Latest Updates
-
ఒక్కసారి ఈ ఉల్లిపాయ పచ్చడి రుచి చూశారంటే.. రెండు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
కల్తీ లేని స్వచ్ఛమైన బాదం పాలు.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి! -
పరగడుపున ఈ నీళ్లు తాగితే..థైరాయిడ్, షుగర్, జుట్టు రాలడం ..అన్నింటికీ ఒకే బ్రహ్మాస్త్రం! -
నోరూరించే లాహోరి కడాయి చికెన్..బటర్ నాన్, రోటీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
హోటల్ రుచిని మరిపించే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ..వేడి వేడి ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోతుంది! -
చక్కెరకు బదులు బెల్లం: మీ ఆరోగ్యానికి ఇదే శ్రీరామరక్ష! -
పాకం పట్టే పనే లేదు..మన తాతమ్మల కాలం నాటి హెల్దీ జొన్న లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
మీ భర్తతో ఈ 4 మాటలు అంటున్నారా? అయితే మీ కాపురంలో చిచ్చు రేగినట్టే! -
పోషకాల గని, ఆరోగ్యానికి పెన్నిధి.. గోధుమ రవ్వ కిచిడీ ఎలా చేసుకోవాలంటే.. -
స్నేహితురాలికి ఆశ్రయం ఇస్తే.. బాయ్ ఫ్రెండ్ వింత ప్రవర్తన..ప్రియురాలి ఆవేదన!
గురుడు కుంభరాశిలో అస్తమయం... 12 రాశులపై పడే ప్రభావం...
2022లో ఫిబ్రవరి 19న కుంభరాశిలోకి గురుడి అస్తమయం కారణంగా రాశిచక్రాలపై పడే ప్రభావం, రాశిచక్రాల వారు పాటించాల్సిన పరిహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలో గురుడికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ గ్రహం అత్యంత శుభప్రదమైన గ్రహంగా పరిగణించబడుతుంది. ఎవరి జాతకంలో అయితే గురు గ్రహం బలంగా ఉంటుందో వారి జీవితంలో అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి.

ఆదాయం, ఐశ్వర్యం, తెలివితేటల విషయంలో గురువు అనుగ్రహం చాలా అవసరం. ఇలా ఎంతో విశిష్టత కలిగిన గురుడు ఫిబ్రవరి 19వ తేదీన శనివారం ఉదయం 10:23 గంటలకు కుంభరాశిలో అస్తమించనున్నాడు.

సుమారు నెల రోజుల పాటు అంటే మార్చి 20వ తేదీ వరకు అంటే ఆదివారం రాత్రి 7:50 గంటల వరకు కుంభరాశిలోనే ఉదయించనున్నాడు. ఈ సమయంలో ద్వాదశ రాశులలో కొన్ని రాశుల వారికి ప్రత్యేక ప్రయోజనాలు కలగనున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి.

మేష రాశి..
కుంభ రాశిలో గురుడు అస్తమించడం వల్ల ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో ఉద్యోగులకు పురోగతికి మంచి అవకాశాలు ఉన్నాయి. మీకు సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. వ్యాపారులకు ఈ కాలంలో ఆర్థిక పరంగా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీకు పెట్టుబడి పెట్టేందుకు ఇది సరైన సమయం. మీరు పాత అప్పుల నుండి కూడా విముక్తి పొందుతారు.
పరిహారం : గురువారం రోజున శివాలయంలో దీపారాధన చేయాలి.

వృషభ రాశి..
కుంభరాశిలో గురుడి అస్తమయం వల్ల ఈ రాశి ఉద్యోగులు, వ్యాపారులకు ఇబ్బందులు ఎదురుకావొచ్చు. మీరు సకాలంలో పనులు పూర్తి చేయడంలో ఆటంకాలు ఏర్పడొచ్చు. మీరు కొత్త ఉద్యోగం ఎదురుచూస్తున్నట్లయితే ఈ కాలంలో మీ అన్వేషణ పూర్తి కావొచ్చు. ఈ సమయంలో మీరు ప్రణాళిక ప్రకారం పనులు చేయాలి. మీరు అనవసర ఖర్చులు ఆపాలి. ఆదాయానికి మించి ఖర్చు చేయడం వల్ల మీకు మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్య పరంగా ప్రతికూలంగా ఉంటుంది.
పరిహారం : గురువారం రోజున ఏదైనా ఆలయానికి వెళ్లి పూజలు చేయాలి.

మిధున రాశి..
కుంభరాశిలో గురుడు అస్తమించడం వల్ల ఈ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో మంచి లాభాలను పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీరు కెరీర్లో గొప్ప విజయాన్ని సాధించగలుగుతారు. సమాజంలో మీ గౌరవం బలంగా పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి.
పరిహారం : ప్రతిరోజూ ‘‘ఓం భార్గవాయ నమః''అని 21 సార్లు జపిస్తే శుభఫలితాలొస్తాయి.

కర్కాటక రాశి..
ఈ రాశి వారు గురుడి అస్తమయం సమయంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు సరైన ఆహారం మరియు వ్యాయామ నియమాలను పాటిస్తే మంచిది. మీరు మీ పనులను సకాలంలో పూర్తి చేయలేరు. ఈ సమయంలో మీకు లక్కీ అనుకూలంగా ఉంటుంది. మీరు కోరుకున్నంత డబ్బు ఆదా చేయకపోవచ్చు.
పరిహారం : మీరు ‘ఓం నమః శివాయః'అని 21 సార్లు జపించొచ్చు.

సింహ రాశి..
ఈ రాశి వారికి గురుడు అస్తమించడం వల్ల కెరీర్లో మంచి అవకాశాలు లభించొచ్చు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త వినిపించే అవకాశం ఉంది. మరోవైపు వ్యాపారులకు ఈ సమయం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో సీనియర్ అధికారుల మద్దతు లభిస్తుంది. మీకు పదోన్నతి, జీతాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్య పరంగా ఈరోజు మీరు శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
పరిహారం : గురువారం నాడు వికలాంగులకు వస్త్రదానం చేయాలి.

కన్య రాశి..
కుంభరాశిలో గురుడు అస్తమయం వల్ల ఈ రాశుల వారిలో ఉద్యోగులకు కార్యాలయంలో పనిభారం పెరుగుతుంది. ఈ కాలంలో మీరు కొత్త ఉద్యోగం కోసం వెతకొచ్చు. వ్యాపారులకు కూడా ఈ సమయం ప్రతికూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈ కాలంలో మీరు పెరుగుతున్న ఖర్చుల భారాన్ని భరించాల్సి ఉంటుంది. బడ్జెట్ కు మించి ఖర్చులు చేయడం వంటివి చేసుకోవద్దు. మరోవైపు మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉండొచ్చు. మీరు మీ పనులను సమానంగా చేసేందుకు ప్రయత్నించాలి.
పరిహారం : శనివారం రోజున ఏదైనా ఆలయంలో దీపారాధన చేయాలి.

తుల రాశి..
గురుడి అస్తమయం వల్ల ఈ రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి. ముఖ్యంగా వ్యాపారం చేసే వారికి ఈ సమయంలో అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ కాలంలో మీ ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. అయితే మీరు డబ్బును ఆదా చేయడంలో మాత్రం చాలా కష్టపడాల్సి వస్తుంది. అయితే కఠోరమైన శ్రమతో మీరు విజయం సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగుల ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది.
పరిహారం : గురువారం రోజున పేదలకు పప్పులు దానం చేయాలి.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారికి గురుడి అస్తమయం వల్ల ప్రతికూల ఫలితాలు రావొచ్చు. ముఖ్యంగా ఉద్యోగులు కార్యాలయంలో ఎంత కష్టపడినప్పటికీ సహోద్యోగుల నుండి సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారులు ఈ కాలంలో కొత్త ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టకుండా ఉండాలి. ఈ కాలంలో మీరు పెరుగుతున్న ఖర్చుల కారణంగా, డబ్బును ఆదా చేయలేరు. ఆరోగ్య పరంగా తలనొప్పి, కాళ్లు మరియు కడుపు నొప్పి వంటి సమస్యలు ఉండొచ్చు.
పరిహారం : ప్రతిరోజూ 21 సార్లు ‘ఓం గుర్వే నమః'అనే మంత్రాన్ని జపిస్తే శుభ ఫలితాలొస్తాయి

ధనస్సు రాశి..
కుంభ రాశిలో గురుడి అస్తమయం వల్ల ఈ రాశి వారికి ఊహించని ఫలితాలు రానున్నాయి. ఈ కాలంలో మీ పెండింగ్ పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో మీరు చేసే ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు ఈ సమయంలో కొత్త పనులను ప్రారంభించగలరు. మీరు ఒకటి కంటే ఎక్కువ మాధ్యమాల ద్వారా డబ్బు పొందొచ్చు. మీకు ప్రతి పనిలో విజయం లభిస్తుంది. ఉద్యోగులు కార్యాలయంలో తమ ప్రతిభను కనబరిచేందుకు మంచి అవకాశాలు కనిపిస్తాయి.
పరిహారం : .గురువారం రోజున శివునికి బెల్లం దానం చేయొచ్చు.

మకర రాశి..
కుంభరాశిలోకి గురుడి అస్తమయం కారణంగా ఈ రాశి వారిలో ఉద్యోగులకు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమస్యలు ఎదురుకావొచ్చు. ఈ సమయంలో వ్యాపారులు లాభం పొందాలంటే.. వనరులను సక్రమంగా వినియోగించుకోవాలి. మీ అజాగ్రత్త కారణంగా కొంత డబ్బును కోల్పోవచ్చు. మీరు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండలేకపోవచ్చు. ఇది మీ ఒత్తిడికి కారణం కావొచ్చు. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి.

కుంభ రాశి..
ఇదే రాశిలో గురుడు అస్తమించడం వల్ల ఈ రాశి వారికి చాలా కష్టంగా ఉంటుంది. ఉద్యోగులకు బదిలీ వంటి అవకాశాలు ఎదురవుతాయి. వ్యాపారులు కూడా కొంత నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు కొత్త ప్రాజెక్టులను వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక పరంగా ప్రతికూలంగా ఉంటుంది. మీరు మీ డబ్బును ఆదా చేయలేరు. మీ ఆరోగ్యం ప్రభావితం కావొచ్చు.
పరిహారం : గురువారం నాడు గురుడికి పసుపు పువ్వులను సమర్పిస్తే శుభ ఫలితాలొస్తాయి.

మీన రాశి..
ఈ రాశి వారికి కూడా గురుడు అధిపతిగా ఉంటాడు. ఈ రాశి వారికి గురుడి అస్తమయం కారణంగా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కాలంలో మీన రాశి వారికి నిలిచిపోయిన పని పూర్తవుతుంది. ఈ సమయంలో మీరు చేసే ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు స్నేహితుల సహాయంతో కొన్ని కొత్త పనులను ప్రారంభించేందుకు ప్లాన్ చేయొచ్చు. మీ కష్టానికి తగిన ఫలితాలు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగులకు కార్యాలయంలో తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారులకు ఈ కాలంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
పరిహారం : సోమవారం రోజున పార్వతీదేవిని పూజిస్తే శుభ ఫలితాలొస్తాయి.



Click it and Unblock the Notifications











