For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

January 2022 Horoscope: జనవరి నెలలో మీ జాతకం ఎలా ఉందో చూసెయ్యండి...

2022 జనవరి నెలలో రాశి ఫలాలను చూడటం ద్వారా మీ భవిష్యత్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోండి..!

|

కరోనా వంటి కష్టకాలంలో మరో సంవత్సరం కాలగర్భంలో కలిసిపోయింది. 2021 సంవత్సరానికి అందరూ గుడ్ బై చెప్పేశారు. అదే సమయంలో 2022 సంవత్సరంలోకి అడుగుపెట్టేశాం.

January 2022 Monthly Horoscope in Telugu

ఈ సందర్భంగా జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాల కదలికను బట్టి, రాశిచక్రాల ఆధారంగా 2022లో తొలి నెల జనవరి మాసంలో మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకోవచ్చు. కొన్ని రాశుల విద్యార్థులకు ఈ నెలలో మంచి ప్రయోజనాలు లభిస్తాయి. మరికొన్ని రాశుల ఉద్యోగులకు ఈ కాలంలో ఊహించిన ఫలితాలు వస్తాయి. మరోవైపు వ్యాపారులు ఈ నెలలో ఆశించిన రీతిలో ఫలితాన్ని పొందలేకపోవచ్చు. ఇలా మీ జీవితానికి సంబంధించి ఉద్యోగం, వ్యాపారం, సంపద, విద్య మరియు ఆరోగ్యం వంటి వివిధ అంశాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం చేయకుండా జనవరి మాసంలో ఏయే రాశుల వారికి అనుకూలంగా ఉంటుందో.. ఎవరికి ప్రతికూలంగా ఉంటుందో అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Planets Tranist in january 2022:జనవరిలో 4 గ్రహాల రవాణాతో ఈ రాశులకు అద్భుత ఫలితాలు...!Planets Tranist in january 2022:జనవరిలో 4 గ్రహాల రవాణాతో ఈ రాశులకు అద్భుత ఫలితాలు...!

మేష రాశి : మార్చి 21 - 19 ఏప్రిల్

మేష రాశి : మార్చి 21 - 19 ఏప్రిల్

ఈ రాశి వారికి జనవరి నెలలో కొత్త అవకాశాలు రావొచ్చు. వ్యాపారులు లాభాలను ఆర్జించడానికి అనేక అవకాశాలను పొందుతారు. ఈ కాలంలో మీరు ఏదైనా పెట్టుబడి పెడితే, సరైన ఫలితాలను పొందే బలమైన అవకాశం ఉంది. అదే సమయంలో ఉద్యోగులకు పురోగతి లభిస్తుంది. మీ వైవాహిక జీవితంలో పరిస్థితులు కొంత ఉద్రిక్తంగా ఉంటాయి. మీరు అనవసరమైన గొడవలకు దూరంగా ఉండాలి. లేదంటే మీ మధ్య ద్వేషాలు పెరిగే ఛాన్స్ ఉంది. మరోవైపు నెలాఖరులో, మీ ఇంట్లో వివాహ కార్యక్రమం నిర్వహించొచ్చు. ఈ సమయం విద్యార్థులకు చాలా కీలకం కానుంది. ప్రత్యేకించి మీరు ఉన్నత విద్యను అభ్యసించడానికి ఏదైనా ప్రయత్నం చేస్తుంటే, మీరు మీ వంతు కష్టపడి పని చేయాలి. ఆర్థిక పరంగా ఈ సమయం మిశ్రమంగా ఉంటుంది అయితే మీరు కోరుకున్న డబ్బును పొదుపు చేయలేరు. ఆరోగ్యంగా ఉండేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.

