Guru Gochar 2022 :12 ఏళ్ల తర్వాత మీనంలోకి గురుడి సంచారం... ఈ రాశుల వారికి శుభ ఫలితాలు...!

12 ఏళ్ల తర్వాత మీనంలోకి గురుడి సంచారం... 12 రాశులపై ఎలాంటి ప్రభావం పడుతుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలో అతి పెద్ద గ్రహంగా భావించే గురుడు సుమారు 12 సంవత్సరాల తర్వాత ఏప్రిల్ 13వ తేదీన బుధవారం రోజున మధ్యాహ్నం 3:48 గంటలకు తన సొంత రాశి అయిన మీన రాశిలోకి ప్రవేశించనున్నాడు.

Jupiter Transit in Pisces On 13 April Effects on Zodiac Signs in Telugu

గురుడు ఇంతకు ముందు 2010లో మే నెల నుండి 2011 మే మాసం వరకు మీనరాశిలో సంచారం చేశాడు. మళ్లీ ఇప్పుడు మీన రాశిలోకి రవాణా చేయనున్నాడు. ఈ నేపథ్యంలో ద్వాదశ రాశుల వారికి 'హన్స్ యోగం' ఏర్పడుతుంది.

Jupiter Transit in Pisces On 13 April Effects on Zodiac Signs in Telugu

గురుడు ఇదే రాశిలో 2023 ఏప్రిల్ 23వ తేదీ వరకు సంచారం చేయనున్నాడు. అనంతరం మేషరాశిలోకి మారనున్నాడు. ఈ సమయంలో ద్వాదశ రాశులపై ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. ఈ సందర్భంగా ఏయే రాశి వారిపై ఎలాంటి ప్రభావం పడుతుందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..

మేష రాశి..

ఈ రాశి నుండి గురుడు 12వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీరు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. మీ విదేశీ ప్రయాణం లేదా విదేశీ పౌరసత్వం కోసం చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. అయితే అధిక ఖర్చుల కారణంగా కొన్ని ఇబ్బందులనుు ఎదుర్కొంటారు. మరోవైపు కొన్ని ఖరీదైన వస్తువులను కొంటారు. ఈ కాలంలో మీరు భూమి, ఆస్తి, ఇల్లు, వాహన సంబంధిత రంగాల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి.

వృషభ రాశి..

వృషభ రాశి..

ఈ రాశి నుండి గురుడు 11వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీకు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుండి సహకారం లభిస్తుంది. మీ కుటుంబంలోని సీనియర్ సభ్యుల పట్ల బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు. పోటీలో పాల్గొనే విద్యార్థులకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. మీ ప్రేమకు సంబంధించిన విషయాల్లో తీవ్రత ఉంటుంది. మీ సంతానానికి సంబంధించిన ఆందోళనలు తొలగిపోతాయి.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి నుండి గురుడు 10వ స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. ఉద్యోగులు ఏదైనా మార్పు కోసం చూస్తుంటే, మీకు అవకాశం అనుకూలంగా ఉంటుందది. మీకు కోర్టు కేసులకు సంబంధించి నిర్ణయాలు అనుకూలంగా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి నుండి గురుడు 9వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీకు సానుకూల ఫలితాలు వస్తాయి. మీరు ఏదైనా కొత్త ఒప్పందంపై సంతకం చేస్తే శుభ ఫలితాలొస్తాయి. అలాగే ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీరు మతపరమైన ట్రస్టులు మరియు సామాజిక కార్యక్రామాల్లో చురుగ్గా పాల్గొంటారు. దానధర్మాలు కూడా పాల్గొంటారు. విదేశీ కంపెనీలలో లేదా పౌరసత్వం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి నుండి గురుడు 8వ స్థానం నుండి ప్రయాణం చేయనున్నాడు. ఈ కాలంలో మీకు కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. మీరు ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి. మీ సొంత వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు పోటీ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులు, మంచి మార్కుల కోసం ఎక్కువగా సాధన చేయాలి. ఇంకోవైపు పిల్లలకు సంబంధించిన ఆందోళనలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి నుండి గురుడు 7వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీరు కొన్ని శుభకార్యాల్లో పాల్గొంటారు. మీ వివాహ సంబంధ చర్చలు సఫలమవుతాయి. మీకు అత్తమామల వైపు నుండి మద్దతు ఉంటుంది. ఈ కాలంలో మీరు ఏదైనా సాధారణ వ్యాపారం చేయాలనుకుంటే, గురు గ్రహ ప్రభావం అనుకూలంగా ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన పనులన్నీ పూర్తవుతాయి.

