For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

International Yoga Day2022:యోగా ఈ తారల జీవితాన్నే మార్చేసిందని తెలుసా...

|

భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాల క్రితమే కనుగొనబడ్డ యోగా కొందరికి వ్యాయామం అయితే.. మరికొందరికి అది ఇప్పుడు ఓ జీవనశైలి. ప్రపంచంలోని అనేక మంది నిపుణులు యోగా వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు.

అయితే ఈ యోగాసనాలు వేయడానికి ఆసక్తి చూపేది చాలా తక్కువ మందే అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో యోగా చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది.. దాన్ని తమ లైఫ్ స్టైల్ లో భాగంగా చేసుకున్నవారు ఎందరో ఉన్నారు. వాటి వల్ల వారు పొందిన ప్రయోజనాలను కూడా మనం వింటూ ఉంటాం.

అయితే అలాంటి వారిలో మన భారతీయ ప్రముఖులు కూడా ఎక్కువ మందే ఉన్నారు. యోగా వల్ల తమ శరీరాన్ని పూర్తిగా ఫిట్ గా మార్చుకోవడమే కాకుండా, తమ జీవనశైలిని సైతం మార్చుకొన్నారట. ఇంతకీ ఆ సెలబ్రిటీలెవరో మీరే చూడండి...

International Yoga Day 2021: ఈ యోగాసనాల వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా...

అనుష్క శెట్టి..

అనుష్క శెట్టి..

టాలీవుడ్ పొడుగు కాళ్ల సుందరి, కర్నాటక అందాల భామ అనుష్క శెట్టి సినిమాల్లోకి అడుగు పెట్టకముందు యోగాను తన లైఫ్ స్టైల్ లో భాగంగా చేసుకుంది. అంతేకాదు తను యోగా గురువుగా ఎందరికో శిక్షణ కూడా ఇచ్చేదట. అందుకే తను ఇప్పటికీ పూర్తిగా ఫిట్ గా ఉంటోంది. అనుష్క అనునిత్యం యోగా చేయడం వల్ల ఇంత వయసులోనూ తాను పూర్తిగా ఫిట్ గా ఉన్నానని పలు ఇంటర్వ్యూల్లో సైతం చెప్పింది. మీకు వీలైనప్పుడల్లా యోగా చేయమని కూడా అనుష్క చెబుతూ ఉంటుంది. ఇలా నిత్యం యోగా చేయడం వల్ల మానసిక శాంతి లభిస్తుందని చెబుతోంది. తాను సినిమాలలో ఎంత బిజీగా ఉన్నా.. ప్రతిరోజూ యోగా తప్పనిసరిగా చేస్తుందట. దాని వల్ల తాను ప్రశాంతమైన జీవితం, సానుకూల ఆలోచనలు చేస్తూ, పూర్తి ఫిట్ గా ఉన్నానని అంటోంది.

కరీనా కపూర్..

కరీనా కపూర్..

బాలీవుడ్ జీరో సైజ్ సుందరీ కరీనా కపూర్.. సినిమాల్లోకి రావడానికి ముందు చాలా లావుగా ఉండేదట. అయితే కేవలం సినిమాల కోసం చాలా వెయిట్ లాసయ్యిందట. ‘తషాన్' సినిమా సమయంలో సైజ్ జీరోకి తగ్గి.. అమ్మాయిలందరినీ ఆశ్చర్యపరిచింది. దానంతటికీ కారణం యోగానే అంటోంది ఈ బాలీవుడ్ భామ. అయితే తాను బరువు తగ్గడానికి యోగా ప్రారంభించలేదట. తాను ఎల్లప్పుడూ పూర్తి ఫిట్ గా ఉండేందుకు, ప్రతిరోజూ చాలా చురుకుగా ఉండేందుకు ఈ యోగా ఉపయోగపడిందని చెబుతోంది. కరీనా ప్రతిరోజూ దాదాపు 50 రకాల సూర్య నమస్కారాలు, సుమారు 45 నిమిషాల పాటు ఇతర యోగాసనాలు చేస్తుందట. అలాగే నిత్యం ఊపిరితిత్తులు మెరుగుపడే కపాలభాతి ప్రాణాయామం చేస్తుందట. తను ఒక్కరోజు యోగా చేయడం మిస్సయినా.. ఆరోజు తాను ఏదో కోల్పోయిట్టు అనిపిస్తుందట.

శిల్పా శెట్టి..

శిల్పా శెట్టి..

బాలీవుడ్ సన్నగా.. జాజితీగలా కనిపించే అందాల భామ ఎవరంటే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు శిల్పాశెట్టి. ఈ పొడుగు కాళ్ల సుందరి కొన్ని సంవత్సరాలుగా యోగా సాధన చేస్తోంది. తన అందం పెరగడానికి, పూర్తి ఫిట్ నెస్ కు కారణం యోగానే అనే చెబుతోంది. ఈ బాలీవుడ్ బ్యూటీ కొన్నిసార్లు యోగా గురువు బాబా రాందేవ్ తో కలిసి కూడా పలు ఈవెంట్లలో యోగా సాధన చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే మంచి బాడీ కోసం తాను యోగా చేయలేదట. తాను కొన్ని సంవత్సరాల క్రితం సర్వైకల్ స్పాండిలైటిన్ సమస్యతో ఇబ్బంది పడిందట. ఆ సమయంలో యోగా వల్ల ఈ సమస్య తగ్గుతుందని భావించి, యోగాను ప్రయత్నించిందట. తాను అనుకున్నట్లే తన ఆరోగ్య సమస్య తగ్గడంతో, తన లైఫ్ స్టైల్ లో యోగాను ఒక భాగం చేసుకుంది. అంతేకాదు ఎక్కువగా ప్రయాణాలు చేసే వారికి, యోగా మంచి వ్యాయామంలా ఉపయోగపడుతుందని చెబుతోంది ఈ బాలీవుడ్ బామ. తన కుమారుడికి చిన్ననాటి నుండే యోగా నేర్పిస్తోందట.

కోల్డ్ అండ్ ఫ్లూ తగ్గించడానికి యోగాసనాలు మరియు భంగిమలు

బిసాసా బసు..

బిసాసా బసు..

మరో బాలీవుడ్ బ్యూటీ బిపాసా బసు కూడా యోగాను తన లైఫ్ స్టైల్ లో భాగంగా మార్చేసుకుంది. యోగా అంటే తనకు ఇష్టమట. ఆస్టియో ఆర్థరైటిస్ సమస్యను తగ్గించుకోవడానికి యోగా చేయడం ప్రారంభించిందట. దీని వల్ల తన ఆరోగ్య సమస్యలు ఒక్కొక్కటిగా తగ్గిపోయాయట. యోగాను సరైన పద్ధతిలో చేస్తే అది మనకు ఆరోగ్య ప్రయోజనాలు అందివ్వడంలో ఎంతగానో సహాయపడుతుందని చెబుతోంది. యోగా వల్ల బరువు కూడా తగ్గుతామని.. చర్మం, జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటాయట. అందరికీ యోగా చేయడానికి సమయం దొరక్కపోతే.. రోజులో కనీసం 20 నిమిషాల పాటు యోగా చేసినా మనసు ప్రశాంతంగా మారుతుందని సలహా ఇస్తోంది బిపాసా.

సోనమ్ కపూర్..

సోనమ్ కపూర్..

బాలీవుడ్ లో సోనమ్ కపూర్ అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తను కూడా సినిమాల్లోకి అడుగు పెట్టడానికి ముందు చాలా లావుగా ఉండేదట. అందుకే మంచి బాడీ షేప్ వచ్చేందుకు యోగా చేయడం ప్రారంభించిందట. తొలుత సాధారణ యోగా చేసిన ఈ బాలీవుడ్ భామ.. క్రమంగా బిక్రమ్ యోగా చేస్తూ.. తన బరువు బ్యాలెన్స్ లో ఉంచుకుందట. ఇలా చేయడం వల్ల తన బరువు ఎప్పుడూ అదుపులో ఉంటుందని చెబుతోంది. సోనమ్ ఎప్పుడైనా.. ఎక్కడికెళ్లినా యోగా చేయడం మాత్రం మరచిపోదట. తన తండ్రి ఫిట్ నెస్ సీక్రెట్ కూడా అదేనట. సోమన్ కు గాల్లో వేలాడుతూ చేసే యోగా అంటే బాగా ఇష్టమట. అంతేకాదు ఇది చాలా సులభమట. దీని వల్ల బరువు సులభంగా తగ్గుతారని చెబుతోంది.

