Latest Updates
-
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా? -
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే.. -
ఫోన్ పక్కనపెట్టి ఇది ట్రై చేయండి.. హృతిక్ చెబుతున్న హెల్త్ టిప్స్! -
నార్త్ స్టైల్ చోలే మసాలా.. పూరీ, చపాతీలోకి వేళ్లు చప్పరిస్తూ లాగించేస్తారు.!
International Women's Day 2023: స్త్రీలు పెళ్లయ్యాక పొందే ప్రత్యేక హక్కులేంటో తెలుసా?
పెళ్లి అయిన తర్వాత మహిళలు కొన్ని ప్రత్యేక హక్కులు పొందుతారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పెళ్లి తర్వాత అమ్మాయి పరిస్థితి చాలా మారిపోతుంది. పుట్టినింటిని వదిలి మెట్టినింటికి వచ్చిన ఆ అమ్మాయి కొత్త మనుషుల మధ్య తన జీవితాన్ని గడపాల్సి ఉంటుంది. వారంతా అలవాటు అవ్వడానికి కాస్త సమయం పట్టినా ఆ తర్వాత అదే తన ఇల్లుగా మారిపోతుంది.

ఇదేదో ఊరికే అంటున్న మాట కాదు. మనుషులతో పాటు ఆస్తిపాస్తులపై కూడా ఆ అమ్మాయికి అధికారం వస్తుంది. ఈ అధికారాన్ని దేశ చట్టాలే మనకు కల్పించాయి.పెళ్లై అత్తారింటికి వచ్చిన అమ్మాయిని ఆ ఇంట్లో నుంచి పంపించే హక్కు ఎవరికీ ఉండదు.కానీ ఈ హక్కులపై మహిళలకు ఎలాంటి అవగాహన లేదు. ఇలాంటి వాటి వల్ల చాలా మంది మహిళలు సమస్యలు ఎదుర్కుంటున్నారు. అయితే వాటన్నిటికి మీరే చెక్ పెట్టేలా చేసుకునేందుకు కావాల్సిన అన్ని హక్కుల గురించి మేము ఇప్పుడు చెప్పబోతున్నాం.
ఈ విషయాలు తెలుసుకోవడం వల్ల పెళ్లైన స్త్రీ తన హక్కులను తెలుసుకుని, తన అత్తమామల ఇంట్లో తల ఎత్తుకుని ఉండడానికి, ఆమె ఎవరి ముందు తలవంచాల్సిన అవసరం లేకుండా చేస్తాయి.

విడాకులు తీసుకుంటే మరో ఇల్లు కట్టించాల్సిందే:
పెళ్లి అయిన ప్రతీ స్త్రీకి తన పిల్లల పోషణ, చదువు, ఆరోగ్యం బాధ్యత తన భర్తపైనే ఉంటుంది. భర్త ఈ బాధ్యతలను నెరవేర్చకుండా ఉండకూడదు. భార్యగా వచ్చిన ప్రతీ అమ్మాయి బాధ్యత మొత్తం భర్తపైనే ఆధారపడి ఉంటుంది.
అలాగే ఓ వ్యక్తికి భార్యగా మారిన తర్వాత అమ్మయి పూర్తిగా వారి ఇంట్లోనే నివసిస్తుంది. ఆ ఇంట్లో ఆమెకు కూడా పూర్తి స్థానాన్ని కల్పించారు. ఆమెను ఇంట్లోంచి ఎవరూ వెళ్లగొట్టలేరు. ఒకవేళ విడాకులు తీసుకుంటే.. ఈమెకు భర్త మరో ఇల్లు కట్టించే వరకు ఆమె అక్కడే నివసించే హక్కు కూడా ఉంటుంది.
ఈ హక్కును హిందూ దత్తత మరియు నిర్వహణ చట్టం కింద కల్పించారు. అలాగే వివాహిత స్త్రీకి అత్తమామల ఆస్తిపై హక్కు ఉంటుంది. హిందూ వివాహ చట్టం 1995 ప్రకారం వివాహ సమయంలో తన తండ్రి, అత్తమామల నుంచి బహుమతిగా పొందిన నగలు మరియు డబ్బు పూర్తిగా స్త్రీకే సొంతం.

గర్భం తీయించుకోవడానికి భర్త అనుమతి అవసరం లేదు:
అలాగే ఒక స్త్రీ తన భర్త అనుమతి లేకుండానే హిందూ వివాహ చట్టం 1995 సెక్షన్ 13 ప్రకారం విడాకులు కోరవచ్చు. దీంతో పాటు స్త్రీ తన భర్త నుంచి మెయింటనెన్స్ ఛార్జీని కూడా డిమాండ్ చేయవచ్చు.
అదే సమయంలో ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 125 ప్రకారం ఆమె మరియు ఆమె పిల్లల నిర్వహణ కోసం, ఆర్థిక నిర్వహణను డిమాండ్ చేసే హక్కు ఆమెకు ఉంది. పుట్టబోయే బిడ్డను గర్భస్రావం చేసే హక్కు స్త్రీకి ఉంది.
ఇందుకోసం ఆమెకు తన భర్త లేదా అత్తమామల అనుమతి అవసరం లేదు. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971 ప్రకారం, గర్భం 24 వారాల కంటే తక్కువ ఉన్నట్లయితే స్త్రీ తన గర్భాన్ని ఎప్పుడైనా తీయించుకోవచ్చు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కూడా ఒక స్త్రీ 24 వారాల తర్వాత కూడా అబార్షన్ చేయించుకోవచ్చు.

భర్త బీమా సొమ్ముపై భార్యకు హక్కు:
రుణదాతలు లేదా బంధువులు డెత్ క్లెయిమ్ డబ్బును క్లెయిమ్ చేయలేరు. మరోవైపు ట్రస్ట్ డబ్బుపై భర్త, భార్య, పిల్లలకు హక్కు ఉంటుంది. వివాహిత మహిళల రక్షణ చట్టం 1874లోని సెక్షన్ 6లో ఈ నిబంధనలు ఈ విషయాల గురించి స్పష్టంగా తెలిపారు.
అలాగే తన భర్త లేదా అత్తమామలు తనను శారీరకంగా, మానసికంగా హింసించినా లేదా ఆర్థికంగా హింసించినా గృహహింస చట్టం 2005 కింద ఫిర్యాదు చేసే హక్కు స్త్రీకి ఉంటుంది.



Click it and Unblock the Notifications