Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
Jupiter Transit 2021 in Aquarius: గురుడు కుంభంలోకి ప్రవేశం.. ఈ రాశుల వారు జాగ్రత్త...!
కుంభరాశిలోకి గురుడు సంచారం చేసే సమయంలో రాశిచక్రాలపై పడే ప్రభావం గురించి తెలుసుకుందాం.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాలలో అతి పెద్ద గ్రహం గురుడు. ఈ గ్రహానికి ఎంతో ప్రత్యేకత ఉంది. నవగ్రహాలలో పెద్ద గ్రహంగా పరిగణించబడే గురుడు ఏప్రిల్ 6వ తేదీన తన స్థానాన్ని మారబోతున్నాడు.

మకర రాశి నుండి కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇక్కడే సుమారు సెప్టెంబర్ 14వ వరకు సంచారం చేయనున్నాడు. ఈ సందర్భంగా రాశిచక్రాలపై కచ్చితంగా ప్రభావం పడుతుంది.

ఈ సందర్భంగా ఏయే రాశిపై ఎలాంటి ప్రభావం పడుతుంది.. ఏయే రాశులకు అనుకూలంగా ఉంటుంది.. ఏయే రాశులకు ప్రతికూలంగా ఉంటుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
గురుడు మకరం నుండి కుంభంలోకి సంచారం చేసే సమయంలో ఈ రాశి వారికి అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. సంతానం లేని వారికి, పిల్లల గురించి కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి. మీరు ఈ కాలంలో మతపరమైన కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.

వృషభ రాశి..
గురుడు కుంభరాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీరు భూమి, ఆస్తికి సంబంధించిన సమస్యలను అధిగమిస్తారు. మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. సమాజంలో మీ గౌరవం కూడా పెరుగుతుంది. ఉద్యోగులు ప్రమోషన్ పొందొచ్చు. వ్యాపారులు కూడా లాభం పొందే అవకాశం ఉంది.

మిధున రాశి..
కుంభరాశిలోకి గురుడు ఆగమనం చేసే సమయంలో ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీకు మతపరమైన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. మీ పెండింగ్ పనులు పూర్తవుతాయి. మీ వ్యూహాలు ప్రభావవంతంగా ఉంటాయి. ఉద్యోగులకు మంచిగా ఉంటుంది. మీరు కొత్త ఆదాయ వనరులను కొంటారు.

కర్కాటక రాశి..
ఈ రాశి వారికి గురుడు రవాణా మిశ్రమ ఫలితాలను తీసుకొస్తుంది. ఈ సమయంలో మీరు ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆకస్మిక ఖర్చులు పెరగొచ్చు. ఉద్యోగులు పదోన్నతులు పొందుతారు. అయితే ఈ సమయంలో మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

సింహ రాశి..
ఈ రాశి వారికి గురుడి సంచారం వల్ల కొన్ని ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. ఈ సమయంలో మీరు ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మరోవైపు ఉద్యోగులకు కార్యాలయంలో గౌరవం లభిస్తుంది. మీకు ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. ఆరోగ్య పరంగా ఖర్చులు పెరుగుతాయి. సింగిల్ గా ఉండే వారికి వివాహ ప్రతిపాదనలు రావొచ్చు.

కన్య రాశి..
గురుడు కుంభరాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి కొంత ఒత్తిడి ఉంటుంది. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబంలో వివాహ కార్యక్రమాల వల్ల ఎక్కువ ఖర్చులు కావొచ్చు. మీరు శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వారు మీ పనులకు ఆటంకాలు కలిగించొచ్చు. దీని వల్ల మీపై ఒత్తిడి పెరుగుతుంది.

తుల రాశి..
గురుడి స్థానం మార్పు వల్ల ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి కుటుంబ పెద్దల నుండి మద్దతు లభిస్తుంది. ఉద్యోగులు ప్రమోషన్ పొందొచ్చు. మరోవైపు మీ ఆదాయం కూడా పెరగొచ్చు. ప్రేమికులకు ఈ కాలం మంచిగా ఉంటుంది.

వృశ్చిక రాశి..
కుంభ రాశిలోకి గురుడి ప్రవేశం వల్ల ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్ రావొచ్చు. మీరు పూర్వీకుల ఆస్తి ప్రయోజనాలను పొందొచ్చు. అదే సమయంలో మీ ఖర్చులు కూడా పెరుగుతాయి. మీ కుటుంబంలో అసమ్మతి కారణంగా మానసిక క్షోభకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీ ఒత్తిడి కూడా పెరుగుతుంది.

ధనస్సు రాశి..
ఈ రాశి వారికి గురుడి రవాణా వల్ల శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగులకు కొన్ని మంచి అవకాశాలు లభిస్తాయి. మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. మీ పిల్లలకు సంబంధించిన సమస్యలు తొలగించబడతాయి. మీరు విదేశాలకు వెళ్లే అవకాశాన్ని పొందొచ్చు. విద్యార్థులకు ఈ సమయం మంచిగా ఉంటుంది. మీరు పోటీ పరీక్షల్లో విజయం కూడా సాధించగలరు.

మకర రాశి..
ఈ రాశి నుండి గురుడు కుంభరాశిలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి ప్రతికూలంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఏదైనా వివాదాల్లో అనవసరంగా తలదూర్చకండి. మరోవైపు ఆర్థిక పరంగా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. భూమి, ఆస్తికి సంబంధించిన విషయాలు పరిష్కరించబడతాయి.

కుంభ రాశి..
గురుడు ఇదే రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ సమయం కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు పిల్లల విషయంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. విద్యార్థులకు విజయం లభిస్తుంది. అయితే మీరు ప్రణాళిక ప్రకారం పనులను చేయాల్సి ఉంటుంది. మరోవైపు వ్యాపారులు ఈ సమయం అన్ని అడ్డంకులను అధిగమిస్తారు.

మీన రాశి..
ఈ రాశి వారికి గురుడి సంచారం వల్ల ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. మీరు ఆరోగ్య పరంగా అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారులు లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీరు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. మరోవైపు అనవసరమైన ఖర్చులు కూడా పెరుగుతాయి.



Click it and Unblock the Notifications