Latest Updates
-
నిమిషం ఆలస్యంగా తిన్నా గంట సేపు జీతం లేని చాకిరీ తప్పదు.. ఆఫీసులో వింత నియమం.! -
మాజీ భాగస్వామితో గడిపిన ఆ సందర్భాలు.. పదే పదే అపరాధ భావనకి గురవుతున్నారా.? -
రోజూ పూజ చేస్తున్నా ఫలితం రావడం లేదా? ఈ 5 తప్పులు కారణం కావచ్చు! -
ఫేస్ వాష్ కొనే పని లేదు.. వారం రోజుల్లోనే మెరిసే ముఖం.. కిచెన్లోనే అద్భుత రహస్యం.! -
మిలీనియల్ ‘అబ్బాయిల’కి అట్రాక్ట్ అవుతున్న జెన్ జీ అమ్మాయిలు.. కారణాలివే.! -
నెలరోజుల పాటు ఈ ఒక్కటి మానేస్తే.. ఈజీగా 3 కేజీల బరువు తగ్గేస్తారు.! -
రక్తహీనత సమస్యకి దివ్య ఔషధం.. పాలకూరతో ఇలా చేశారంటే మెతుకు కూడా వదిలిపెట్టరు.! -
మహిళల్లో పడిపోతున్న అండాల సంఖ్య.. ఈ కారణాలు తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు.! -
టేస్ట్, హెల్త్ ఒకేసారి..ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఓట్స్ వెజిటబుల్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలంటే.. -
జూన్ 23: ఈ రాశుల వారికి అదృష్టం.. కాసుల వర్షం కురిసే ఛాన్స్!
Kumbha Rasi Ugadi Rasi Phalalu 2022 :‘శుభకృత’ ఏడాదిలో కుంభ రాశి వారి జాతకం ఎలా ఉంటుందంటే...!
2022లో తెలుగు నూతన సంవత్సరంలో కుంభ రాశి వారి జాతకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మరి కొన్ని గంటల్లో మనం తెలుగు సంవత్సరంలో చివరి మాసానికి మరికొన్ని రోజుల్లో వీడ్కోలు పలకబోతున్నాం. 2022 సంవత్సరంలో ఏప్రిల్ 2వ తేదీన అంటే శనివారం నాడు మనం తెలుగు నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం.

'ఫ్లవ' నామ సంవత్సరానికి ముగింపు పలికి 'శుభకృతు' నామ సంవత్సరానికి స్వాగతం పలుకనున్నాం. ఇది మన 60 సంవత్సరాల్లో 36వ సంవత్సరంగా పండితులు చెబుతున్నారు.

శాస్త్రాల ప్రకారం, 'శుభకృత' నామ సంవత్సరంలో శుభ ఫలితాలు వస్తాయి. దుఃఖాలు తొలగిపోతాయి. కష్టాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురిసి అన్ని పంటలు మనకు లభిస్తాయట. ఆహార పంటలతో పాటు ఇతర పంటల ఉత్పత్తులు కూడా బాగా దొరుకుతాయట.

ఇదిలా ఉండగా.. ఈ ఏడాదిలో కొన్ని అశుభ ఫలితాలు కూడా రానున్నాయట. ఈ ఏడాదిలో కొన్ని ఆటంకాలు, దొంగల భయం ఉంటుందని, ముఖ్యంగా సైబర్ నేరాలు ఎక్కువగా పెరుగుతాయని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. 2022 తెలుగు నూతన సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతకం ఎలా ఉంటుంది.. ముఖ్యంగా కుంభ రాశి వారికి ఈ ఏడాది ఎలాంటి ఫలితాలొస్తాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఆదాయం-09, వ్యయం-02
ఈ రాశి వారికి తెలుగు నూతన సంవత్సరంలో ఆదాయ పరంగా మంచి ఫలితాలొస్తాయి. ఖర్చులు కూడా తక్కువగా ఉంటాయి.
ఈ రాశి వారికి ధనిష్ట నక్షత్రం 3,4 రెండు పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2,3,4 నాలుగు పాదాలు, ఫూర్వాభాద్ర నక్షత్రాలు 1,2,3,4 పాదాల్లో సంచారం చేస్తుంటాయి.

