For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Kargil Vijay Diwas 2021 : దాయాదిని భారీ దెబ్బ కొట్టిన భారత్... రెపరెపలాడిన మువ్వన్నెల జెండా...

కార్గిల్ విజయ దివాస్ యొక్క వీరగాథ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

|

సరిగ్గా 22 ఏళ్ల క్రితం జులై 26వ తేదీన మన దాయది దేశం భారత్ ను దొంగ దెబ్బ కొట్టాలనుకుంది.. అయితే పాకిస్థాన్ కుట్రలను పసిగట్టిన మన భారత సైనికులు వారిని చావు దెబ్బ కొట్టారు.మంచు కొండల్లో మాటు వేసి పాక్ సైనికులను మట్టుబెట్టేశారు.

kargil-vijay-diwas-2020-history-and-significance

కార్గిల్ యుద్ధంలో మన సైనికులు చేసిన అసమాన పోరాటమే భారత్ కు అద్వితీయమైన విజయాన్ని అందించింది.ఆ అమర జవాన్ల పోరాటాన్ని స్మరించుకునేందుకు భారతదేశం ప్రతి సంవత్సరం జులై 26న 'విజయ్ దివస్' నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఆ రణభూమి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

హిమాలయ పర్వతాల్లో..

హిమాలయ పర్వతాల్లో..

మన దేశ సరిహద్దుల్లో ముఖ్యమైన ప్రాంతమైన హిమాలయ పర్వతాల్లోని ఘర్ కోం అనే గ్రామంలో తషీ నామ్ గ్యాల్ అనే గొర్రెల కాపరి తప్పిపోయిన తన గొర్రెలను వెతుక్కుంటూ పాక్ సరిహద్దుల వరకు వెళ్లాడు.

బంకర్లు తవ్వడాన్ని..

బంకర్లు తవ్వడాన్ని..

అక్కడ చాలా మంది సైనిక దుస్తుల్లో భారత్ భూభాగంలోకి కంచెను దాటుకుని వచ్చి బంకర్లు తవ్వడాన్ని గమనించాడు. వారి దుస్తులను బట్టి పాకిస్థాన్ సైనికులని నిర్ధారించుకుని, ఆ విషయాన్ని వెంటనే భారత సైనిక శిబిరం వద్దకు వెళ్లి ఆ విషయాన్ని చెప్పాడు.

యుద్ధానికి తొలి అడుగు..

యుద్ధానికి తొలి అడుగు..

దీంతో కెప్టెన్ సౌరభ్ కాలియా ఐదుగురు సైనికులతో కలిసి అక్కడికి చేరుకోగా, పాక్ సైన్యం వారిని బంధించి, వారిని చిత్రహింసలకు గురి చేసి చంపేసింది. ఈ ప్రాంతం కార్గిల్ కు దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రెండు దేశాల మధ్య యుద్ధానికి ఇక్కడే తొలి అడుగు పడింది.

దాయాది మోసం..

దాయాది మోసం..

శీతాకాలంలో హిమాలయ పర్వత ప్రాంతాల్లో మంచు కారణంగా, అక్కడ శిబిరాలను ఖాళీ చేస్తుంటాయి. ఆ మేరకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. అయితే 1999లో ఈ పరిస్థితిని అడ్వాంటేజ్ కు తీసుకుందామనుకున్న పాక్ భారత్ ను దెబ్బతీయాలని కుట్ర పన్నింది.

భారత శిబిరంలోకి..

భారత శిబిరంలోకి..

ఆ సమయంలో పాక్ సైన్యం భారత భూభాగంలోకి సుమారు 4-5 కిలోమీటర్ల మేర చొచ్చుకుని వచ్చి, 130 భారత శిబిరాలను ఆక్రమించింది. ఆ సమయంలో ప్రధానిగా ఉన్న అటల్ బిహారీ వాజ్ పేయీ, పాక్ ప్రధాని మధ్య శాంతి కోసం ‘లాహోర్ ప్రకటన' చేసిన సమయంలో ఆ దేశ సైన్యాధ్యక్షుడు ముషారఫ్ ఈ కుట్రకు తెరతీశారు.

‘ఆపరేషన్ విజయ్’

‘ఆపరేషన్ విజయ్’

ఎన్ని హెచ్చరికలు చేసినా భారత సైనిక శిబిరాల నుండి పాక్ సైన్యం ఆశించినమేర స్పందన రాకపోవడంతో భారత సైనికులు ‘ఆపరేషన్ దివస్' పేరుతో 1999 మే 3న రంగంలోకి దిగారు. శత్రువుల కాల్పులను ఎదుర్కొంటూనే అత్యంత ఎత్తుగా ఉన్న పర్వత శ్రేణుల్లోని శిబిరాలను చేరుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే వందల సంఖ్యలో ప్రాణాలు వదిలారు. పాక్ సైనికులతో పాటు ఉగ్రమూకలు కూడా ఆ శిబిరాల్లో ఉన్నారని నిర్ధారించుకున్న భారత్ ‘ఆపరషన్ సఫేద్ సాగర్'పేరుతో ఎయిర్ ఫోర్స్ ను రంగంలోకి దించింది.

ఎయిర్ ఫోర్స్ కు ఎదురుదెబ్బలు..

ఎయిర్ ఫోర్స్ కు ఎదురుదెబ్బలు..

అయితే అది దాదాపు 32 వేల అడుగుల ఎత్తులో ఉండటంతో ఎయిర్ ఫోర్స్ కు కూడా ఎదురుదెబ్బలు తగిలాయి. శత్రువుల దాడిలో రెండ్రోజుల్లోనే మూడు యుద్ధ విమానాలు కుప్పకులాయి. దీంతో దెబ్బతిన్న పులిలా.. వాయుసేన మిరాజ్-2000 యుద్ధ విమానాల ద్వారా శత్రువులపై బాంబుల వర్షం కురిపించింది. భారత సైన్యం మెరుపుదాడులను పాక్ సైన్యం తట్టుకోలేకపోయింది.

దారికొచ్చిన దాయాది..

దారికొచ్చిన దాయాది..

అదే సమయంలో అంతర్జాతీయంగా దేశాలన్నీ పాకిస్థాన్ కు వ్యతిరేకంగా మారేలా భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. దీంతో దారికొచ్చిన పాక్ శిబిరాల నుంచి తన సైన్యాన్ని వెనక్కి తీసుకుంది.

రెపరెపలాడిన మువ్వన్నెల జెండా..

రెపరెపలాడిన మువ్వన్నెల జెండా..

మన జవాన్ల వీర పోరాటంతో హిమాలయ పర్వతాల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ఈ యుద్ధం అధికారికంగా 1999 జులై 26న ముగిసింది. ఈ రణంలో 559 మంది భారత సైనికులు వీర మరణం పొందగా.. 1536 మంది గాయపడ్డారు. పాక్ కు చెందిన దాదాపు 3 వేల మంది సైనికులు, ఉగ్రవాదులు హతమయ్యారు. కార్గిల్ యుద్ధంలో వీర మరణం పొందిన సైనికుల త్యాగాలను స్మరించుకుంటూ భారత్ ప్రతి ఏటా జులై 26న ‘విజయ్ దివస్' నిర్వహిస్తోంది.

English summary

Kargil Vijay Diwas 2020: History And Significance

Here we talking about kargil vijay diwas 2020: history and significance. Read on
Desktop Bottom Promotion