Latest Updates
-
జ్వరం వచ్చినప్పుడు త్వరగా కోలుకోవాలంటే ఏం తినాలి? ఏం తినకూడదు? -
వంకాయ వండటం ఓ కళ.. అయ్యంగార్ స్టైల్ లో ఇలా చేస్తే రుచికి ఎవరైనా దాసోహం అవ్వాల్సిందే! -
పేరెంట్స్ రిచ్ అయితే జెన్ జెడ్ చెడుదారులు పడుతుందా.. వైరల్ పోస్ట్‌పై చర్చ.! -
కన్నయ్య కరుణ: శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు నుంచి ఈ రాశులకు కుబేర యోగమే! -
యమ్మీ స్పైసీతో స్ట్రీట్ ఫుడ్ స్టైల్ మసాలా నూడుల్స్.. ఈ ట్రిక్ పాటిస్తే అస్సలు విరిగిపోదు.! -
150 డిగ్రీల కోణంలో శని, బుధులు..సెప్టెంబర్ 1న షడాష్టక యోగంతో ఈ 4 రాశులకు అఖండ ఐశ్వర్యం! -
Sorakaya Payasam Recipe: పైదరాబాదీ వెడ్డింగ్ స్టైల్ సొరకాయ పాయసం..రుచిలో లేదు దీనికి సాటి.. -
పోషకాల గని.. వర్షాకాలంలో తప్పనిసరిగా తాగాల్సిన చెట్టినాడ్ ఫ్రూట్ పాయసం.! -
Chicken Benefits: చికెన్ తింటే కలిగే 5 అద్భుత ప్రయోజనాలు ఇవే! -
ప్రోటీన్స్ నిండిన రాజస్థానీ పంచరత్న దాల్..అమృతాన్ని తలపించే రుచి..ఎలా చేసుకోవాలంటే..
Jupiter Venus Conjunction:12 ఏళ్ల తర్వాత మీనంలో గురుడు, శుక్రుడి కలయిక... 12 రాశులపై పడే ప్రభావం...!
మీన రాశిలో గురుడు, శుక్రుడు కలయిక వల్ల రాశిచక్రాలపై పడే ప్రభావమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలోని గురుడు తన సొంత ఇంటికి మీన రాశిలోకి అడుగుపెట్టాడు. గురుడి రాక సందర్భంగా శుభ ఫలితాలు వస్తాయని చాలా మంది నమ్ముతారు.

అయితే గురు గ్రహంతో పాటు శుక్రుడు కూడా ఇదే రాశిలోకి రానున్నాడు. గురుడు, శుక్రుని గ్రహాలు రెండూ శుభ ఫలితాలకు సంబంధించినవే. ఈ నేపథ్యంలో 2022లో సంవత్సరంలో ఏప్రిల్ 27వ తేదీన గురుడు, శుక్రుడు మీన రాశిలోకి ప్రవేశించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా వీటి ప్రభావం అద్భుతంగా ఉంటుంది.

అయితే ఈ సమయంలో ఆరోగ్య పరమైన సమస్యలతో బాధపడేవారు అప్రమత్తంగా ఉండాలి. వివాహ సమస్యలతో ఇబ్బందులు పడేవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఒంటరిగా ఉండే వారికి పెళ్లి జరిగే అవకాశం ఉంటుంది.

ఈ రెండు గ్రహాల కలయిక వల్ల వివాహాల సీజన్ చాలా ఉత్సాహంగా ఉంటుంది. మార్కెట్లో కూడా బంగారం ధరలు మరింత పెరగొచ్చు. గురు, శుక్రుని కలయిక వల్ల ప్రేమ జీవితంలో ఎదురయ్యే సమస్యలను కూడా సులభంగా అధిగమిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా గురుడు, శుక్రుని కలయిక వల్ల ద్వాదశ రాశులపై ఎలాంటి ప్రభావం పడుతుంది.. ఎవరెవరికి శుభ ఫలితాలు రానున్నాయి.. ఎవరికి అశుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
మీన రాశిలో గురుడు, శుక్రుని కలయిక వల్ల ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. ఆలుమగలిద్దరూ ఒకరినొకరు గౌరవించుకుంటారు. ఇంతవరకు మీరు వైవాహిక జీవితంలో ఎదుర్కొన్న సమస్యలన్నీ పరిష్కరించుకుంటారు.

వృషభ రాశి..
గురు మరియు శుక్రుని కలయిక కారణంగా ఈ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఆర్థిక లాభాలను పొందొచ్చు. అయితే మీరు ఈ కాలంలో శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి.

మిధున రాశి..
గురుడు మరియు శుక్రుని కలయికతో ఈ రాశి వారికి జీవితంలో పురోగతికి అవకాశం లభిస్తుంది. ఈ సమయంలో ఇప్పటివరకు సంతానం లేని వారికి సంతానం గురించి కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి. అలాగే సంతానం ఉన్న వారు శుభవార్తలు వింటారు.

