For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Jupiter Transit in Aquarius 2021:కుంభంలో గురుడి సంచారం.. మేష రాశిపై పడే ప్రభావం...!

2021లో గురుడు కుంభ రాశిలోకి రవాణా సమయంలో మేషరాశి వారిపై పడే ప్రభావాలేంటో తెలుసుకోండి.

|

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలో ప్రతి ఒక్క గ్రహానికి దాని సొంత ప్రత్యేకత, ప్రాముఖ్యత అనేది ఉంటుంది. మన జాతకంలో ఈ గ్రహాల ప్రభావం కారణంగా ప్రధాన సంఘటనలు జరుగుతూ ఉంటాయి.

Jupiter Transit in Aquarius 2021, Effect on Mesh Rashi in Telugu

ఈ తొమ్మిది గ్రహాలు ప్రతి నెలా ఏదో ఒక రాశిలోకి మారుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే గురుడు 2021 సంవత్సరంలో నవంబర్ 20వ తేదీన మకర రాశి నుండి కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. గ్రహాలలో అన్ని గ్రహాల కన్నా అత్యంత శుభ గ్రహంగా గురుడిని పరిగణిస్తారు. ఎంతో ప్రాముఖ్యత ఉన్న గురుడు అర్ధరాత్రి 11:17 గంటలకు మకర రాశి నుండి నిష్క్రమించి కుంభ రాశిలోకి సంచారం చేయనున్నాడు.

Jupiter Transit in Aquarius 2021, Effect on Mesh Rashi in Telugu

ఇదే రాశిలో 2022 సంవత్సరంలో ఏప్రిల్ 13వ వరకు నివాసం ఉండనున్నాడు. ఆ తర్వాత మీన రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ నేపథ్యంలో ద్వాదశ రాశుల వారిపై కచ్చితంగా ప్రభావం పడుతుంది. కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు రాగా.. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో మేష రాశి వారిపై గురుడి రవాణా ప్రభావం ఎలా ఉంటుందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Guru Rashi Parivartan 2021:గురుడు కుంభంలోకి ఆగమనం.. రాశిచక్రాలపై ఎలాంటి ప్రభావమంటే...!Guru Rashi Parivartan 2021:గురుడు కుంభంలోకి ఆగమనం.. రాశిచక్రాలపై ఎలాంటి ప్రభావమంటే...!

శుభ ఫలితాలు..

శుభ ఫలితాలు..

ఈ రాశి నుండి గురుడు పదకొండో స్థానం నుండి కుంభంలోకి ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో గురుడి ప్రభావం వల్ల మీకు గొప్ప విజయం లభిస్తుంది. మీ ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. మీరు ఆశించిన డబ్బు తిరిగి వస్తుంది. మీరు ఆలోచించి వేసే ఎత్తుగడలన్నీ ఫలిస్తాయి.

కుటుంబ జీవితంలో..

కుటుంబ జీవితంలో..

మీ కుటుంబ జీవితంలో మంచిగా ఉంటుంది. మీకు కుటుంబంలోని సీనియర్ సభ్యుల సహకారం ఉంటుంది. పోటీ పరీక్షల్లో విద్యార్థులకు కూడా సమయం అనుకూలంగా ఉంటుంది. మీ పిల్లల బాధ్యత నెరవేరుతుంది. కొత్తగా పెళ్లయిన దంపతులకు సంతానం కలగడం వంటి శుభవార్తలు వినిపిస్తాయి.

Lunar Eclipse 2021:చంద్ర గ్రహణం వేళ రాశిచక్రాలపై ఎలాంటి ప్రభావమంటే...Lunar Eclipse 2021:చంద్ర గ్రహణం వేళ రాశిచక్రాలపై ఎలాంటి ప్రభావమంటే...

ఎప్పటివరకంటే..

ఎప్పటివరకంటే..

ఈ సంవత్సరం ప్రారంభ నెలలో కుంభ రాశిలోనే గురుడు నివాసం ఉంటాడు. దీని తర్వాత గురుడు ఫిబ్రవరి 23వ తేదీన 2022న ఈ రాశి నుండి అస్తమించనున్నాడు. 2022లో ఏప్రిల్ 13వ తేదీన తన సొంత రాశి అయిన మీన రాశిలో సంచారం చేయనున్నాడు. ఆ తర్వాత ఏడాది పొడవునా అక్కడే నివాసం ఉండనున్నాడు. అనంతరం జులై 29, 2022న తిరోగమనం చెందనున్నాడు.

ఉద్యోగులకు కొన్ని ఇబ్బందులు..

ఉద్యోగులకు కొన్ని ఇబ్బందులు..

గురుడు కుంభంలోకి ప్రవేశించిన తర్వాత మీరు ఆర్థిక పరంగా మంచి ఫలితాలను పొందొచ్చు. ముఖ్యంగా విదేశీ వనరుల నుండి డబ్బు సంపాదించొచ్చు. సెప్టెంబర్ 15వ తేదీ నుండి ఇది మీ పదో ఇంటిని ప్రభావితం చేస్తుంది. ఇలాంటి సమయంలో ఉద్యోగులకు కొన్ని ఇబ్బందులు ఎదురుకావొచ్చు. ఎందుకంటే ఇప్పటికే అక్కడ ఉన్న శని దేవుడు మిమ్మల్ని గందరగోళపరిచే పని చేస్తాడు. కాబట్టి మీరు మీ పనిపై ఎక్కువ ఫోకస్ పెట్టాలి. మీకు ఆరోగ్య పరంగా ఇబ్బందులు కలగొచ్చు.

FAQ's
  • 2021లో గురుడు కుంభరాశిలోకి ఎప్పుడు ప్రవేశించనున్నాడు?

    జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాలలో అన్ని గ్రహాల కన్నా అత్యంత శుభ గ్రహంగా గురుడిని పరిగణిస్తారు. ఎంతో ప్రాముఖ్యత ఉన్న గురుడు అర్ధరాత్రి 11:17 గంటలకు మకర రాశి నుండి నిష్క్రమించి కుంభ రాశిలోకి సంచారం చేయనున్నాడు. ఇదే రాశిలో 2022 సంవత్సరంలో ఏప్రిల్ 13వ వరకు నివాసం ఉండనున్నాడు.

  • గురుడు కుంభరాశిలో రవాణా వల్ల మేషరాశిపై ఎలాంటి ప్రభావం పడుతుంది?

    జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గురుడు కుంభ రాశిలోకి ప్రవేశించే సమయంలో మేష రాశి వారిపై విద్య, జ్ణానం, శాస్త్రం, పరిశోధనా, బ్యాంకింగ్ రంగం, ఆధ్యాత్మికత వంటి రంగాల్లో ప్రభావం ఉంటుంది.

English summary

Jupiter Transit in Aquarius 2021, Effect on Mesh Rashi in Telugu

Here we are talking about the jupiter transit in aquarius 2021, effect on mesha rashi in Telugu. Have a look
Story first published:Friday, November 19, 2021, 11:22 [IST]
Desktop Bottom Promotion