For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Ipl 2021: ఐపిఎల్ ఫస్ట్ మ్యాచ్ ఎక్కడ.. ఎప్పుడు.. ఏ ఛానెల్ లో స్టార్టవుతుందనే పూర్తి వివరాలను ఇప్పుడే చూసెయ్యండి

ఐపిఎల్ 2021 లీగ్ యొక్క పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

|

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) అంటేనే బంతి బంతికి ఉత్కంఠ.. సిక్సర్ల హోరు.. బౌండరీల జోరు.. కళ్లు చెదిరే క్యాచులు.. రెప్ప పాటులో రివ్వున వికెట్లపైకి దూసుకొచ్చే బంతులు.. క్రీజులో చిరుత లాంటి పరుగులు.. అద్భుతమైన ఫీల్డింగుతో మ్యాచ్ మొత్తాన్ని మలుపు తిప్పే ఫీల్డర్లు..

Ipl 2021: Complete Schedule, Dates, Timings, Teams, Venue, Fixtures, Telecast

మ్యాచ్ మధ్యలో చీర్ గర్ల్స్ హడావుడి.. అభిమానుల సందడితో ఎంతో గొప్ప ప్రాధాన్యత సంతరించుకున్న ఐపిఎల్ 14వ సీజన్ మరి కొద్ది గంటల్లో ప్రారంభం కాబోతోంది. గత సంవత్సరం కరోనా కారణంగా దుబాయ్ లో జరగ్గా.. ఈ ఏడాది కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ మన దేశంలోనే నిర్వహిస్తున్నారు. ఈ నెల 9వతేదీ నుండి ఐపిఎల్ క్రికెట్ మ్యాచులు ప్రారంభం కానున్నాయి.

Ipl 2021: Complete Schedule, Dates, Timings, Teams, Venue, Fixtures, Telecast

ఈ క్రికెట్ మ్యాచుల కోసం దేశ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్లో మొత్తం 60 మ్యాచులు జరగనుండగా.. మే 30వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా ఐపిఎల్ మ్యాచ్ ఏ నగరంలో.. ఏ స్టేడియంలో ప్రారంభమవుతుంది.. ఏ ఛానెల్ లో లైవ్ వస్తుంది అనే వివరాలతో పాటు సంపూర్ణ సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం...

తొలి మ్యాచ్..

తొలి మ్యాచ్..

తొలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. శుక్రవారం సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ముంబై తరపున కెప్టెన్ గా రోహిత్ శర్మ, బెంగళూరు తరపున కెప్టెన్ గా విరాట్ కోహ్లీ బరిలో దిగనున్నారు. ముంబైలో భయంకరమైన బ్యాట్స్ మెన్లు, బౌలర్లతో పాటు అద్భుతమైన ఆల్ రౌండర్లు ఉన్నారు. ఇక బెంగళూరు జట్టులో బ్యాటింగ్ మాత్రమే బలంగా కనిపిస్తోంది.

చెన్నైలో చెడుగుడు మొదలు..

చెన్నైలో చెడుగుడు మొదలు..

ఐపిఎల్ 14వ సీజన్లో తొలి మ్యాచ్ తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోని చిదంబర స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ కు అభిమానులను అనుమతించడం లేదు. కరోనా నేపథ్యంలో కేవలం కొంతమంది వివిఐపిలకే ప్రవేశం లభించనుంది. అయితే ప్రతి ఒక్కరికీ లైవ్ గా చూసే అవకాశం ఉంటుంది. రెండో మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య వాంఖెడే మైదానంలో జరగనుంది.

ఐపిఎల్ మ్యాచులు..

ఐపిఎల్ మ్యాచులు..

ఐపిఎల్ మ్యాచులన్నీ భారత కాలమానం ప్రకారం, రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. ఇలా పది రోజుల పాటు రాత్రి పూట మ్యాచులు ప్రారంభం కాగా.. 18వ తేదీ నుండి మధ్యాహ్నం 3 గంటల నుండి మ్యాచులు ప్రారంభమవుతాయి. అప్పటి నుండి ప్రతిరోజూ రెండు మ్యాచులు జరగనున్నాయి. ఇక ఈసారి కరోనా కారణంగా మ్యాచులన్నీ ఢిల్లీ, బెంగళూరు, కొలకత్తా, ముంబై, చెన్నై, అహ్మదాబాద్ నగరాలలో మాత్రమే జరగనున్నాయి. మిగిలిన నగరాల్లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే పరిస్థితులను బట్టి ఈ మైదానాలను మార్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఎనిమిది జట్లు..

ఎనిమిది జట్లు..

ఈ ఐపిఎల్ 14వ సీజన్లోనూ ఎప్పటిలాగే 8 జట్లు పోటీలో పాల్గొనబోతున్నాయి. వీటిలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కత్తా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ ఐపిఎల్ మ్యాచులన్నీ స్టార్ స్పోర్ట్స్ ఛానెల్ లో ప్రసారం కానున్నాయి. అలాగే హాట్ స్టార్ యాప్ లోనూ లైవ్ మ్యాచెస్ చూసే అవకాశం ఉంటుంది. అయితే ఇందుకోసం ముందుగా సబ్ స్క్రిప్షన్ కోసం కొంత సొమ్మును ముందుగానే చెల్లించాల్సి ఉంటుంది.

English summary

Ipl 2021: Complete Schedule, Dates, Timings, Teams, Venue, Fixtures, Telecast

Here is everything you need to know about the 14th edition of IPL 2021 Indian Premiere League.
Story first published:Friday, April 9, 2021, 0:07 [IST]
Desktop Bottom Promotion