For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

International Yoga Day 2022 : బాబా రాందేవ్ కన్నా ముందున్న ప్రముఖ యోగా గురువులు వీరే...

|

భారతదేశ ఆరోగ్య శాస్త్రాలలో యోగా ఒక అంతర్భాగం. ఇది ఐదు వేల సంవత్సరాల పురాతనమైనదని చరిత్రకారులు చెబుతున్నారు. యోగా వల్ల మానసిక మరియు శారీరక శ్రేయస్సు లభిస్తుంది.

ఇది మనసు, మన శరీరాన్ని ప్రభావితం చేస్తున్నందు వల్లే యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు మరియు ప్రజాదరణ వచ్చింది. ప్రస్తుతం ఈ కల్చర్ ను పాశ్చాత్య దేశాలలో కూడా పాటిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి కూడా యోగా యొక్క ఆరోగ్య ప్రయోజనాలను గుర్తించింది.

అందుకే 2015 నుండి ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవాలని ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ 2014లో ఈ యోగా దినోత్సవం గురించి ఐరాసకు సూచించారు. అప్పటినుండి జాతీయ యోగా దినోత్సవంగా ఉన్న యోగాకు ఒక్కసారిగా అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది. ప్రత్యామ్నాయ వైద్య పద్ధతుల విషయంలో భారతదేశం అందరికంటే ఎల్లప్పుడూ ఒకడుగు ముందే ఉంటుంది. ఈ సందర్భంగా భారతదేశంలోని గొప్ప యోగా గురువులెవరు? వారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

International Yoga Day 2021 : యోగాలో కీలక ఆసనాలు.. వాటి వల్ల కలిగే ప్రయోజనాలు...!

తిరుమలై క్రిష్ణమాచార్య..

తిరుమలై క్రిష్ణమాచార్య..

ఈయనను ‘ఆధునిక యోగా పితామహుడు'అని కూడా పిలుస్తారు. ఈయన విన్యాసాల యొక్క వాస్తు శిల్పిగా ప్రసిద్ధి చెందాడు. ఈ గురువుకు యోగాతో పాటు ఆయుర్వేద శాస్త్రంలోనూ మంచి పరిజ్ణానం ఉంది. ఈయన గుండె కదలికలపై ఎలా నియంత్రణ కలిగి ఉండాలో.. హార్ట్ బీట్ ను కంట్రోల్ చేసే కళలో ప్రావీణ్యం సాధించాడని చాలా మంది నమ్ముతారు.

స్వామి శివానంద..

స్వామి శివానంద..

ఈ గురువు వృత్తి రీత్యా వైద్యుడు మరియు సాధువు. ఈయన అందరినీ సులభంగా నవ్వించగలడు. ఈయన ఒక యోగికి ఉండాల్సిన 18 లక్షణాలను వివరించే పాటను సైతం రాశాడు. అందులో హాస్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. అందుకే ఈయన హాస్యం విషయంలో బాగా ప్రసిద్ధి చెందాడు. ఈ గురువు యోగా యొక్క సమ్మేళనం అయిన ట్రినిటీ యోగా నేర్పించారు.

బికెఎస్ అయ్యంగార్..

బికెఎస్ అయ్యంగార్..

తిరుమలై క్రిష్ణమాచార్య ప్రారంభ విద్యార్థులలో ఈయన ఒకరు. విదేశాలలో యోగా ప్రాచుర్యం పొందడం వెనుక ఈయన చేసిన క్రుషి విశేషమైనది. బాల్యం నుండి ఈయన అనేక వ్యాధులతో పోరాడాడు. అప్పుడు తను చాలా బలహీనంగా ఉండేవాడు. ఆ సమయంలో యోగాను చేయడం ప్రారంభించాడు. అదే సమయంలో పతంజలి యొక్క యోగా సూత్రాలను పునర్వించించాడు. చివరికి ఈయన ‘అయ్యంగార్ యోగా'ను ప్రపంచానికి బహుమతిగా ఇచ్చాడు. ఈయన 95 సంవత్సరాల వయసులో తుది శ్వాస విడిచాడు. అయితే అంత వయసులోనూ ఆయన విరామం లేకుండా అరగంట సేపు శీర్షాసనం చేయగలిగాడు.

International Yoga Day 2021: యోగాను ప్రపంచానికి పరిచయం చేసిందెవరో తెలుసా...

కె పట్టాభి జోయిస్..

కె పట్టాభి జోయిస్..

ఈ యోగా గురువు అష్టాంగ విన్యాస యోగా లేదా అష్టాంగ యోగాను పరిచయం చేశారు. దీన్ని యోగా కొరుంట అనే పురాతన గ్రంథం ఆధారంగా రూపొందించారు. ఈ యోగా బాలీవుడ్ మరియు హాలీవుడ్, టాలీవుడ్ తో సహా చాలా మంది ప్రముఖలను బాగా ఆకర్షించింది. అంతేకాదు చాలా మంది సెలబ్రెటీలు మంచి ఫిట్ నెస్ సాధించడానికి సహాయపడింది. ఉదాహరణకు కరీనా కపూర్, మడోన్నా, గ్వినేత్ పాల్ట్రో, అనుష్క వంటి వారు మంచి బాడీ షేప్ పొందారు.

మహర్షి మహేష్ యోగి..

మహర్షి మహేష్ యోగి..

ఈయన ఒక ప్రముఖ అమెరికన్ బ్యాండ్ బీటిల్స్ ను ఆకర్షించి పారదర్శక ధ్యాన పద్ధతిలో పరిపూర్ణత సాధించాడు. ఈ గురువు మంత్ర ధ్యానం యొక్క రూపం మరియు కళ్లు మూసుకుని ఎలా సాధన చేయడంలో నేర్పించాడు.

పరమహంస యోగానంద..

పరమహంస యోగానంద..

ఈ గురువు పాశ్చాత్య దేశాలలో పాశ్చాత్య క్రియా యోగా యొక్క సాంకేతికతను పరిచయం చేశాడు. ఈయన యోగా రూపం క్రియా అని పిలువబడే ఒక నిర్దిష్ట చర్య ద్వారా అనంతంతో ఏకం కావడానికి ఉద్ఘాటిస్తుందని వివరించారు.

బాబా రాందేవ్..

బాబా రాందేవ్..

ఇక బాబా రాందేవ్ విషయానికొస్తే.. ఈయన కాలంలో యోగా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈయన మన దేశంలో సామూహిక యోగా శిబిరాలు నిర్వహిస్తూ అందరిలో అవగాహన పెంచే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ప్రత్యక్ష ప్రసారాలు మరియు ప్రతి ఒక్కరూ ఇంట్లో టివి చూస్తూ సులభంగా యోగా సాధన చేయమని ప్రజలను ప్రోత్సహించారు.

English summary

International Yoga Day 2022 : Famous Yoga Gurus of India

Here are the international yoga day 2021 : Famous yoga gurus of india. Have a look
Desktop Bottom Promotion