రాశిచక్ర మూలకం : అగ్ని

రాశి చక్ర గ్రహం : కుజుడు

లక్కీ నంబర్లు : 9,15,25,39,47,59

లక్కీ డేస్ : సోమ, బుధ, గురు, శనివారం

లక్కీ కలర్స్ : బ్లూ, ఎల్లో, బ్రౌన్, ఆరెంజ్, పింక్

వృషభ రాశి : ఏప్రిల్ 20 - మే 20

వృషభ రాశి : ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారికి జనవరి నెల చాలా ముఖ్యమైనది. ఈ కాలంలో ప్రభుత్వ ఉద్యోగులు కోరుకున్న చోటుకు బదిలీ కావొచ్చు. అదే సమయంలో ప్రైవేట్ ఉద్యోగాలు చేసే వారికి కూడా పురోగతి లభించొచ్చు. అయితే, ఈ సమయంలో మీరు మీ సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. ఎవ్వరినీ గుడ్డిగా నమ్మొద్దు. మరోవైపు ఈ కాలంలో వ్యాపారులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో ప్రతికూలంగా ఉంటుంది. ఆర్థిక పరమైన విషయాల్లో మీరు విజయం సాధించొచ్చు. డబ్బు సంపాదించేందుకు అనేక అవకాశాలను పొందుతారు. ఆరోగ్య పరంగా ఈ కాలంలో నిర్లక్ష్యంగా ఉండకండి.

రాశిచక్ర మూలకం : భూమి

రాశి చక్ర గ్రహం : శుక్రుడు

లక్కీ నంబర్లు : 2,11,29,30,44,56

లక్కీ డేస్ : శుక్ర, బుధ, సోమ, శనివారం

లక్కీ కలర్స్ : డార్క్ గ్రీన్, ఎల్లో, స్కై బ్లూ, వైట్, రెడ్

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారిలో విద్యార్థులకు ఈ నెలలో కొంత ఇబ్బందిగా ఉంటుంది. మీరు అజాగ్రత్తగా ఉంటే మీ భవిష్యత్తు కల అసంపూర్ణంగా మిగిలిపోతుంది. అనవసరమైన విషయాలకు దూరంగా ఉండి చదువుపై ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఆర్థిక పరంగా ఈ నెల మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అకస్మాత్తుగా మీరు అనేక మూలాల నుండి డబ్బు పొందొచ్చు. ఈ కాలంలో మీరు మతపరమైన పనుల కోసం చాలా డబ్బు ఖర్చు చేయొచ్చు. ఈ నెలలో వ్యాపారులు కొత్త పనులు ప్రారంభించకపోవడమే మంచిది. మరోవైపు ఉద్యోగులకు ఈ సమయం మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఆఫీసులో మీ స్థానం బలపడుతుంది. ఆరోగ్య పరంగా ఏదైనా సమస్య ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

రాశిచక్ర మూలకం : గాలి

రాశి చక్ర గ్రహం : బుధుడు

లక్కీ నంబర్లు : 2, 14, 27, 30, 44, 55

లక్కీ డేస్ : మంగళ, శుక్ర, సోమ, ఆదివారం

లక్కీ కలర్స్ : లైట్ గ్రీన్, ఎల్లో, పింక్, వైలెట్, వైట్

Surya and Chandra Grahan 2022: కొత్త ఏడాదిలో సూర్య, చంద్ర గ్రహణాలు ఎప్పుడొచ్చాయి?Surya and Chandra Grahan 2022: కొత్త ఏడాదిలో సూర్య, చంద్ర గ్రహణాలు ఎప్పుడొచ్చాయి?

కర్కాటక రాశి : జూన్ 21 - జూలై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జూలై 22

ఈ రాశి వారికి జనవరి నెలలో ఆర్థిక పరంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కాలంలో మీ ఆదాయం పెరగొచ్చు. ఇది కాకుండా, ఏదైనా పాత అప్పు నుండి బయటపడే అవకాశం బలంగా ఉంది. ఈ సమయంలో మీరు మీ ఆర్థిక నిర్ణయాలను చాలా జాగ్రత్తగా తీసుకుంటారు. ఉద్యోగులకు ఈ కాలంలో పెద్ద అడ్డంకులు ఉండొచ్చు. అయితే మీ క్రుషి మరియు ధైర్యంతో మీరు కొన్ని మంచి అవకాశాలను పొందుతారు. ఉద్యోగులు ఉద్యోగాన్ని వదిలేసి, సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, తొందరపడి అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. మీ కుటుంబ జీవితానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈ సమయం మిశ్రమంగా ఉంటుంది.