లారా దత్త..

లారా దత్త..

ఈ భామ యోగాను గత పన్నెండు సంవత్సరాలుగా సాధన చేస్తోందట. లారా, తన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు, కొద్ది రోజుల్లోనే ఫిట్ గా మారేందుకు యోగా బెస్ట్ ఆప్షన్ అని చెబుతోంది. లారా ప్రెగ్నెన్సీ తర్వాత యోగా చేయడం వల్ల పుట్టబోయే బిడ్డకు అనేక ప్రయోజనాలు అందుతాయని చెబుతోంది. అంతేకాదు.. సుఖ ప్రసవం కావాలంటే.. యోగా చేయాలని సూచిస్తోంది. అంతేకాదు ప్రెగ్నెన్సీ తర్వాత యోగా ఎలా చేయాలి? అలా చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటి? అనే వివరాలను చెబుతూ ఓ యోగా డివిడిని కూడా విడుదల చేసింది. ఇందులో ప్రెగ్నెన్సీ మహిళలకే కాదు.. బాలింతలకు ఉపయోగపడే యోగసనాలు ఉన్నాయి.

International yoga day: ఆత్మను నియంత్రిస్తే శరీరం మరియు మనస్సు ఆదీనంలో ఉంటాయి

కంగనా రనౌత్..

కంగనా రనౌత్..

బాలీవుడ్ వివాదస్పద, డేరింగ్ నటిగా గుర్తింపు పొందిన కంగనా రనౌత్ కూడా తన బాడీ పూర్తి ఫిట్ గా ఉండేందుకు యోగానే కారణమని చెబుతోంది. యోగాలోని ప్రాణాయామం చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెబుతోంది. తాను ఎంత బిజీగా ఉన్నప్పటికీ యోగా చేయడం వల్ల తనకు ప్రశాంతత లభిస్తుందని చెబుతోంది. కంగనా ఎక్కువగా వృశ్చికాసనం, నౌకాసనం, చక్రాసనం మరియు పద్మాసనాలు చేస్తుందట.

దీపికా పదుకొనే..

దీపికా పదుకొనే..

బాలీవుడ్ లో మరో పొడుగు కాళ్ల సుందరి దీపికా పదుకొనే.. ప్రతిరోజూ సూర్య నమస్కారంతో యోగాను ప్రారంభిస్తుందట. ఆ తర్వాత శర్వాంగసన, వీరభద్రాసన చేస్తుందట. దీని వల్ల తన బరువు, బ్రెయిన్, బాడీ అదుపులో ఉండేందుకు సహాయంగా ఉంటుందట. ప్రతిరోజూ తను 30-40 నిమిషాల పాటు యోగా మరియు ధ్యానం చేస్తుందట. యోగాతో పాటు డ్యాన్స్, స్ట్రెచింగ్ ఎక్సర్ సైజ్ చేస్తుందట. అలాగే బ్యాడ్మింటన్ ఆడుతుందట.

వీరితో పాటు సమంత, శ్రియ, రకుల్ ప్రీత్ సింగ్, సంజన, మంచు లక్ష్మీ తదితర టాలీవుడ్, బాలీవుడ్ అందాల భామలు సైతం తమ అందానికి, ఆరోగ్యానికి యోగానే కారణమని చెబుతున్నారు.

English summary

International Yoga Day2022 : Actors Who Love Doing Yoga

Becoming fit and healthy has always been on everybodys wish list. Celebrities like anushka shetty, Jacqueline Fernandez, Shilpa Shetty, Kareena Kapoor and many more follow yoga to achieve their stunning strctures, let them inspire you to start your yoga journey.
Desktop Bottom Promotion