Ketu Nakshatra Transit 2021: కేతువు అనురాధ నక్షత్రంలోకి ఎంట్రీ.. 12 రాశులపై ఎలాంటి ప్రభావమంటే...!

2021 కేతువు రవాణా వల్ల రాశిచక్రాలపై ఎలాంటి ప్రభావం పడుతుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కేతువును నీడ గ్రహం అంటారు. జాతకాల ప్రకారం కేతువు చాలా ముఖ్యమైనది. ఒక వ్యక్తికి ప్రత్యేక స్థానం మరియు మోక్షాన్ని అందించడంలో కేతువు సహాయపడుతుందని పండితులు చెబుతారు.

Ketu Nakshatra Transit 2021 In Anuradha Nakshatra: Effects on all zodiac signs in Telugu

కేతువును శిఖి మరియు ధ్వాజా అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం, స్వరాభను అనే రాక్షసుడిని విష్ణువు యొక్క మోహిని అవతారంలో సుదర్శన చక్రంతో విడదీసినప్పుడు, తన తల భాగాన్ని రాహు అని పిలుస్తారు.

Ketu Nakshatra Transit 2021 In Anuradha Nakshatra: Effects on all zodiac signs in Telugu

ఆ శరీర మొండెం భాగాన్ని కేతు అని పిలుస్తారు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే కేతు గ్రహం ఒక రాశి నుండి మరో రాశికి వెళ్లడానికి దాదాపు ఒకటిన్నర సమయం పడుతుంది. కేతువు ప్రభావం వల్ల ఇంట్లో మంచి ఫలితాలు వస్తాయి. ఈ సందర్భంగా 2021లో కేతువు తన స్థానాన్ని మారనున్నాడు.

Ketu Nakshatra Transit 2021 In Anuradha Nakshatra: Effects on all zodiac signs in Telugu

ఈ మాసంలో అనురాధ నక్షత్రంలో ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో ఏయే రాశులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది.. ఎవరెవరికి సానుకూల ప్రయోజనాలు కలగనున్నాయి.. ఏ రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..

మేష రాశి..

కేతువు అనురాధ నక్షత్రంలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి ప్రతికూలంగా ఉండొచ్చు. మీ పనులో అడ్డంకులు ఎదురుకావొచ్చు. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఎదురువుతాయి. కాబట్టి ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.

వృషభ రాశి..

వృషభ రాశి..

అనురాధ నక్షత్రంలోకి కేతువు సంచారం చేసే సమయంలో ఈ రాశి వారికి పవిత్రంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడిపేందుకు మీకు అవకాశం లభిస్తుంది. సమాజంలో మీ ప్రతిష్ట మరియు గౌరవం పెరుగుతుంది. ఆర్థిక పరంగా ఈ సమయం మంచిగా ఉంటుంది. ఆరోగ్య పరంగా ఈ కాలంలో మంచిగా ఉండాలి.

మిధున రాశి..

మిధున రాశి..

కేతువు అనురాధ నక్షత్రంలోకి రవాణా చేసే సమయంలో ఈ రాశి వారికి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా వివాహితులకు ఎక్కువ ఇబ్బందులు వస్తాయి. విద్యార్థులకు విద్యలో కొన్ని అడ్డంకులు వస్తాయి. మరోవైపు మీరు చేసే పనుల్లో మంచి అవకాశాలు వస్తాయి.

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

కేతువు అనురాధ నక్షత్రంలోకి ప్రయాణం చేసే సమయంలో ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు ఆర్థిక సమస్యల నుండి బయటపడొచ్చు. మీరు చేసే ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. అయితే మీరు శత్రువుల పట్ల జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది.

సింహ రాశి..

సింహ రాశి..

అనురాధ నక్షత్రంలోకి కేతు ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీరు ఈ సమయంలో కొత్త ఇంటిని కొనుగోలు చేయొచ్చు. ఆర్థిక పరంగా లాభాలు వస్తాయి.

కన్య రాశి..

కన్య రాశి..

అనురాధ నక్షత్రంలోకి కేతువు ఎంట్రీ ఇచ్చే సమయంలో ఈ రాశి వారికి శుభఫలితాలొస్తాయి. మీ వ్యక్తిగత జీవితంలో ఆనందం ఉంటుంది. మీకు శత్రువుల నుండి పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది. మీ పనిలో విజయం సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి.

తుల రాశి..

తుల రాశి..

కేతువు అనురాధ నక్షత్రంలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. అయితే మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. ఉద్యోగులు కార్యాలయంలో విజయం సాధించొచ్చు. మీ కుటుంబ జీవితంలో ఆనందం పొందుతారు.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

అనురాధ నక్షత్రంలోకి కేతువు రవాణా చేసే సమయంలో ఈ రాశి వారికి సాధారణంగా ఉంటుంది. మరోవైపు ఉద్యోగులకు, వ్యాపారులకు ఈ సమయంలో పురోగతి అవకాశాలు ఉంటాయి. మీరు వాదనలకు దూరంగా ఉండాలి.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

అనురాధ నక్షత్రంలోకి కేతువు ప్రవేశం వల్ల ఈ రాశి వారికి ప్రతికూలంగా ఉంటుంది. మీరు ఈ సమయంలో ఎక్కువ డబ్బు ఖర్చు చేయొచ్చు. మీ వైవాహిక జీవితంలో సమస్యలు ఉండొచ్చు. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడిపేందుకు ప్రయత్నించాలి.

మకర రాశి..

మకర రాశి..

కేతువు అనురాధ నక్షత్రంలోకి ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి. మీరు చేసే ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. ఈ సమయంలో ఉద్యోగులకు మరియు వ్యాపారులకు చాలా పవిత్రంగా ఉంటుంది. మీ కోరికలు కూడా నెరవేరొచ్చు.

కుంభ రాశి..

కుంభ రాశి..

కేతువు రవాణా వల్ల ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. అయితే ఉద్యోగులకు ఈ సమయంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మీరు అందరినీ గుడ్డిగా నమ్మితే మోసపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.

మీన రాశి..

మీన రాశి..

కేతువు అనురాధ నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి సాధారణ ఫలితాలు వస్తాయి. మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. అయితే ఈ సమయంలో మీకు ఆర్థిక పరంగా కొంత నష్టం రావొచ్చు. మీ వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది.

గమనిక : ఇక్కడ ఇచ్చిన సమచారం జ్యోతిషుల అభిప్రాయాల ప్రకారం, మాకు ఇంటర్నెట్లో దొరికిన సమాచారంతో పాటు మాకు ఉన్న పరిజ్ణానాన్ని జోడించి రాసినవి. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారం పూర్తిగా కచ్చితమైనదని మేం చెప్పలేం. కాబట్టి వీటిని నమ్మాలా లేదా అనేది మీ ఇష్టం. మీకు పూర్తి వివరాలు కావాలంటే వ్యక్తిగత జ్యోతిష్య నిపుణులను సంప్రదించగలరు. దీనికి బోల్డ్ స్కై తెలుగుకు ఎలాంటి సంబంధం లేదని పాఠకులు గమనించగలరు.

Desktop Bottom Promotion