రాశిచక్ర మూలకం : నీరు

రాశి చక్ర గ్రహం : చంద్రుడు

లక్కీ నంబర్లు : 8,10,20,33,44,57

లక్కీ డేస్ : ఆది, శని, శుక్ర, మంగళ

లక్కీ కలర్స్ : లైట్ గ్రీన్, క్రీమ్, డార్క్ బ్లూ, రెడ్, స్కై బ్లూ

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి : జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారు ఈ నెలలో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన విషయాల్లో కోపం లేదా ఒత్తిడి వల్ల మీ సమస్యలు పెరుగుతాయి. పనుల్లో బిజీగా ఉంటే మీ విలువైన సమయం వృథా అవుతుంది. మరోవైపు ఆర్థిక పరంగా ఈ వారం మంచిగా ఉంటుంది. మీరు ఆలోచించకుండా అప్పు ఇవ్వడం మానుకోవాలి. విద్యార్థులు ఈ కాలంలో మంచి విజయాన్ని పొందొచ్చు. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులో పనిని ప్రారంభించాలనుకుంటే, ఈ కాలంలో మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే సానుకూలంగా ఉండాలి. ఉద్యోగులకు ఈ సమయం కలిసి రానుంది.

రాశిచక్ర మూలకం : అగ్ని

రాశి చక్ర గ్రహం : సూర్యుడు

లక్కీ నంబర్లు : 2, 12, 35, 48, 55

లక్కీ డేస్ : శని, శుక్ర, సోమ, మంగళవారం

లక్కీ కలర్స్ : రెడ్, డార్క్ బ్లూ, ఎల్లో, గ్రీన్, క్రీమ్

కన్య రాశి : ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

కన్య రాశి : ఆగస్టు 23 - సెప్టెంబర్ 22

ఈ రాశి వారికి ఈ నెలలో కొన్ని మిశ్రమ ఫలితాలు వస్తాయి.ఈ సమయంలో మీరు పురోగతిని పొందడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇది కాకుండా మీరు చాలా పెద్ద సవాళ్లను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు ఈ నెలఖారులో కొన్ని శుభవార్తలు వింటారు. వ్యాపారులకు ఈ నెలలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వారికి ఈ సమయం చాలా కష్టంగా ఉంటుంది. ఈ సమయంలో, కుటుంబ సభ్యులతో పరస్పర సామరస్యం దెబ్బతింటుంది. ఈ కాలంలో మీరు పని సంబంధిత సుదీర్ఘమైన ప్రయాణాన్ని చేయాల్సి రావొచ్చు. ఆరోగ్య పరంగా ఈ నెల జాగ్రత్తగా ఉండాలి.

రాశిచక్ర మూలకం : భూమి

రాశి చక్ర గ్రహం : బుధుడు

లక్కీ నంబర్లు : 4,10,24,34,47,59

లక్కీ డేస్ : సోమ, గురు, బుధ, ఆదివారం

లక్కీ కలర్స్ : గ్రీన్, ఆరెంజ్, వైట్, రోజ్, స్కై బ్లూ

Business Horoscope 2022: కొత్త ఏడాదిలో ఈ రాశుల వ్యాపారులకు శుభ ఫలితాలు రానున్నాయట..!Business Horoscope 2022: కొత్త ఏడాదిలో ఈ రాశుల వ్యాపారులకు శుభ ఫలితాలు రానున్నాయట..!

తుల రాశి: సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి: సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈ నెలలో కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలు రావొచ్చు. ఈ కాలంలో మీకు పెద్ద సమస్యలు ఉండొచ్చు. మీ మధ్య ఇంట్లో ఇంట్లో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో సంతోషం పెరుగుతుంది. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బలపడొచ్చు. మీ మధ్య మంచి సమన్వయం ఉంటుంది. మీకు ఒకరిపై ఒకరికి నమ్మకం కూడా పెరుగుతుంది. ఆర్థిక పరంగా ఈ నెలలో ప్రత్యేకంగా ఉండదు. అయితే మీరు ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించాలి. లేదంటే భవిష్యత్తులో మీరు ఇబ్బందుల్లో పడొచ్చు. వ్యాపారులకు ఈ సమయంలో కొంత మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈ నెలలో కొన్ని సమస్యలు ఉండొచ్చు.

