Latest Updates
-
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్.. -
జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పెంచే సీడ్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి! -
రైస్, చపాతీలోకి వహ్వా అనిపించే చికెన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే.. -
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొవ్వును కరిగించే 8 బెస్ట్ ఫుడ్స్ ఇవే! -
సూర్యుడు, బుధుడి కలయికతో బుధాదిత్య రాజయోగం..ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! -
గుంటూరు స్టైల్ ఎమ్మెల్యే పెసరట్టు.. ఇంట్లోనే సులభంగా ఇలా చేసుకోండి!
Chanakya Niti: మీరు, మీ ఫ్యామిలీ సంతోషంగా ఉండాలంటే.. వీటికి దూరంగా ఉండండి
ఈ కష్టాలకు దూరంగా ఉండాలంటే ఈరోజే అలాంటి వారిని వదులుకోవాలని చెప్పాడు. అలాంటి వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
చాణక్యుడు గొప్ప రాజనీతిజ్ఞుడు, గొప్ప వ్యూహకర్త. ఆయన మనిషి జీవితం గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. తన బోధనల సమాహారమే చాణక్య నీతి. ఆయన చెప్పిన ఎన్నో సూచనలు, సలహాలు పాటించి జీవితంలో విజయం సాధించవచ్చు. అవి ఇప్పటికీ ఎప్పటికీ ఆచరణీయమే. చాణక్య నీతిలో వివాహంతో సహా వ్యక్తిగత సంబంధాలకు వర్తించే అనేక సూచనలు ఉన్నాయి.

మనిషి జీవితం గురించి చాణక్యుడు చెబుతూ పలు కీలక అంశాలను ప్రస్తావించాడు. ఒక వ్యక్తి ఆనందంగా ఉండటానికి అతనొక్కడి కృషి మాత్రమే సరిపోదని ఇతరుల వ్యక్తిత్వం కూడా కీలక పాత్ర పోషిస్తుందని చాణక్యుడు చెప్పాడు. ఒక వ్యక్తి ఎప్పుడూ, ఎవరి పాపాలకు తానే శిక్ష అనుభవించాల్సి వస్తుందో చెప్పాడు. ఈ కష్టాలకు దూరంగా ఉండాలంటే ఈరోజే అలాంటి వారిని వదులుకోవాలని చెప్పాడు. అలాంటి వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
రాజా రాష్ట్రకృతం పాపం రాజ్యః పాపం పురోహితః|
భర్త చ స్త్రీకృతం పాపం శిష్యపాపం గురుస్తథా||
రాజు-ప్రజలు, గురువు-శిష్యులు, భర్త-భార్య సంబంధాల గురించి చెబుతూ ఈ విధంగా అనుసంధానించబడిన వ్యక్తులు ఒకరి పాపాలకు, ఒకరి తప్పులకు మరొకరు శిక్షను అనుభించవలిసి ఉంటుందని ఆచార్య చాణక్యుడు ఈ శ్లోకంలో వివరించాడు.
వీరికి దూరంగా ఉండాలన్న చాణక్యుడు:
ప్రతి వ్యక్తి తన చర్యలకు శిక్షను ఎదుర్కోవల్సి ఉంటుందని, అయితే ఇతరుల చెడు పనుల వల్ల చెడు పరిణామాలను తానే భరించవలసి వచ్చినప్పుడు కొన్నిసార్లు అలాంటి పరిస్థితి కూడా తలెత్తుతుందని చాణక్యుడు చెప్పాడు. ఆచార్యుడి ప్రకారం ఈ విషయాలను నివారించడానికి, ఇలాంటి వ్యక్తుల నుండి దూరంగా ఎలా ఉండాలో, క్లిష్ట పరిస్థితుల్లో ఎలా ప్రవర్తించాలో చెప్పాడు.
అధికారంలో ఉన్నవారికి దూరంగా ఉండండి:
చాణక్యుడి ప్రకారం, దేశంలోని ప్రజలు లేదా పాలకులు ఏదైనా తప్పు చేస్తే దాని ఫలితం ఇద్దరిపైనా ఉంటుందని చాణక్యుడు చెప్పాడు. అందుకే వీరిద్దరూ తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలని సూచించాడు. అధికారంలో ఉన్న వారికి, శక్తివంతమైన స్థాయిలో ఉన్నవారికి దూరంగా ఉండాలని చాణక్యుడు చెప్పాడు. అలాంటి ఎప్పటికీ మంచి మిత్రులు, శత్రువులు కాలేరని, వారు కేవలం వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఏదైనా చేస్తారని చాణక్యుడు చెప్పాడు.
అలాంటి గురువుకు దూరంగా ఉండండి:
శిష్యుడికి సన్మార్గం చూపడం గురువు పని. గురువు చూపిన మార్గంలో నడవడం శిష్యుడి బాధ్యత. అప్పుడే విజయం లభిస్తుంది. కానీ గురువు సరిగ్గా లేకుండా భవిష్యత్తులో శిష్యుడు చెడిపోతాడు. శిష్యుడు తప్పు చేస్తే తప్పులో మునిగిపోతాడు. అది జరిగితే గురువు పరువు పోతుందని చెప్పాడు చాణక్యుడు. అటువంటి పరిస్థితిలో, సరైన ఉపాధ్యాయుడిని ఎన్నుకోవాలని, అయితే విద్యను విలువైన వారికి మాత్రమే తెలియజేయాలని చాణక్యుడు చెప్పాడు.
అలాంటి భాగస్వామికి దూరం పాటించండి:
భార్యాభర్తలు ఒకరికొకరు బంధుమిత్రులు. జీవితంలో చెడ్డ జీవిత భాగస్వామి దొరికితే, ప్రతిరోజూ కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చాణక్యుడు చెప్పాడు. అటువంటి పరిస్థితిలో, వివాహం తర్వాత, కచ్చితంగా కోపం, అహంకారం, దురాశ అనే ప్రమాణాలపై జీవిత భాగస్వామిని పరీక్షించాలని చాణక్యుడు చెప్పాడు.



Click it and Unblock the Notifications
