మకరరాశిలోకి గురుడి ఎంట్రీ.. 12 రాశుల వారిపై ఎలాంటి ప్రభావం.. ఏయే పరిహారాలు పాటించాలి...!

గురుడు మకరరాశిలోకి ప్రవేశించే సమయంలో ఏయే రాశులపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకుందాం.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గురు గ్రహం నవంబర్ 20వ తేదీ వరకు ధనస్సు రాశిలో ఉండి... 21వ తేదీన మకర రాశిలోకి ప్రవేశించనున్నాడు. నవగ్రహాలలో అతి పెద్ద గ్రహమైన గురు గ్రహం స్థానం మారడం వల్ల.. దానిపై ఆధారపడ్డ రాశిచక్రాల వారిపై ఎంతో కొంత ప్రభావం అనేది కచ్చితంగా ఉంటుంది.

Jupiter Transit in Capricorn 21st November 2020 Effects on Zodiac Signs in Telugu

గురుడు ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే సమయంలో కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి.

Jupiter Transit in Capricorn 21st November 2020 Effects on Zodiac Signs in Telugu

అయితే గురుడు మకరంలోకి మారే సమయంలో అన్ని రాశుల వారు కొన్ని పరిహారాలు పాటించాలి. అప్పుడే మీకు ఎదురయ్యే ఇబ్బందుల నుండి మీరు తప్పించుకోవచ్చు. ఇంతకీ ఏయే రాశులవారు ఏయే పరిహారాలు పాటిస్తే శుభపలితాలొస్తాయి.. ఏ రాశిపై ఎలాంటి ప్రభావం పడనుంది అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మేష రాశి..

మేష రాశి..

గురుడు సంచారం 2020 ప్రకారం, ధనస్సు, మీన రాశులకు అధిపతి. గురు గ్రహం మకరంలోకి మారే సమయంలో పదో స్థానంలో ఉంటాడు. ఈ సమయంలో మేష రాశి వారు మానసికంగా, శారీరకంగా బలంగా ఉంటారు. మీ జీవితంలో శాంతి, సామరస్యం వస్తాయి. విద్యార్థులు విద్యారంగంలో రాణిస్తారు. వ్యాపారులకు మంచి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగులకు కార్యాలయంలో ప్రతిఫలం లభిస్తుంది. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి.

పరిహారం : ప్రతిరోజూ మీ నుదుటిపై కుంకుమ తిలకం పెట్టుకుని, అరటి చెట్టును పూజించాలి.

వృషభ రాశి..

వృషభ రాశి..

గురుడు మకరంలోకి సంచరించే సమయంలో తొమ్మిదో స్థానంలో ఉంటాడు. ఈ సమయంలో మీరు మంచి ఫలితాలను పొందుతారు. పరిశోధన రంగంలో పని చేసే వారికి అనూహ్యంగా శుభప్రదమైన ఫలితాలొస్తాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారి ఆశలు నెరవేరొచ్చు. మీ పూర్వీకుల నుండి ఆస్తి లాభం వస్తుంది. ఈ సమయంలో ఆరోగ్య సంబంధిత సమస్యలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి. వ్యాపారులకు ఉత్తమంగా ఉంటుంది. మీరు కొత్త ప్రాజెక్టులను కొన్ని సకాలంలో పూర్తి చేయాలి.

పరిహారం : ఈ సంవత్సరం గురువారం విద్యార్థులకు స్టేషనరీని పంపిణీ చేయాలి. పీపాల్ చెట్టుకు నీరు పోయాలి.

మిధున రాశి..

మిధున రాశి..

గురుడు మకరంలోకి ప్రవేశించే సమయంలో ఎనిమిదో స్థానంలో ఉంటాడు. ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఉద్యోగులు ఆఫీసులో పెండింగులో ఉన్న పనులను పూర్తి చేయొచ్చు. వ్యాపారులు తమ వ్యాపారాన్ని విస్తరించే అవకాశం ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితులు స్థిరీకరంగా ఉంటాయి. మీ స్నేహితులు మీకు అవసరమైన మద్దతు ఇస్తారు. మీ వైవాహిక జీవితంలో ఒత్తిడి తగ్గుతుంది.

పరిహారం : శివ స్తోత్రాన్ని క్రమం తప్పకుండా పఠించాలి. గురువారం ఉపవాసం ఉండాలి.

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

గురుడు మకరంలోకి ప్రవేశించేటప్పుడు ఈ రాశి నుండి ఏడో స్థానంలో ఉంటాడు. ఈ సమయంలో కర్కాటక రాశి వారు ఆరోగ్య సమస్యల నుండి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడానికి ప్రయత్నించాలి. వ్యాపారులు వ్యాపారాన్ని విస్తరించగలుగుతారు. మీ కుటుంబసభ్యులలో సమస్యలు మరియు అపార్థాలు పెరగొచ్చు. ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి.

పరిహారం : ప్రతి గురువారం ఉపవాసం ఉండాలి. మీ మెడలో పసుపు దారం లేదా ఐదుముఖాల రుద్రాక్షను ధరించాలి.

సింహ రాశి..

సింహ రాశి..

గురుడు మకరంలోకి సంచరించే సమయంలో ఈ రాశి వద్ద నుండి ఆరో స్థానంలో ఉంటాడు. ఈ సమయంలో సింహ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు కష్టపడి పనిచేస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయి. విద్యార్థులకు సీనియర్లతో పాటు టీచర్ల నుండి మద్దతు ఉంటుంది. ఉన్నత విద్యను అభ్యసించడానికి విదేశాలకు వెళ్లడం మీకు సులభమవుతుంది. అయితే మీరు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. మీ వైవాహిక జీవితంలో ప్రయోజనకరంగా ఉంటుంది.

