For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Kartik Purnima 2021:కార్తీక పౌర్ణమి నాడు మీ రాశిని బట్టి ఈ వస్తువులను దానం చేస్తే సమస్యలు తొలగిపోతాయట..!

కార్తీక పూర్ణమి 2021 సందర్భంగా మీ రాశిని బట్టి ఈ వస్తువులను దానం చేస్తే శుభ ఫలితాలొస్తాయట.

|

హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి ఒక్క మాసానికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే అన్ని మాసాల కంటే కార్తీక మాసానికి అత్యంత ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అందులోనూ కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంది. ఈ పవిత్రమైన రోజున కొన్ని పరిహారాలు పాటించడం వల్ల మీ సమస్యలకు తప్పకుండా పరిష్కారం లభిస్తుందని పండితులు చెబుతారు.

Kartik Purnima 2021: Donate these things according to the zodiac sign

పురాణాల ప్రకారం.. కార్తీక పున్నమి రోజునే త్రిపురాసురన్ అనే రాక్షసుడిని పరమశివుడు సంహరించాడు. అందుకే ఈరోజును త్రిపుర పౌర్ణమి కూడా అని అంటారు. ఈరోజున భారతదేశంలోని ప్రజలందరూ వేడుకగా జరుపుకుంటారు. ఇదిలా ఉండగా.. కార్తీక పౌర్ణమి రోజున దానధర్మాలు చేయడం విధిగా చేయాలని పండితులు చెబుతున్నారు.

Kartik Purnima 2021: Donate these things according to the zodiac sign

ఈ సంవత్సరం నవంబర్ 19వ తేదీన కార్తీక శుక్రవారం నాడు కార్తీక పున్నమి వచ్చింది. ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవి, విష్ణుమూర్తిని కొలిస్తే సమస్యలన్నీ తొలగిపోతాయని, పేదలకు బట్టలు, బియ్యం వంటివి దానం చేస్తే వెయ్యి రెట్లు పుణ్యఫలం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. అలాగే ఈరోజు మినీ దీపావళి కూడా జరుపుకుంటారు. ఈ సందర్భంగా కార్తీక పౌర్ణమి నాడు జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మీ రాశిని బట్టి ఏయే వస్తువులను దానం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం...

ఆర్థిక సమస్యల నివారణకు కార్తీక పౌర్ణమి నాడు ఈ పూజా విధి విధానాన్ని పాటిస్తే....ఇష్టార్థ సిద్దిస్తుంది..!ఆర్థిక సమస్యల నివారణకు కార్తీక పౌర్ణమి నాడు ఈ పూజా విధి విధానాన్ని పాటిస్తే....ఇష్టార్థ సిద్దిస్తుంది..!

మేషరాశి

మేషరాశి

ఈ రాశి వారు కార్తీక పౌర్ణమి రోజున మంచి శ్రేయస్సు కోసం బెల్లం దానం చేయాలి. ఇలా బెల్లం దానం చేయడం వల్ల మీరు ఆర్థిక పరమైన విషయాల్లో విజయం సాధిస్తారు.

వృషభ రాశి..

వృషభ రాశి..

ఈ రాశి వారు కార్తీక పౌర్ణమి రోజున ఉన్ని బట్టలు దానం చేయడం మంచిది. ఇలా బట్టలు దానం చేయడం వల్ల జీవితంలో సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయి.

మిధున రాశి

మిధున రాశి

ఈ రాశి వారు కార్తీక పౌర్ణమి రోజున పచ్చి ఆవాలు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల వివాహితులకు వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది.

వంటగదిలో మీరు చేసే ఈ తప్పులు మీ జీవితంలో అంతులేని అనర్థాలను కలిగిస్తాయి...!వంటగదిలో మీరు చేసే ఈ తప్పులు మీ జీవితంలో అంతులేని అనర్థాలను కలిగిస్తాయి...!

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి వారు పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజున పేదలకు ఆహారం దానం చేయాలి. ఇలా చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది. అలాగే మీ జీవితం సుఖమయం అవుతుంది.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి వారు కార్తీక పౌర్ణమి రోజున గోధుమలు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి వారు కార్తీక పౌర్ణమి రోజున పశువులకు మేత తినిపించాలి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోతాయి.

Lunar Eclipse 2021:చంద్ర గ్రహణం వేళ రాశిచక్రాలపై ఎలాంటి ప్రభావమంటే...Lunar Eclipse 2021:చంద్ర గ్రహణం వేళ రాశిచక్రాలపై ఎలాంటి ప్రభావమంటే...

తులా రాశి

తులా రాశి

ఈ రాశి వారు కార్తీక పౌర్ణమి రోజున

తులారాశి వారు కార్తీక మాసం పౌర్ణమి రోజున మీ సామర్థ్యం మేరకు ఖీర్ లేదా డబ్బులను దానం చేయాలి. ఇలా చేయడం వల్ల పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. మీ జీవితంలో సంతోషం పెరుగుతుంది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి

ఈ రాశి వారు కార్తీక పౌర్ణమి రోజున బెల్లం, పప్పు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో శత్రువుల బాధ తొలగుతుంది.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారు కార్తీక పౌర్ణమి రోజున ఆలయానికి వెళ్లి పప్పు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో అన్ని సుఖాలు పొందుతారు.

మకర రాశి

మకర రాశి

ఈ రాశి వారు కార్తీక పౌర్ణమి రోజున దుప్పట్లు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఇలా చేయడం వల్ల మీ పనిలో వచ్చే అన్ని సమస్యలను తొలగిపోతాయి.

కుంభ రాశి

కుంభ రాశి

ఈ రాశి వారు కార్తీక పౌర్ణమి రోజున నల్ల ఉప్పు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలోని అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి.

మీనరాశి

మీనరాశి

కార్తీక పౌర్ణమి రోజున మీనరాశి వారు పసుపు, శనగ పిండితో చేసిన తీపి పదార్థాలను దానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో డబ్బుకు సంబంధించిన సమస్యలు ఉండవు.

FAQ's
  • 2021 సంవత్సరంలో కార్తీక పౌర్ణమి ఎప్పుడొచ్చింది?

    హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అని అంటారు. ఈ పవిత్రమైన రోజునే గురు నానక్ జయంతిని జరుపుకుంటారు. ఇక ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం 2021 సంవత్సరంలో నవంబర్ 19వ తేదీన కార్తీక పౌర్ణమి వచ్చింది. కొన్ని దేశాల్లో 18, 19వ తేదీల్లో ఈ పౌర్ణమి వచ్చింది.

  • కార్తీక పౌర్ణమి రోజున దానం చేయాల్సిన వస్తువులు ఏవి?

    కార్తీక పౌర్ణమి వంటి పవిత్రమైన రోజున ఈ వస్తువులను దానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోయి మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ పవిత్రమైన రోజున వెచ్చని దుస్తులను, గోధుమలు, శనగలు, పసుపు వంటి పదార్థాలను దానం చేస్తే శుభ ఫలితాలొస్తాయట.

English summary

Kartik Purnima 2021: Donate these things according to the zodiac sign

Kartik Purnima 2021: Donate these things according to the zodiac on Kartik Purnima, the problems of life will go away. Read on
Story first published:Thursday, November 18, 2021, 11:08 [IST]
Desktop Bottom Promotion