For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చాణక్య నీతి : మగవారు జాబ్, పెళ్లికి ముందు వీటి గురించి కచ్చితంగా తెలుసుకోవాలి...

ఉద్యోగం పొందడానికైనా.. వివాహం చేసుకోవడానికైనా చాణక్యుడు చెప్పిన ఈ విషయాలను పాటిస్తే అన్నింటిలో విజయం ఖాయం.

|

మన దేశంలో ఎందరో గొప్ప వీరులు, సూరులు ఉన్నారు. ఆనాటి చరిత్ర నుండి నేటి ఆధునిక యుగం వరకు ఎందరో మహానుభావులు ఉన్నారు. అలాంటి వారిలో చాణక్యుడు ఒకరు. అతని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పేరు వినని వారు తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరూ ఉండరనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Know these things of chanakya before getting a job and marriage

ముఖ్యంగా మనకు తరచుగా అపర చాణక్యుడి మాదిరిగా ప్రణాళిక రచిస్తున్నారు అని మనకు నిత్యం ఎక్కడో ఒక చోట కనిపిస్తూనే ఉంటుంది. అయితే చాణక్యుడు దగ్గర ప్రతి ఒక్క సమస్యకూ పరిష్కారం కచ్చితంగా ఉండేదట.

Know these things of chanakya before getting a job and marriage

ఈయన వేద శాస్త్రాన్ని ఒంటపట్టించుకుని రాజనీతి శాస్త్రాన్ని క్రీస్తు పూర్వ కాలంలోనే రాశారంట. ఇదొక్కటే కాదు.. చాణక్యుడు ఉద్యోగం, విద్య, వివాహం, ఇంట్లో, రాజకీయాల్లో ఇలా చెప్పుకుంటే పోతే ఏ సమస్యకైనా అందులో సమాధానాలను పొందుపరిచారట.

Know these things of chanakya before getting a job and marriage

చాణక్యుడు అదొక్కటే కాదు అర్థశాస్త్రాన్ని కూడా రచించాడు. దాని నియమాలను ఇప్పటికీ చాలా మంది పాటిస్తూ ఉంటారు. అందులో కూడా డబ్బును ఎలా వాడుకోవాలి. డబ్బును ఎలా సేవ్ చేయాలి. అనే విషయాలతో ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు ఏమేమీ చేయాలో అన్ని విషయాలను అందులో పొందుపరిచారు.

Know these things of chanakya before getting a job and marriage

వీటన్నింటి సంగతి పక్కనబెడితే చాణక్యుడు పురుషులు ఉద్యోగానికి, వివాహానికి ముందు ఏయే విషయాలను గుర్తుంచుకోవాలో.. ఎలాంటి పనులు చేయకూడదో కొన్ని ముఖ్యమైన విషయాలను వివరించాడు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

చాణక్య నీతి : ఈ లక్షణాలుండే వారిని అస్సలు వదులుకోకండి...చాణక్య నీతి : ఈ లక్షణాలుండే వారిని అస్సలు వదులుకోకండి...

సమానమైన వారితో..

సమానమైన వారితో..

  • మీతో సమానంగా ఉండే వ్యక్తులతో స్నేహాన్ని ఎక్కువగా పెంచుకోవాలని ఆచార్య చాణక్య చెప్పారు.
  • మీ కంటే ముందుకు వెళ్లే వారితో స్నేహం చేయకూడదు.
  • మీ కంటే వెనుకబడిన వారితోనూ స్నేహం చేయకూడదు.
  • దీని వల్ల చాలా సమస్యలు ఎదురవుతాయి.
  • మీరు నిజమైన స్నేహితుడిని మరియు సమానమైన పొందడం వల్ల ప్రతికూల పరిస్థితుల్లో సైతం వారు మీకు అండగా ఉంటారు.
  • ఉద్యోగానికి ముందు..

    ఉద్యోగానికి ముందు..

    ఒక రాజు తన మనసుతో ఉదారంగా ఉండటం మంచిదని చాణక్యుడు చెప్పారు. దీని అర్థం మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తారు. ముందుగా అక్కడి యజమాని స్వభావం గురించి తెలుసుకోవాలి. యజమాని స్వభావం సరిగ్గా ఉంటే, మీరు ఆ పనిని శాంతితో చేయవచ్చు. లేకపోతే మీరు చాలా సమస్యలను ఎదుర్కొంటారు.

    రెండింటి సూచిక..

    రెండింటి సూచిక..

    వ్యాపారంలో, ప్రయోజనం పొందిన వారు మాత్రమే సమర్థవంతంగా పని చేస్తారు. వ్యాపారానికి ఏ దశ సరైనదో వారు తెలుసుకోవాలి. తన ప్రసంగాన్ని ఎలా నియంత్రించాలో అతనికి తెలుసు. ఎందుకంటే ప్రసంగం అనేది అతనికి లాభం మరియు నష్టం రెండింటినీ సూచిస్తుంది. మీరు కస్టమర్లను ఎంత బాగా ఆకట్టుకుంటే అంతమంది మీ దగ్గరికి వస్తారు. లేకపోతే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.

    స్త్రీ గురించి..

    స్త్రీ గురించి..

    ఏ స్త్రీ అయితే నైపుణ్యంతో పాటు అందంపై శ్రద్ధ వహిస్తుందో అలాంటి ఇల్లు అందంగా మరియు ఆనందంగా ఉంటుందని చాణక్యుడు చెప్పాడు. అయితే ఇలాంటి లక్షణాలు ఉండే మహిళలు ఇంటిని స్వర్గంలా కావాలనుకుంటే అలానే మార్చుకుంటారు. అలా కాకుండా నరకంలా మార్చాలని భావిస్తే అది కూడా చేసే సామర్థ్యం వీరిలో పుష్కలంగా ఉంటుంది. ఎందుకంటే మహిళలు పురుషుల కంటే తెలివైన వారు. అందుకే మీరు మీ ఇంట్లో ఆనందం మరియు శాంతిని కోరుకుంటే, మీరు ఎల్లప్పుడూ ఒకరినొకరు గౌరవించుకోవాలి.

    గమనిక : ఇక్కడ మాకు దొరికిన కొన్ని కథల ఆధారంగా, ఇంటర్నెట్ లో దొరికిన సమాచారాన్ని బట్టి, మా దగ్గర ఉన్న విషయాలను జోడించి.. మా పరిజ్ణానం మేరకు ఇవి రాశాము.

Read more about: chanakya
English summary

Know These Things of Chanakya Before Getting a Job and Marriage

Here are these things of chanakya before getting a job and marriage. Take a look
Desktop Bottom Promotion