Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
Chanakya Niti: జీవితంలో, పనిలో విజయం అందుకోవాలంటే.. ఈ 5 ప్రశ్నలకు సమాధానం వెతకండి
విజయం సాధించడానికి 5 ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. ఆయన చెప్పిన ఆ ప్రశ్నలు ఏంటి, ఆ ప్రశ్నలకు సమాధానాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చాణక్యుడు గొప్ప రాజనీతిజ్ఞుడు. గొప్ప వ్యూహకర్త. మనిషి జీవితం గురించి ఎన్నో విషయాలు వెల్లడించాడు. ఒక వ్యక్తి సంతోషంగా ఉండటానికి, తలపెట్టిన పనిలో విజయం సాధించడానికి, సంబంధం సాఫీగా సాగడానికి ఎన్నో సూచనలు చేశాడు. ఆయన చెప్పిన సలహాలు, సూచనలు పాటించడం ద్వారా జీవితంలో, వ్యాపారంలో, పనిలో, సంబంధంలో విజయం సాధించవచ్చు.

విజయం సాధించడానికి 5 ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. ఆయన చెప్పిన ఆ ప్రశ్నలు ఏంటి, ఆ ప్రశ్నలకు సమాధానాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కః కాలః కాని మిత్రాణి కో దేశః కౌ వ్యాయాగమౌ|
కస్యాదం కా చ మే శక్తిరీతి చింత్యాం ముహుర్ముంహుః||
ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే.. జ్ఞాని తన సమయం ఎలా ఉంటుందో అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండాలి. ఎంత మంది స్నేహితులు ఉన్నారు, తాను నివసించే స్థలం ఎలా ఉంది, సంపాదన ఎంత ఖర్చు ఎంత, అసలు నేనెవరు నా శక్తి ఏంటి, నేనేం చేయగలనని ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని చాణక్యుడు చెప్పాడు.
విజయవంతం కావడానికి ఈ 5 విషయాలు తెలుసుకోవడం ముఖ్యం
సమయం గురించి:
ప్రస్తుతం తన సమయం ఎలా గడుస్తుందో తెలివైన వ్యక్తి ఎప్పుడూ తెలుసుకుంటూ ఉండాలి. దుఃఖమైనా, సంతోషమైనా దాని గురించి తెలుసుకోగలగాలి. వ్యాపారంలో ఉన్న వారు పరిస్థితులను అంచనా వేసి వ్యాపారం నిర్వహించాలి. ఉద్యోగంలో ఉన్న వారు సమయాన్ని అంచనా వేసి నిర్ణయాలు తీసుకోవాలి.
స్నేహితుల గురించి:
తెలివైన వ్యక్తి తన నిజమైన స్నేహితులు ఎవరో తెలుసుకోగలడు. మిత్రుల వేషధారణలో ఉన్న శత్రువుల గురించి తెలుసుకుంటాడు. నిజమైన మిత్రుడని, మిత్రునిగా మారువేషంలో ఉన్న శత్రువు ఎవరో తెలియకపోతే ఏదో ఒక రోజు మోసపోతారు.
ప్రాంతం ఎలా ఉంది:
నివసించే ప్రాంతం ప్రదేశం ఎలా ఉందో తెలుసుకోవడం ముఖ్యం. ప్రాంతం యొక్క పరిస్థితులు తెలుసుకుని నడుచుకుంటే జీవితం సాఫీగా సాగుతుంది. ఏదైనా పని తలపెట్టినప్పుడు అందులో విజయం సాధించాలన్నది ఇలాంటి వాటిపైనే ఆధారపడి ఉంటుంది.
ఆదాయం, ఖర్చు:
ఎంత ఆదాయం వస్తుంది, అందులో నుండి ఎంత ఖర్చు చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం. ఆదాయం, ఖర్చుల గురించి సరైన అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఒక వ్యక్తి ఎంత సంపాదిస్తున్నాడు, ఎంత ఆదాయం అందుకుంటున్నాడన్న దానిని బట్టి ఖర్చు చేయాలి. ఆదాయానికి మించిన ఖర్చు ఎప్పుడూ ప్రమాదకరమే.
సామర్థ్యాన్ని తెలుసుకోవాలి:
అంతిమంగా, అన్నింటికంటే ముఖ్యమైనది. మన సామర్థ్యంపై మనకు సరైన అంచనా ఉండటం. ఏదైనా పనిని చేయాలని తలపెట్టినప్పుడు దానిని పూర్తి చేయగలమో లేదో మనకు తెలిసి ఉండాలి. సామర్థ్యానికి మించిన పనిని ఎప్పుడూ తలకెత్తుకోవద్దు.



Click it and Unblock the Notifications