Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
Jupiter Transit 2021:కుంభరాశిలోకి గురుడి సంచారం.. ఈ రాశులకు అద్భుత ప్రయోజనాలు...!
గురుడు కుంభరాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నవగ్రహాల్లో గురుడికి ఎంతో విశిష్టత ఉంది. ఈ గ్రహాన్ని దేవతల గురువుగా భావిస్తారు. అలాంటి గురుడు ఏప్రిల్ మాసంలోని తొలి వారంలో తన దిశను మార్చుకోనున్నాడు.

శని రాశి అయిన కుంభరాశిలోకి ఏప్రిల్ 6వ తేదీన మంగళవారం సాయంత్రం 6:01 గంటలకు అడుగుపెట్టనున్నాడు. ఈ కాలాన్ని చాలా పవిత్రమైన సమయంగా భావిస్తారు. గురుడి దయ వల్లనే స్త్రీలకు బంగారం నగలు వంటివి దక్కుతాయి.

ధనస్సు, మీన రాశి వారికి అధిపతిగా ఉండే గురుడు ప్రభావం ద్వాదశ రాశిచక్రాలపై కచ్చితంగా ప్రభావం పడుతుంది. అయితే కొన్ని రాశుల వారికి మాత్రం గురుడి రవాణా వల్ల చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
కుంభరాశిలోకి గురుడి సంచారం సమయంలో ఈ రాశి వారు ప్రత్యేకమైన ఫలితాలను పొందుతారు. వీరు ఊహించిన విధంగా పనులన్నీ ముందుకు సాగుతాయి. ఆర్థిక పరంగా కూడా అనేక ప్రయోజనాలను పొందుతారు. ఉద్యోగులకు మరియు వ్యాపారులకు సానుకూలంగా ఉంటుంది. వ్యాపారులు ఊహించని విధంగా ఆదాయం పెరుగుతుంది. మీరు కొత్త ఆదాయ వనరుల కోసం ప్రయత్నిస్తారు. అందులో కూడా విజయవంతం అవుతారు. మీ కోరికలన్నీ నెరవేరే అవకాశాలు బలంగా ఉన్నాయి.

మిధున రాశి..
గురుడు మకర రాశి నుండి కుంభరాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. వీరు ప్రతి ఒక్క రంగంలోనూ విజయం సాధిస్తారు. వివాహితులకు చాలా సంతోషంగా ఉంటుంది. మరోవైపు ఉద్యోగులు ఉన్నతాధికారుల మెప్పును పొందుతారు. అంతేకాదు మీరు ప్రమోషన్లు కూడా సాధిస్తారు. మీరు కొన్ని మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరు కొత్త ఆదాయ వనరులను కూడా పొందుతారు. ఈసారి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా.. చాలా తెలివిగా తీసుకుంటారు. అందుకే అన్నింట్లో మీరు ఊహించిన విధంగా ఫలితాలను పొందుతారు. మీ జీవిత భాగస్వామితో ఈ కాలంలో ఆనందంగా గడుపుతారు.

సింహ రాశి..
కుంభరాశిలోకి గురుడి సంచారం వల్ల ఈ రాశి వారి జీవితంలో చాలా మార్పు వస్తుంది. మీ కుటుంబం, ప్రేమ జీవితంలో చాలా అద్భుతంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీరు ప్రేమ వివాహం చేసుకోవాలని భావిస్తుంటే.. మీ నిర్ణయానికి మీ కుటుంబం ఒప్పుకోవచ్చు. అంతేకాదు సమాజంలో కూడా మీకు ప్రత్యేక గౌరవం లభిస్తుంది. మరోవైపు మీ ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుంది. ఆరోగ్య పరంగా ఈ సమయంలో ఎలాంటి సమస్యలు ఉండవు.

తుల రాశి..
గురుడు కుంభరాశిలోకి ప్రవేశించే సందర్భంలో ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. మీరు లక్ష్యం దిశగా పయనిస్తారు. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారు కూడా మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో అనుకూలంగా ఉంటుంది. మీరు వివాహం చేసుకున్న వ్యక్తులు అయితే.. మీ కొత్త జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. మరోవైపు ఆర్థిక పరమైన సమస్యలన్నింటినీ సులభంగా అధిగమిస్తారు. మీరు కొత్త ఆదాయ వనరులను కనుగొంటారు.

ధనస్సు రాశి..
కుంభరాశిలోకి గురుడు ప్రవేశించే సమయంలో ఈ రాశి వారు శుభ ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో అన్నింట్లో విజయం సాధిస్తారు. మరోవైపు మీరు కొన్ని మత కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఈ సమయంలో మీరు కొన్ని తీర్థయాత్రలకు కూడా వెళ్తారు. మీరు మీ తోబుట్టువుల నుండి ఎక్కువ మద్దతు పొందుతారు. మీ తల్లి ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.

మీన రాశి..
కుంభరాశిలోకి గురుడి ప్రయాణించే సందర్భంలో ఈ రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఊహించిన విధంగా ఫలితాలు వస్తాయి. అయితే మీ ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి. కానీ ఆదాయ పరంగా ఎలాంటి సమస్య ఉండకపోవచ్చు. మీరు కొన్ని మత పరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ పనికి సంబంధించి తరచూ ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
గమనిక : గమనిక : ఇక్కడ ఇవ్వబడిన ద్వాదశ రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... వీటి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అన్న విషయాలను పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications