంవత్సరం 'ఎంబ్రేస్ ఈక్విటీ'గా జరుపుకోబుతున్నారు. మహిళా దినోత్సవం అనేది కుటుంబం, సమాజం మొదలైన వాటిలో మహిళల భాగస్వామ్యం ఎంతైనా ఉంది, వారి ఉనికి , సహకారం మరియు బలాన్ని , సామర్థ్యాన్ని అభినందించడానికి , మహిళాదినోత్సవంను సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక రోజు. ఈ సందర్భంగా మీరు మీకు ఇష్టమైన వ్యక్తులకు ముఖ్యంగా అమ్మ, చెల్లి, అక్క, ఒక టీచర్, ఒక గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా సరే వారి మీరు ఓ ప్రత్యేమైన బహుమతులు ఇవ్వడం ద్వారా మీ జీవితంలో వారికి ఎంత ప్రాముఖ్యత ఉందో మీరు తెలియజేవచ్చు. అందుకు మీరు ఎంపిక చేసుకోగలిగే బహుమతులు ఈ క్రింది విధంగా ఉన్నాయి..

బుక్స్:
చాలా మంది మహిళలకు పుస్తకాలు చదివే అలవాటు ఉంటుంది. ఒకరిని చెప్పలేం కానీ అమ్మ, చెల్లి, అక్క, అత్త మరియు స్నేహితురాలు అందరికీ ఈ అలవాటు ఉండేటుంది. వారి నచ్చిన బుక్స్ కొని బహుమతిగా ఇవ్వండి, వారి కళ్ళులో ఆనందం చూడండి. అందుకోసం పుస్తకాలు ఫిక్షన్-నాన్-ఫిక్షన్, కామెడీ, కవిత్వం, నవల, కళ మరియు సాహిత్య ప్రపంచానికి సంబంధించిన ఏదైనా పుస్తకాన్ని బహుమతిగా ఇవ్వవచ్చు.

పచ్చని మొక్కలు:
ఈ ట్రెండ్ ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. ఎందుకంటే ఆ మొక్కలను చూసినప్పుడు మనస్సుకు ప్రశాంత ఏర్పడుతుంది. ఇంట్లో పచ్చదనం ఉంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పాజిటివ్ ఆలోచనలు వస్తాయి . ఇంట్లో వాతవరణం తాజాగా ఉంటుంది. మహిళలకు మొక్కలను పెంచుకునేందుకు ఇష్టపడుతారు కాబట్టి, పచ్చిని వారికి ఇష్టమైన మొక్కలను బహుమతిగా ఇవ్వండి.

గిఫ్ట్ హ్యాంపర్లు-
ఈ రోజుల్లో గిఫ్ట్ హ్యాంపర్లు ఇచ్చే ట్రెండ్ కూడా చాలా ఉంది. ఇలా గిఫ్ట్ కూపన్లు, గిఫ్ట్ హ్యాంపర్ల రూపంలో వారికి ఇస్తే వారికి ఇష్టమైన వస్తువులను కొనుక్కుంటారు.

వాచ్, మొబైల్ -
మీ సోదరి, తల్లి లేదా స్నేహితుడికి వాచ్ లేదా మొబైల్ అవసరమైతే, మీరు వారికి ఈ బహుమతిని ఇవ్వడం ద్వారా వారు ఆశ్చర్యపరపోవచ్చు. మీ సోదరి లేదా తల్లి మొబైల్ సరిగ్గా పని చేయకపోవటం వలన వారు కొత్తది కొనవలసి ఉంటుంది. ఇలాంటి సందర్భంలో స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్ లను ఇవ్వండి. వారి ముఖంలో సంతోషం చూడండి.

ఇయర్‌బడ్‌లు-
ఈ రోజుల్లో ప్రజలు ఇయర్‌బడ్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది, ఏ పనిచేస్తున్నా ఇయర్ బడ్స్ వినియోగించడం వల్ల పనిలో స్ట్రెస్ అనిపించదు, వారు సంతోషంగా ఉన్నప్పుడల్లా మిమ్మల్ని వారు గుర్తు చేసుకుంటునే ఉంటారు.

హ్యాండ్‌బ్యాగ్‌లు-
మహిళలకు ఎన్ని రకాల హ్యాండ్ బ్యాగ్‌లు ఉన్నా తక్కువే. కాబట్టి ఆమెకు మరొక స్టైలిష్ డిజైన్ హ్యాండ్‌బ్యాగ్‌ను బహుమతిగా ఇవ్వండి.

ఆభరణాలు, వస్త్రాలు-
ఆభరణాలు, వస్త్రాలు- స్త్రీలకు ఆభరణాలు, బట్టలంటే చాలా ఇష్టం. ఆమె షాపింగ్ కోసం ఇంటి నుండి బయలుదేరినప్పుడు, ఆమె ఎప్పుడూ వీటిలో కొన్నింటిని కొనుగోలు చేస్తుంది. మీ ఇంట్లో ఎవరికైనా బట్టలు లేదా ఆభరణాలు అవసరమని మీకు అనిపిస్తే, మీరు దానిని కొనుగోలు చేసి బహుమతిగా ఇవ్వాలి.



Click it and Unblock the Notifications