రాజపూజ్యం-09, అవమానం-04
ఈ ‘శుభకృత' నామ సంవత్సరంలో ఈ రాశి వారికి గురు గ్రహ ప్రభావం వల్ల ఖర్చులు పెరిగినప్పటికీ, ఆదాయం బాగా సమకూరుతుంది. విద్యార్థులకు విద్యా రంగంలో శుభ ఫలితాలొస్తాయి. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. సంతానం గురించి ఎదురుచూస్తున్న వారికి శుభవార్త వినిపిస్తుంది. మీకు రుణాల నుండి విముక్తి లభిస్తుంది.

శని ప్రభావం వల్ల..
తెలుగు నూతన సంవత్సరంలో కుంభ రాశి వారికి శని గ్రహం ప్రభావం వల్ల ఏప్రిల్ 2022 నుండి 2023 జనవరి 17వ తేదీ వరకు ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారికి ఈ ఏడాదిలో ఏలినాటి దశ కొనసాగుతుంది. కాబట్టి మీరు ఈ సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

రాహు ప్రభావం..
తెలుగు నూతన సంవత్సరంలో రాహూ ప్రభావం వల్ల ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలొస్తాయి. ఎన్ని కష్టాలెదురైనా పట్టుదలతో పనులన్నీ పూర్తి చేస్తారు. వ్యాపారులకు వ్యాపార దక్షత వల్ల ధన లాభాలు ఏర్పడతాయి. ఆరోగ్య పరంగా ఈ కాలంలో మంచిగా ఉంటుంది. మరోవైపు మీ కుటుంబ సభ్యులు మీపై కొంత అశ్రద్ధ వహిస్తారు.

కేతు ప్రభావం..
ఈ రాశి వారికి తెలుగు నూతన సంవత్సరంలో కేతువు ప్రభావం వల్ల, పూర్వీకుల ఆస్తి నుండి కొన్ని ఆర్థిక లాభాలొస్తాయి. అయితే మరోవైపు తండ్రికి సంబంధించి ఆరోగ్య సమస్యలు కూడా ఏర్పడతాయి. ఉద్యోగులు కార్యాలయంలో తెలివితేటలు ప్రదర్శించి ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు. ఈ కాలంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెంచుకుంటారు.

పరిహారాలివే..
కుంభ రాశి వారికి ఈ ఏడాది ఏలి నాటి శని దశ కొనసాగుతోంది కాబట్టి.. పరిహారం కోసం తమిళనాడులోని తిరునల్వార్ వెళ్లి శనీశ్వరుని ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోవాలి లేదా మహారాష్ట్రలోని శనిసింగ్నాపురానికి వెళ్లి అభిషేకం నిర్వహించాలి. అదే విధంగా శ్రీకాళహస్తిలో రాహు, కేతు పూజలు జరిపించాలి. అలా వెళ్లడానికి కుదరని వారు నిత్యం గణపతిని ఆరాధన చేస్తూ.. కనకదుర్గ ఆలయానికి వెళ్లి మంగళవారం, శనివారం రోజున కుంకుమ పూజలు చేయాలి. అదే విధంగా ప్రతికూల ప్రభావాలను అధిగమించేందుకు మంగళవారం, శనివారం రోజున దుర్గాదేవి ఆలయానికి వెళ్లి అమ్మవారికి నిమ్మకాయల మాలను లేదా ఎర్రని పువ్వులతో అంటే గులాబీ లేదా మందార పువ్వులను సమర్పించడం వల్ల మీకు దోషం నుండి విముక్తి లభిస్తుంది.



Click it and Unblock the Notifications