కర్కాటక రాశి..
గురుడు, శుక్రుడు కలయిక వల్ల ఈ రాశి వారికి జీవితంలోని కష్టాలు తొలగిపోయి.. సుఖాలు పెరుగుతాయి. ఈ సమయంలో మీ సుఖసంతోషాలు పెరుగుతాయి. మీ ఆస్తి, వాహన సుఖాలు కూడా లభిస్తాయి. ఇల్లు, భూమి కొనాలనుకునే వారి కోరిక నెరవేరుతుంది.

సింహ రాశి..
గురు, శుక్ర గ్రహాల కలయికతో ఈ రాశి వారికి అనేక మార్పులొస్తాయి. ఈ కాలంలో మీ కెరీర్ పరంగా కొన్ని మార్పులు వస్తాయి. మీ స్నేహితులతో బంధం బలంగా మారుతుంది. ఈ కారణంగా మీరు అనేక సవాళ్లను అధిగమిస్తారు.

కన్య రాశి..
ఈ రాశి వారికి గురు, శుక్ర కలయిక వల్ల అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వ్యక్తులు లేదా ఎవరైనా వివాహంలో సమస్యలు ఎదుర్కొంటుంటు.. అవి ఈ కాలంలో పరిష్కారమయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి.

తుల రాశి..
గురు, శుక్రుడు కలిసే సమయంలో ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. అవసరమైన చోట మాత్రమే ఖర్చు చేయండి. ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి చక్కగా ఉంటుంది. లేదంటే మీకు డబ్బు విషయంలో అనేక సమస్యలు ఎదురుకావొచ్చు.

వృశ్చిక రాశి..
గురుడు, శుక్రుని కలయిక వల్ల ఈ రాశి వారికి కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ కాలంలో మీరు సామాజిక మరియు మతపరమైన పనులలో చురుగ్గా పాల్గొంటారు. మీకు ప్రజాదరణ కూడా పెరుగుతుంది.

ధనస్సు రాశి..
గురుడు, శుక్రుడి కలయిక వల్ల ఈ రాశి వారిలో వ్యాపారులు అనేక ప్రయోజనాలు పొందొచ్చు. ఈ కాలంలో మీరు దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఈ కారణంగా మీరు మంచి లాభాలను పొందొచ్చు. దీంతో పాటు కుటుంబం మరియు స్నేహితులతో ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుంది. దీని వల్ల మీ మనసులో ఉండే భారం తగ్గిపోతుంది.

మకర రాశి..
గురుడు, శుక్రుడి కలయిక వల్ల ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో కొత్త పని ప్రారంభించాలనుకునే వారికి ఆర్థిక పరంగా అద్భుతమైన అవకాశాలు రానున్నాయి. మరోవైపు ఉద్యోగులకు, వ్యాపారులకు ఈ సమయం మంచి పురోగతి లభిస్తుంది.

కుంభ రాశి..
గురుడు, శుక్రుడి కలయిక వల్ల ఈ రాశి వారికి శుభ ఫలితాలొస్తాయి. ఈ కాలంలో ప్రేమ జీవితంలో కొత్త గా ఉంటుంది. మీ సంబంధాలలో కూడా బలం ఉంటుంది. మీరు మీ భాగస్వామిని ప్రియమైన వారిని కలుసుకునేలా చేయొచ్చు. ఇది మీ భవిష్యత్తును ప్రణాళికలను బలోపేతం చేస్తుంది.

మీన రాశి..
గురుడు, శుక్రుడు ఇదే రాశిలో సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి శుభప్రదమైన ఫలితాలు వస్తాయి. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలొస్తాయి. ఈ రెండు గ్రహాల ప్రభావం వల్ల మీ కెరీర్లో మంచి పురోగతి లభిస్తుంది. ఈ కాలంలో మీ ఇంట్లో ఓ శుభకార్యం కూడా నిర్వహించొచ్చు.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలోని గురుడు తన సొంత ఇంటికి మీన రాశిలోకి అడుగుపెట్టాడు. గురుడి రాక సందర్భంగా శుభ ఫలితాలు వస్తాయని చాలా మంది నమ్ముతారు. అయితే గురు గ్రహంతో పాటు శుక్రుడు కూడా ఇదే రాశిలోకి రానున్నాడు. గురుడు, శుక్రుని గ్రహాలు రెండూ శుభ ఫలితాలకు సంబంధించినవే. ఈ నేపథ్యంలో 2022లో సంవత్సరంలో ఏప్రిల్ 27వ తేదీన గురుడు, శుక్రుడు మీన రాశిలోకి ప్రవేశించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా వీటి ప్రభావం అద్భుతంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications