Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
Ketu Transit 2022 :తుల రాశిలోకి కేతువు సంచారం.. 12 రాశుల జీవితాలు ఎలా మారతాయంటే...!
2022లో ఏప్రిల్ 12వ తేదీన కేతువు తుల రాశి లోకి ప్రవేశించే సమయంలో రాశిచక్రాలపై పడే ప్రభావం, పాటించాల్సిన పరిహారాల గురించి తెలుసుకుందాం.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలో రాహువుతో పాటు కేతు గ్రహాన్ని కూడా షాడో ప్లానెట్(నీడ గ్రహం) గా పరిగణిస్తారు. సాధారణంగా ఇది సౌర వ్యవస్థలో కనిపించదు, అంటే ఇవి సౌర వ్యవస్థలో ఉండవు. మిగిలిన గ్రహాలను టెలిస్కోపులో చూడొచ్చు.

దాదాపు 18 సంవత్సరాల తర్వాత 2022లో ఏప్రిల్ 12వ తేదీన అంటే మంగళవారం రోజున మధ్యాహ్నం 3:27 గంటలకు కేతువు వృశ్చిక రాశి నుండి నిష్క్రమించి తుల రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ సమయంలో 12 రాశి చక్రాలపై కచ్చితంగా ఎంతో కొంత ప్రభావం పడుతుంది. ఈ సందర్భంగా ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావం పడుతుంది.. ఎలాంటి పరిహారాలు పాటించాలనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
కేతువు ఈ రాశి నుండి ఏడో స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీరు సానుకూల ఫలితాలను పొందుతారు. మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. ప్రభుత్వ ఉద్యోగులకు అందరి నుండి పూర్తి సహకారం లభిస్తుంది. మీ వివాహ సంబంధ చర్చలు విజయవంతమవుతాయి. వ్యాపారులకు సాధారణంగా సమస్యలు వస్తాయి. ఈ కాలంలో మీరు ఎవ్వరికీ డబ్బును అప్పుగా ఇవ్వకూడదు. లేదంటే మీరు నష్టపోతారు.

వృషభ రాశి..
ఈ రాశి నుండి కేతువు ఆరో స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీ వ్యూహాలన్నీ ప్రభావవంతంగా ఉంటాయి. మీరు ఏదైనా పని ప్రారంభించాలన్నా.. లేదా వ్యాపార ఒప్పందంపై సంతకం చేయాలనుకుంటే, ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీ రహస్య శత్రువులు కూడా ఓడిపోతారు. మీరు కోర్టు కేసుల్లో కూడా విజయం సాధిస్తారు. మీకు దేశీ ప్రయాణం, విదేశీ ప్రయాణ యోగం కూడా కలగొచ్చు.

మిధున రాశి..
ఈ రాశి నుండి ఐదో స్థానం నుండి కేతువు సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీకు సంతోషకరమైన ఫలితాలొస్తాయి. విద్యార్థులు మరియు పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి మంచిగా ఉంటుంది. ఈ సమయంలో మీరు చాలా చురుగ్గా ఉంటారు. అయితే పిల్లలకు సంబంధించిన కొన్ని ఆందోళనలు మిమ్మల్ని కలవరపరుస్తాయి. మీ ప్రేమకు సంబంధించిన విషయాలలో ఉదాసీనత ఉంటుంది. మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి.

కర్కాటక రాశి..
ఈ రాశి నుండి కేతువు నాలుగో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో కర్కాటక రాశి వారు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నాలు చేయాలనుకునే వారికి, గ్రహాల సంచారం అనుకూలంగా ఉంటుంది. మీ విజయ ప్రక్రియ కొనసాగుతుంది. మరోవైపు మీరు కుటుంబ కలహాలు మరియు మానసిక రుగ్మతలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏ విధమైన కుటుంబ వివాదాలు పెరగడానికి అనుమతించొద్దు.

సింహ రాశి..
ఈ రాశి నుండి కేతువు మూడో స్థానం నుండి సంచారం చేయనున్నాడు.ఈ కాలంలో మీ ధైర్యం పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలకు ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగులకు, వ్యాపారులకు, కాంట్రాక్టర్లకు పురోగతి అవకాశాలు ఉంటాయి. విదేశీ కంపెనీలలో పని చేసే వారికి విజయవంతంగా ఉంటుంది. మీకు ఆధ్యాత్మిక పట్ల ఆసక్తి పెరుగుతుంది.

కన్య రాశి..
ఈ రాశి నుండి కేతువు రెండో స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీరు కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే మీకు ఆకస్మికంగా డబ్బు లభిస్తుంది. చాలా కాలంగా మీకు రావాల్సిన సొమ్ము తిరిగి వస్తుంది. మరోవైపు ఆస్తికి సంబంధించిన విషయాల్లో విభేదాలు తలెత్తొచ్చు. ఉద్యోగులు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే, ఎవరో చేసిన తప్పుకు మీరు బలౌతారు.

తుల రాశి..
కేతువు 18 సంవత్సరాల తర్వాత ఇదే రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ కాలంలో ఈ రాశి వారు ఆహ్లాదకరమైన ఫలితాలను పొందుతారు. అయితే మీకు కొన్ని మానసిక అవాంతరాలు ఏర్పడొచ్చు. మీ వ్యూహాలను గోప్యంగా ఉంచుకుంటే, మీరు మరింత విజయవంతమవుతారు. మీరు కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో ఏదైనా టెండర్ కోసం దరఖాస్తు చేసుకుంటే, శుభవార్తలు వినిపిస్తాయి.

వృశ్చిక రాశి..
ఈ రాశి నుండి కేతువు 12వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీకు ఆర్థిక పరంగా ఖర్చులు ఎక్కువ కావొచ్చు. ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ప్రయాణించాలి. అనవసర వివాదాలకు కూడా దూరంగా ఉండాలి. కోర్టు కేసులను కూడా బయట పరిష్కరించుకోవాలి. మరోవైపు కుటుంబ ఆరోగ్యం కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి రావొచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో వారు మాత్రం లాభపడొచ్చు.

ధనస్సు రాశి..
ఈ రాశి నుండి కేతువు 11వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ సమయం మీకు చాలా మంచిగా ఉంటుంది. విద్యార్థులు, పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు ఆధ్యాత్మిక, శుభ కార్యాలకు ఎక్కువ ఖర్చులు చేయాల్సి ఉంటుంది. కొత్త వ్యక్తులతో సంబంధాలు పెరుగుతాయి. మీ కుటుంబ పెద్దల సహకారం కూడా లభించే అవకాశం ఉంది.

మకర రాశి..
ఈ రాశి నుండి కేతువు పదో స్థానం నుండి ప్రయాణం చేయనున్నాడు. ఈ కాలంలో ప్రభుత్వ శాఖల్లో పని చేసే వారికి శుభవార్తలు వినిపిస్తాయి. సమాజంలోని ఉన్నత వ్యక్తులతో మీకు సత్సంబంధాలు పెరుగుతాయి. రాజకీయాల్లో పోటీ చేసేందుకు మంచి అవకాశం లభిస్తుంది. మీ ఆస్తి సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

కుంభ రాశి..
ఈ రాశి నుండి కేతువు తొమ్మిదో స్థానం నుండి రవాణా చేయనున్నాడు. ఈ కాలంలో మీకు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ ప్రయాణాల వల్ల దేశానికి మేలు జరుగుతుంది. విదేశాల్లో పని చేసే వారికి పౌరసత్వ సేవల ప్రయత్నాల్లో సానుకూల ఫలితమొస్తుంది. మరోవైపు మీ కుటుంబ సభ్యులతో ఎవ్వరితోనూ గొడవపడొద్దు. కోర్టు కేసుల్లో మీకు నిర్ణయం అనుకూలంగా వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి.

మీన రాశి..
ఈ రాశి నుండి కేతువు ఏడో స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ కాలంలో మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏదైనా నిర్ణయం తీసుకునేటట్లయితే, చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులు సాధించేందుకు ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. ఉద్యోగులు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ కోర్టు కేసులను బయట పరిష్కరించుకోవాలి.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాలలో కేతువును షాడో ప్లానెట్(నీడ గ్రహం) గా పరిగణిస్తారు. సాధారణంగా ఇది సౌర వ్యవస్థలో కనిపించదు, అంటే ఇవి సౌర వ్యవస్థలో ఉండవు. మిగిలిన గ్రహాలను టెలిస్కోపులో చూడొచ్చు. ఈ నేపథ్యంలో 2022లో ఏప్రిల్ 12వ తేదీన అంటే మంగళవారం రోజున మధ్యాహ్నం 3:27 గంటలకు కేతువు వృశ్చిక రాశి నుండి నిష్క్రమించి తుల రాశిలోకి ప్రవేశించబోతున్నాడు.



Click it and Unblock the Notifications