పరిహారం : శివుడిని క్రమం తప్పకుండా ఆరాధించాలి.

కన్య రాశి..

కన్య రాశి..

గురుడు మకరంలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వద్ద ఐదో స్థానంలో ఉంటాడు. ఈ సమయంలో కన్యరాశి వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. మీరు లాభదాయకమైన ప్యాకేజీని అందుకుంటారు. మీ కుటుంబంలో మంచిగా ఉంటుంది. మీరు కొత్త ఇల్లు లేదా వాహనాన్ని కలిగి ఉండొచ్చు. మీ ప్రేమ వివాహం వంటి ప్రయత్నాలు సఫలమవుతాయి. మీరు కొన్ని మంచి వార్తలను వినొచ్చు.

పరిహారం : మీరు గురువారం మీ మెడలో బంగారు గొలుసు ధరించాలి.

తుల రాశి..

తుల రాశి..

గురుడు మకరంలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి నుండి నాలుగో స్థానంలో ఉంటాడు. ఈ సమయంలో మీ వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. మీరు చేసే పనిలో కొన్ని అడ్డంకులు ఉండొచ్చు. మీరు ఓపికగా ఉండి పరిపక్వతతో వాటిని నిర్వహించాలి. మీ కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. మీరు క్రీడా రంగంలో ఉంటే పేరు మరియు కీర్తి పొందుతారు. మీ కెరీర్ గ్రాఫ్ నెమ్మదిగా మరియు క్రమంగా పెరుగుతుంది. మీ సీనియర్లతో ఆరోగ్యకరమైన సంబంధాన్ని కొనసాగించండి.

పరిహారం : గురువారం రోజు విద్యార్థులను విద్యా సామాగ్రిని దానం చేయండి.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

గురుడు మకరంలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి నుండి మూడో స్థానంలో ఉంటాడు. ఈ సమయంలో మీరు ఎవ్వరికీ ఎలాంటి వాగ్దానం చేయకూడదు. మీరు పెట్టుబడి వంటి విషయాలకు దూరంగా ఉండాలి. మరోవైపు కొత్త ప్రాజెక్టులు మీకు దక్కుతాయి. పని విషయంలో ప్రశంసలు దక్కుతాయి. మీ కుటుంబంలో అంతర్గత విభేదాలు వచ్చే అవకాశాలున్నాయి. మీ వైవాహిక జీవితం బాగుంటుంది.

పరిహారం : గోధుమపిండిలో కొంచెం పసుపు కలిపి, ఆవుకు తినిపిస్తే మంచి ఫలితాలొస్తాయి.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

మకరంలోకి గురుడి గమనం వల్ల ఈ రాశి నుండి రెండో స్థానంలో ఉంటాడు. ఈ సమయంలో ధనస్సు రాశి వారికి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మీకు తెలియకుండానే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మీరు ఏదైనా ఒప్పందాలు చేసుకుంటే, వాటి వల్ల నష్టం రావచ్చు. మీ కుటుంబంలో కూడా కొన్ని సమస్యలు తలెత్తుతాయి.

పరిహారం : మీ చూపుడు వేలిపై పుసు నీలమణి రత్నాన్ని ధరిస్తే అనుకూల ఫలితాలొస్తాయి.

మకర రాశి..

మకర రాశి..

గురుడు ధనస్సు రాశి నుండి మకరంలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎదురుకావచ్చు. అయితే మీరు మనశ్శాంతి కోసం విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటే మీరు ఊహించిన ఫలితాలు రావొచ్చు. మీరు సరికొత్త స్థాయిలో కనెక్ట్ అయ్యే భాగస్వామిని కనుగొనవచ్చు. మీరు ఎంత కష్టపడితే అంత కీర్తి, ప్రతిష్టలు సంపాదిస్తారు. ఈ సమయంలో మీరు ఆర్థిక పరమైన విషయాలలో మరింత జాగ్రత్తగా ఉండాలి. మీ పాత స్నేహితులు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలున్నాయి.

పరిహారం : గురుని ఆశీర్వాదం కోసం పసుపు వస్త్రం లేదా దారంలో కుట్టి మీ చేతిలో లేదా మీ మెడలో ధరించొచ్చు.

కుంభ రాశి..

కుంభ రాశి..

గురుడు మకరంలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి నుండి పన్నెండో స్థానంలో ఉంటాడు. ఈ సమయంలో మీరు ఉత్తమ ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా పెండింగులో ఉన్న పనులను పూర్తి చేయగలుగుతారు. మరోవైపు మీరు విదేశాలకు వెళ్లడానికి అవకాశాలు మెరుగవుతాయి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.

పరిహారం : ప్రతి గురువారం పీపల్ చెట్టుకు నీరు పోయాలి. అలాగే, పసుపు బియ్యం ఉడికించి సరస్వతీ దేవికి అర్పించాలి.

మీన రాశి..

మీన రాశి..

గురుడు మకరంలోకి సంచరించే సమయంలో, ఈ రాశి నుండి పదకొండో స్థానంలో ఉంటాడు. ఈ సమయంలో ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు కార్యాలయంలో చేసిన ప్రయత్నాలన్నింటిలో విజయం లభిస్తుంది. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. మరోవైపు ఈ సమయంలో మీరు మీ ఖర్చులను నియంత్రణలో ఉంచుతారు.

పరిహారం : గురువారం రోజున గురుడి బీజ్ మంత్రాన్ని జపించాలి, ఎక్కువగా పసుపు మరియు క్రీమ్ రంగు దస్తులను ధరించాలి.

Desktop Bottom Promotion