For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Jupiter Transit in Aquarius: గురుడు కుంభంలోకి తిరోగమనం.. 12 రాశులపై ఎలాంటి ప్రభావమంటే...!

|

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల తిరోగమనం వల్ల ఎల్లప్పుడూ ఏవో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా గ్రహాలలో విశేష స్థానమున్న గురు గ్రహం తిరోగమనం వల్ల చాలా మందికి తమ పనులు నెమ్మదిగా జరుగుతాయని పండితులు చెబుతున్నారు.

గురుడు మకర రాశి నుండి కుంభ రాశిలోకి 2021 సంవత్సరంలో జూన్ 20వ తేదీన తిరోగమనం చెందనున్నాడు. ఇక్కడే సెప్టెంబర్ 14వ తేదీ వరకు సంచారం చేయనున్నాడు. గురుడు ఇలా తిరోగమనం చేయడం వల్ల ద్వాదశ రాశులపై ఎంతో కొంత ప్రభావం పడుతుంది.

కొన్ని రాశులపై సానుకూల ప్రభావం పడనుండగా.. మరికొన్ని రాశులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుందట. ఏ రాశిపై ఎలాంటి ప్రభావం పడుతుంది.. ఏయే పరిహారాలు పాటిస్తే శుభ ఫలితాలొస్తాయనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Jupiter Retrograde in Aquarius: జూన్ 20న కుంభంలో గురుడి తిరోగమనం.. ఈ రాశులపై తీవ్ర ప్రభావం..!Jupiter Retrograde in Aquarius: జూన్ 20న కుంభంలో గురుడి తిరోగమనం.. ఈ రాశులపై తీవ్ర ప్రభావం..!

మేష రాశి..

మేష రాశి..

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, విద్య, సంపదకు కారకంగా భావించే గురుడు మేష రాశి నుండి 11వ స్థానంలో తిరోగమనం చెందనున్నాడు. ఈ స్థానం లాభదాయకమైనదే. కానీ గురుడు తిరోగమనం వల్ల ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో వ్యాపారులు ఏదైనా పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ కాలంలో ఎవ్వరికీ అప్పులు ఇవ్వకూడదు. రుణాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవ్వరి నుండి అప్పులను కూడా తీసుకోకండి.

పరిహారం : గురువారం రోజున రుద్ర పారాయణం చేయండి.

వృషభ రాశి..

వృషభ రాశి..

గురుడు ఈ రాశి నుండి పదో పాదం గుండా రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో రాశి వారికి ఆరోగ్య పరంగా అనుకూలంగా ఉంటుంది. మరోవైపు మీరు ఆస్తి, సంపదకు సంబంధించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రయాణం చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. విదేశాలకు వెళ్లి చదవాలనుకునే వారికి గురుడి అనుగ్రహం లభిస్తుంది.

పరిహారం : గురువారం రోజున ఉపవాసం ఉంటే మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.

మిధున రాశి..

మిధున రాశి..

గురుడు ఈ రాశి నుండి తొమ్మిదో స్థానం గుండా సంచారం చేయనున్నాడు. ఈ స్థానం ఆధ్యాత్మికతకు సంబంధించిన విషయాలను సూచిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రాశి వారు బాగా కష్టపడితే మంచి ఫలితాలను పొందుతారు. అయితే ఈ సమయంలో కుటుంబ సభ్యులతో విభేదాలు ఉండొచ్చు. ముఖ్యంగా మీరు ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ తండ్రికి ఈ సమయంలో ఎక్కువ సేవ చేయాలి. మరోవైపు వ్యాపారవేత్తలు చాలా జాగ్రత్తగా ఉండాలి.

పరిహారం: గురువారం రోజున కుంకుమ పువ్వు లేదా పసుపును నుదుటిపై పెట్టుకోవాలి.

Zodiac Signs:ఈ రాశుల వారు ఉదయాన్నే నిద్ర లేస్తారట..! ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...Zodiac Signs:ఈ రాశుల వారు ఉదయాన్నే నిద్ర లేస్తారట..! ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి నుండి గురుడు ఎనిమిదో పాదం గుండా ప్రయాణం చేయనున్నాడు. ఈ సమయంలో కర్కాటక రాశి వారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు. ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకు విదేశాలకు వెళ్లే అవకాశం వస్తుంది. ఉద్యోగులకు ఈ సమయంలో పురోగతి లభించే అవకాశం ఉంది.

పరిహారం : గురువారం రోజున గురు మంత్రాన్ని పఠించండి.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి నుండి గురు గ్రహం ఏడో స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ స్థానం దాంపత్య జీవితానికి సంబంధించినదిగా భావిస్తారు. ఈ సమయంలో వివాహితులకు అనేక సమస్యలు ఎదురవుతాయి. ఈ కాలంలో మీ వైవాహిక జీవితంలో మీ జీవిత భాగస్వామితో గొడవలు ఉండొచ్చు. కాబట్టి మీరు ఈ సమయంలో మీ పార్ట్ నర్ ఫీలింగ్స్ ను చాలా ఆలోచనాత్మకంగా వ్యక్తపరచాలి. ముఖ్యంగా మీ భాగస్వామిని ఇబ్బంది పెట్టే ఏ పనిని చేయకండి. మరోవైపు ఆస్తి లేదా వాహనం కోసం ప్లాన్ చేస్తుంటే, జూన్ 2022 వరకు మంచి సమయం లేదు.

పరిహారం : గురువారం రోజున పసుపు వస్తువులను దానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి నుండి గురుడు ఆరో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ప్రతికూల ఫలితాలు ఉండొచ్చు. కాబట్టి మీరు రుణాలు తీసుకోవడం, ఇవ్వడం వంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగం కోసం పోటీ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులకు సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.

పరిహారం : గురువారం రోజున గురు స్తోత్రాన్ని పఠించాలి.

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి నుండి గురు గ్రహం ఐదో స్థానం నుండి సంచారం చేయనుంది. ఈ సమయంలో తుల రాశి వారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు గ్యాస్ వంటి సమస్యలు ఎదురుకావొచ్చు. మరోవైపు టెక్నికల్, బ్యాంకింగ్ రంగాలలో పని చేసే వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. మీ ప్రయాణ అవకాశాలు చాలా బాగుంటాయి.

పరిహారం : గురువారం రోజున ఆవుకు బెల్లం మరియు పిండిని ఆహారంగా ఇవ్వాలి.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ రాశి నుండి గురుడు నాలుగో స్థానం నుండి ప్రయాణం చేయనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ వైవాహిక జీవితంలో ప్రతికూలంగా ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామితో సంబంధం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇరుగుపొరుగు వారితో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించాలి. వ్యాపారులకు విదేశీ ప్రాజెక్టుల నుండి మంచి అవకాశం లభిస్తుంది.

పరిహారం : ప్రతి గురువారం పీపల్ చెట్టును తాకకుండా పూజించాలి.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి నుండి గురుడు మూడో స్థానం నుండి తిరోగమనం చెందనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య పరంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. గురుడి ప్రభావం వల్ల మీరు ఈ సమయంలో మాటలను స్పష్టంగా మాట్లాడటం కూడా కష్టంగా మారుతుంది. మీ కుటుంబ జీవితంలో తోబుట్టువులతో విడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మాట్లాడే సమయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. ఈ కాలంలో మీ ధైర్యం, శౌర్యం కూడా తగ్గిపోవచ్చు.

పరిహారం : గురువారం రోజున రుద్రాభిషేకం చేయాలి.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి నుండి గురుడు రెండో స్థానం నుండి ప్రయాణించనున్నాడు. ఈ సమయంలో మీకు గొంతుకు సంబంధించిన సమస్యలు రావొచ్చు. ఆర్థిక పరంగా ఈరోజు మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. అయితే మీరు పొదుపును పాటిస్తే చాలా విషయాల్లో ముందుకెళ్తారు. కాబట్టి మీరు ఆదాయం మరియు ఖర్చులను బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ సమయం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది.

పరిహారం : గురువారం పసుపు బియ్యం తయారు చేసి, దానం చేయాలి.

కుంభ రాశి..

కుంభ రాశి..

గురుడు ఇదే రాశిలోకి తిరోగమనం చెందడం వల్ల ఈ రాశి వారిపై తీవ్ర ప్రభావమే ఉంటుంది. ఈ సమయంలో మీరు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు అకస్మాత్తుగా అవాంఛిత వ్యయం ఆర్థిక సమస్యలను ఎదుర్కోంటారు. మరోవైపు ఆరోగ్య పరంగా దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతుంటే ఈ సమయంలో కోలుకుంటారు. అయితే మీరు ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

పరిహారం : గురువారం విద్యార్థులకు పుస్తక సామాగ్రిని పంపిణీ చేస్తే మంచి ఫలితాలొస్తాయి.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి నుండి గురుడు 12వ స్థానం నుండి తిరోగమనం చెందనున్నాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. మీరు శుభకార్యాల కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయొచ్చు. మీరు చేపట్టిన పనులు, ప్రారంభించే పనుల్లో కూడా అడ్డంకులు ఎదురవుతాయి. మీ ఇంట్లో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు. దీని వల్ల మీకు ఒత్తిడి తగ్గిపోతుంది. అయితే మీరు ఈ సమయంలో ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. శుభ కార్యాల నిమిత్తం ఎక్కువ పర్యటనలు చేసే అవకాశం ఉంటుంది.

పరిహారం : గురువారం రోజున గురు మంత్రాలను జపిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది.

English summary

Jupiter Transit in Aquarius On 20 June 2021 Effects on Zodiac Signs in Telugu

Here we are talking about the jupiter transit in aquarius on 20 june 2021 effects on zodiac signs in Telugu. Read on
Story first published: Wednesday, June 16, 2021, 10:55 [IST]