రాశిచక్ర మూలకం : గాలి

రాశి చక్ర గ్రహం : శుక్రుడు

లక్కీ నంబర్లు : 2,19,24,33,46,51

లక్కీ డేస్ : సోమ, గురు, శుక్ర, శనివారం

లక్కీ కలర్స్ : గ్రీన్, ఆరెంజ్, వైట్, డార్క్ రెడ్

వృశ్చికం: అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చికం: అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారికి ఈ నెలలో సంతోషకరమైన ఫలితాలు రావొచ్చు. ఉద్యోగులకు ఈ మాసంలో కోరుకున్న చోటకు బదిలీ కావొచ్చు లేదా మీరు పదోన్నతి పొందొచ్చు. మీ ఆదాయం పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో మీ మార్గంలో వచ్చే అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. వ్యాపారులకు ఈ సమయం మంచి ఫలితాలను ఇస్తుంది. మీరు మంచి లాభాలను పొందొచ్చు. మీ కుటుంబ జీవితంలో అనుకూలంగా ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామి మద్దతు పొందుతారు. ఆర్థిక పరంగా ఈ నెలలో చాలా మంచిగా ఉంటుంది. మీరు నెల మధ్యలో ఆకస్మిక ధనాన్ని పొందొచ్చు. ఆరోగ్య పరంగా ఈ నెలలో కొన్ని సమస్యలు ఉండొచ్చు.

రాశిచక్ర మూలకం : నీరు

రాశి చక్ర గ్రహం : మార్స్ అండ్ ఫ్లూటో

లక్కీ నంబర్లు : 4,11,22,33,41,53

లక్కీ డేస్ : ఆది, గురు, మంగళ, సోమవారం

లక్కీ కలర్స్ : రోజ్, లైట్ గ్రీన్, స్కై బ్లూ, రెడ్, బ్లూ

ధనుస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనుస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈ నెలలో ఆర్థిక పరంగా చాలా కష్టంగా ఉంటుంది. ఈ కాలంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా, మీరు మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేరు. ఇది కాకుండా, మీ మానసిక ఒత్తిడి కూడా పెరుగుతుంది. అయితే నెల మధ్యలో మీకు గొప్ప ఉపశమనం లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితిలో పెద్ద మెరుగుదల సంకేతాలు ఉన్నాయి. ఉద్యోగులు ఈ నెలలో కష్టపడాల్సి రావొచ్చు. అయితే మీరు నెలాఖారులోగా పురోగతి సాధించొచ్చు. మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే, ఈ సమయంలో మీరు నిరాశకు గురవుతారు. కానీ మీ తరపున కష్టపడి పని చేస్తూ ఉండండి. త్వరలో పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. మరోవైపు, ఏదైనా కొత్త వ్యాపార ప్రతిపాదనను అంగీకరించే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. ఆరోగ్య పరంగా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి నుండి బయటపడొచ్చు.

రాశిచక్ర మూలకం : అగ్ని

రాశి చక్ర గ్రహం : గురుడు

లక్కీ నంబర్లు : 2,4,14,20,34,45,53

లక్కీ డేస్ : సోమ, శుక్ర, సోమ, బుధవారం

లక్కీ కలర్స్ : లైట్ గ్రీన్, గ్రీన్, వైట్, ఆరెంజ్, ఎల్లో

మకర రాశి : డిసెంబర్ 22- జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22- జనవరి 19

ఈ రాశి వారికి ఈ నెలలో కొన్ని హెచ్చు తగ్గులుంటాయి. మీకు తల్లి లేదా తండ్రి ఆరోగ్యం గురించి ఆందోళన పెరగొచ్చు. ఇంట్లోని కొందరు సభ్యులతో మీ సంబంధం సరిగ్గా లేకుంటే, ఈ సమయంలో మీరు అన్ని మనోవేదనలను తొలగించేందుకు ప్రయత్నించాలి. మీరు మీ సంబంధాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. మీరు నెలాఖారులో కొత్త ఆస్తిని కొనుగోలు చేయొచ్చు. ఈ సమయంలో మీరు కొన్ని ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. మరోవైపు ఉద్యోగులు ఈ కాలంలో కొన్ని క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది కాకుండా, సహోద్యోగులతో మీ అనుబంధం కూడా క్షీణించొచ్చు. వ్యాపారులు ఈ కాలంలో మిశ్రమ లాభాలను పొందొచ్చు. ఆరోగ్యంగా ఉండాలంటే, బయటి ఆహారాన్ని తీసుకోవడం మానుకోండి.

రాశిచక్ర మూలకం : భూమి

రాశి చక్ర గ్రహం : శని

లక్కీ నంబర్లు : 4,15,28,34,49,53

లక్కీ డేస్ : బుధ, శుక్ర, ఆది, గురువారం

లక్కీ కలర్స్ : వైట్, మెరూన్, గ్రీన్, బ్లూ

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి జీవితంలో చాలా హెచ్చు తగ్గులు ఉన్నట్లయితే, ఈ నెలలో మీ కష్టాలు తీరొచ్చు. ఈ కాలంలో మీరు మానసిక ప్రశాంతతను అనుభవిస్తారు. అలాగే, మీ జీవితలో స్థిరత్వం ఉంటుంది. ఉద్యోగులు ఈ నెలలో కష్టపడి పని చేయాల్సిన సమయం. మీరు ముఖ్యంగా ఉన్నత స్థానాన్ని పొందాలనుకుంటే, మీ ఉత్తమమైనదాన్ని అందించడానికి ప్రయత్నించండి. పెండింగులో ఉన్న పనులు ఈ కాలంలో పూర్తి చేయబడతాయి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఈ కాలంలో మీరు కుటుంబ సభ్యులతో కలిసి మతపరమైన యాత్రకు వెళ్లే అవకాశాన్ని పొందొచ్చు. ఆరోగ్య పరంగా ఈ నెలలో మంచిగా ఉండొచ్చు.

రాశిచక్ర మూలకం : గాలి

రాశి చక్ర గ్రహం : యురేనస్, శని

లక్కీ నంబర్లు : 5,14,20,33,42,50

లక్కీ డేస్ : ఆది, సోమ, శని, బుధవారం

లక్కీ కలర్స్ : గ్రీన్ ఎల్లో, ఆరెంజ్, లైట్ గ్రీన్, గోధుమ

మీన రాశి: ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి: ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారిలో వ్యాపారులకు ఏదైనా కొత్త వ్యాపార ప్రతిపాదనను తొందరపడి అంగీకరించొద్దు. ముందుగా పెండింగులో ఉన్న పనులను పూర్తి చేసేందుకు ప్రయత్నించండి. లేకపోతే మీపై ఒత్తిడి చాలా పెరుగుతుంది. అలాగే, మీరు నష్టపోయే అవకాశం ఉంది. ఉద్యోగులు ఉద్యోగం మారాలని ఆలోచిస్తుంటే, మీరు నెలాఖారులో మంచి విజయం పొందొచ్చు. ఈ సమయంలో, మీకు ఒక పెద్ద కంపెనీ నుండి ఇంటర్వ్యూకి పిలుపు రావొచ్చు. కాబట్టి కష్టపడండి. మీ ప్రిపరేషన్లో గ్యాప్ ఇవ్వకండి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉండే అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా ఈ వారం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది.

రాశిచక్ర మూలకం : నీరు

రాశి చక్ర గ్రహం : నెఫ్య్టూన్, గురుడు

లక్కీ నంబర్లు : 2,10,24,32,49,54

లక్కీ డేస్ : బుధ, శుక్ర, సోమ, శనివారం

లక్కీ కలర్స్ : ఎల్లో, రోజ్, రెడ్, వైట్, డార్క్ రెడ్

గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను ద్రుష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం...

English summary

January 2022 Monthly Horoscope in Telugu

For some zodiac signs, the month of January will be auspicious and for others it will be inauspicious. However, there is only one way to find out what the stars have in store for you, that is by reading your monthly horoscope.
Desktop Bottom Promotion