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి నుండి గురుడు 6వ స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో ఈ రాశి వారు కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీకు రహస్య శత్రువుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి. మీ సొంత వ్యక్తులు కూడా మిమ్మల్ని అవమానించేందుకు ప్రయత్నిస్తారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు ఈ కాలంలో ప్రయాణం చేసే వారికి శుభ ఫలితాలొస్తాయి. విదేశీ ఉద్యోగం, పౌరసత్వ ప్రయత్నాలు విజయవంతమవుతాయి.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ రాశి నుండి గురుడు 5వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీకు శుభప్రదమైన ఫలితాలొస్తాయి. ఉద్యోగులు, వ్యాపారులు, అన్ని రంగాల వారు విజయం సాధిస్తారు. పోటీలో పాల్గొనే విద్యార్థులకు సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. పిల్లల విషయంలో ఆందోళన కూడా తగ్గుతుంది. కొత్త జంటకు పిల్లలు గురించి శుభవార్తలు వినిపిస్తాయి. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. మీ సామాజిక స్థాయి కూడా పెరుగుతుంది.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి నుండి గురుడు 4వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీరు ఊహించని ఫలితాలను ఎదుర్కొంటారు. మీరు స్నేహితులు, బంధువుల నుండి శుభవార్తలను వింటారు. మీ ఆస్తికి సంబంధించిన విషయాలు పరిష్కారమవుతాయి. మీరు ఇల్లు మరియు వాహనం కొనుగోలు చేయాలనుకుంటే, ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి నుండి గురుడు 3వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీకు ధైర్యం మరియు శక్తి పెరుగుతుంది. మీకు కుటుంబం మొత్తం మద్దతు ఇస్తుంది. మీ నిర్ణయాలకు ప్రశంసలు లభిస్తాయి. మీ సామాజిక హోదా కూడా పెరుగుతుంది. ఆరోగ్య పరంగా మంచిగా ఉంటుంది. ఈ కాలంలో మీరు చాలా క్లిష్ట పరిస్థితులను కూడా సులభంగా నియంత్రించగలరు. ఈ సమయంలో చేసే ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. మరోవైపు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ పిల్లలకు సంబంధించిన ఆందోళనలు కూడా దూరమవుతాయి.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి నుండి గురుడు 2వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీకు సానుకూల ఫలితాలు రానున్నాయి. మీరు బంగారం లేదా ఇతర విలువైన ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ఎక్కువ డబ్బు ఖర్చు చేయొచ్చు. మీ ప్రసంగ నైపుణ్యాల సహాయంతో, మీరు ఎలాంటి పరిస్థితినైనా సులభంగా నియంత్రించగలుగుతారు. మీ కుటుంబంలో కొత్త అతిథి రాకతో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

మీన రాశి..

మీన రాశి..

దాదాపు 12 సంవత్సరాల తర్వాత సొంత రాశిలోకి గురుడు సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు రానున్నాయి. ఈ సమయం మీకు శక్తి మరియు సామర్థ్యం బాగా పెరుగుతుంది. మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే, మీరు నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం చేయకండి. మీ సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. మీరు ఎన్నికలకు సంబంధించిన నిర్ణయాలను తీసుకుంటే, అందులోనూ విజయం సాధిస్తారు. మీ పిల్లలకు సంబంధించిన ఆందోళనలు కూడా దూరమవుతాయి.

FAQs
BoldSky Lifestyle

Story first published: Tuesday, April 12, 2022, 11:28 [IST]
Desktop Bottom Promotion