For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Kabirdas Jayanti 2021: అజ్ణానం అనే చీకటిని తొలగించే కబీర్ దాస్ సందేశాలను చూసేద్దామా...

కబీర్ దాస్ జయంతి సందర్భంగా కొన్ని ముఖ్యమైన సందేశాలను తెలుసుకుందాం.

|

హిందూ క్యాలెండర్ ప్రకారం, కబీర్ దాస్ జయంతిని ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. కబీర్ దాస్ పుట్టుకతో అనేక రకాల నమ్మకాలు ఏర్పడ్డాయి. ఈయన కాలంలో భక్తి విస్తరించిందని చాలా మందది నమ్మతుతారు.

ఈయన తన జీవితాంతం ప్రజల ఆరాధనను, మూఢనమ్మకాలను వ్యతిరేకిస్తూ వచ్చాడు. అయితే తన సందేశాలు, సూక్తులతో ప్రజలలో చైతన్యం నింపేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా కబీర్ దాస్ యొక్క విలువైన మాటలను తెలుసుకుని.. అజ్ణానం అనే చీకటిని తొలగించుకుందాం రండి...

Kabirdas Jayanti 2021 : Sant Guru Kabir Messages, Quotes, Sayings in Telugu

ప్రస్తుత కలియుగంలో ప్రేమకు, అవసరానికి, స్వార్థానికి, వ్యామోహానికి తేడానే తెలియకుండా పోయింది. మనకు అవసరానికి ఉపయోగపడేవారిని మన స్నేహితులని, మిగిలిన వారు కాదనుకుంటున్నాం. మనకు అనుకూలంగా ఉండేవారిని మిత్రులని.. మిగిలిన వారిని శత్రువులుగా భావిస్తున్నాం.

Kabirdas Jayanti 2021 : Sant Guru Kabir Messages, Quotes, Sayings in Telugu

వ్యామోహాన్నే ప్రేమ అనుకుంటున్నాం. ప్రస్తుత సమాజంలో చాలా వరకు ప్రేమలో ఇచ్చి పుచ్చుకోవడాలు కూడా లేవు. నేను ప్రేమిస్తున్నా కాబట్టి నువ్వు కూడా నన్ను ప్రేమించు, లేదంటే నీది అసలైన ప్రేమ కాదనుకుంటాం.

Kabirdas Jayanti 2021 : Sant Guru Kabir Messages, Quotes, Sayings in Telugu

మనం ఇతరులను బాధ పెట్టి ప్రేమ అనుకుంటే ఎంతో పొరపాటు. ప్రేమ ఉన్న చోట బాధకు తావు లేదు. ప్రేమ అంటే త్యాగమని కూడా కాదు. వ్యామోహం కానప్పుడు త్యాగం కూడా కాదు. ప్రేమ ఎవరి మీద ఉంటుందో వారి ఆనందాన్ని కోరుకోవడమే ప్రేమ, వారి తనకి ఆనందాన్ని ఇవ్వాలనుకోవడం వ్యామోహం. తను ఇష్టపడ్డవారిని సంతోషపెట్టాలనుకునేది ప్రేమ. తన ఇష్టానికి తగ్గట్టుగా ఇతరులు ప్రవర్తించాలనుకునేది వ్యామోహం. కాబట్టి ఈ రెండూ ఒకే దగ్గర ఉండేందుకు అవకాశం లేదని కబీర్ దాస్ చెప్పాడు.

Chanakya Niti: చాణక్యుని ప్రకారం.. మనీ కన్నా మూడు ముఖ్య విషయాలేంటో తెలుసా...Chanakya Niti: చాణక్యుని ప్రకారం.. మనీ కన్నా మూడు ముఖ్య విషయాలేంటో తెలుసా...

ఒర ముఖ్యం..

ఒర ముఖ్యం..

సాధువుల కులం అడగొద్దు..

వారి నుండి జ్ణానాన్ని పొందండి..

కత్తికి గల పదును ముఖ్యం..

ఒర ముఖ్యం కాదు..

- సంత్ కబీర్ దాస్

అగ్నిలో కాంతి..

అగ్నిలో కాంతి..

నువ్వుల్లో నూనె ఎలా ఉంటుందో..

అగ్నిలో కాంతి ఎలా ఉంటుందో..

అదే విధంగా మనలోనే దేవుడు ఉన్నాడు..

మీరే దాన్ని కనుగొలరు..

- కబీర్ దాస్

దేవుడిని తలచుకుంటే..

దేవుడిని తలచుకుంటే..

బాధల్లో ఉన్నప్పుడు దేవుడిని స్మరిస్తారు..

సంతోషంలో దేవుడిని మరచిపోతారు..

ఆనందంలో ఉన్నప్పుడు కూడా..

దేవుడిని తలచుకుంటే దుఃఖం ఎప్పటికీ రాదు..

- కబీర్ దాస్

ఎంత ఎత్తుకు పెరిగినా..

ఎంత ఎత్తుకు పెరిగినా..

తాటి చెట్టు చాలా ఎత్తైనది.. పెద్దది..

కానీ అది ఎవ్వరికీ నీడ ఇవ్వదు..

వాటి పండ్లు చాలా ఎత్తులో పెరుగుతాయి..

అదేవిధంగా మీరు ఎవరికీ మంచి చేయకపోతే..

ఇలా ఎంత ఎత్తుకు పెరిగినా ఉపయోగం లేదు.

- కబీర్ దాస్

ఏ రకమైన కారు కొంటే.. మీకు లక్కీ కలిసొస్తుందో తెలుసా...ఏ రకమైన కారు కొంటే.. మీకు లక్కీ కలిసొస్తుందో తెలుసా...

వ్యామోహానికి తావే లేదు..

వ్యామోహానికి తావే లేదు..

వ్యామోహం ఉన్న చోట

ప్రేమ ఎలా ఉంటుంది..

ప్రేమ ఉన్న చోట..

వ్యామోహానికి తావే లేదు.

- కబీర్ దాస్

జనులు తీర్థయాత్రలకు..

జనులు తీర్థయాత్రలకు..

నీటిలో ఉండే చేపకు

దాహంగా ఉందని వింటే

నేను నవ్వుతాను. దేవుడిని

కనుగొనేందుకు జనులు తీర్థయాత్రలకు

వెళ్తున్నారని విన్నప్పుడు నేను నవ్వుతాను.

- కబీర్ దాస్

సంతోషంగా ఉండటమే..

సంతోషంగా ఉండటమే..

అన్నింటికన్నా గొప్పవరం..

మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటమే..

- సంత్ కబీర్ దాస్

ప్రేమ, జాలి, దయ లేని వ్యక్తి..

ప్రేమ, జాలి, దయ లేని వ్యక్తి..

ఇతరులపై ప్రేమ, జాలి, దయ లేని వ్యక్తి పశువుతో సమానం

- కబీర్ దాస్

English summary

Kabirdas Jayanti 2021 : Sant Guru Kabir Messages, Quotes, Sayings in Telugu

Here we are talking about the kabirdas jayanti 2021 : Sant guru kabir messages, quotes, sayings in Telugu. Read on
Desktop Bottom Promotion