Latest Updates
-
సమంత సీక్రెట్ ఇదే..రోజూ ఉదయం అలా చేస్తే లైఫ్ జిల్ జిల్ జిగా జిగా.. -
షుగర్, బీపీకి చెక్ పెట్టే కొర్రల కిచిడీ..వారంలో 2 రోజులు తింటే బరువు తగ్గడమే కాకుండా రోజంతా సూపర్ ఎనర్జీ! -
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా.. -
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే? -
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..! -
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా?
Chanakya Niti: స్నేహం గురించి ఈ విషయాలు తెలుసుకోండి, లేకపోతే పశ్చాత్తాపపడారు
ఆచార్య చాణక్యుడు స్నేహం గురించి గురించి చెప్పిన ఆ విషయాలు ఏంటి? స్నేహానికి చెందిన ఏ విషయాల గురించి ముందే తెలుసుకోవడం వల్ల దాని మాధుర్యం మరింత తెలుస్తుంది, భవిష్యత్తులో పశ్చాత్తాపపడకుండా ఉంటామో ఇప్పుడు తెలుసుకుందాం.
జీవితంలో అత్యంత ముఖ్యమైన, సంతృప్తికరమైన అంశాల్లో స్నేహం ఒకటి. మంచి స్నేహితులను కలిగి ఉండటం వల్ల మనకు సాంగత్యం, మద్దతు, మంచి భావాన కలుగుతుంది. అయితే అన్ని స్నేహాలు ఒకేలా ఉండవు. స్నేహాన్ని పెంపొందించుకునేటప్పుడు, దానిని కొనసాగించేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన కొన్ని విషయాలు ఉన్నాయని చాణక్యుడు చెప్పాడు.

ఆచార్య చాణక్యుడు స్నేహం గురించి గురించి చెప్పిన ఆ విషయాలు ఏంటి? స్నేహానికి చెందిన ఏ విషయాల గురించి ముందే తెలుసుకోవడం వల్ల దాని మాధుర్యం మరింత తెలుస్తుంది, భవిష్యత్తులో పశ్చాత్తాపపడకుండా ఉంటామో ఇప్పుడు తెలుసుకుందాం.

స్నేహానికి కృషి అవసరం:
ఏదైనా సంబంధం లాగే స్నేహం కూడా. మితృత్వాన్ని కొనసాగించడానికి కృషి అవసరం. స్నేహితుల కోసం సమయాన్ని వెచ్చించడం, క్రమం తప్పకుండా వారిని కలవడం, వారికి అవసరమైనప్పుడు వారికి అండగా ఉండటం చాలా ముఖ్యం. మీ స్నేహాలను తేలికగా తీసుకోకండి. మీరు స్నేహాన్ని పెంపొందించే ప్రయత్నంలో ఉన్నారని నిర్ధారించుకోవాలని చాణక్యుడు సూచించాడు.

నాణ్యమైన స్నేహం ముఖ్యం:
చాలా మంది స్నేహితులను కోరుకోవడం ఉత్సాహంగా అనిపించినప్పటికీ, ఎంత ఎక్కువ మంది స్నేహితులు ఉన్నారు అనే దాని కంటే మీకు, మీ స్నేహితులు మధ్య ఎంత బాండింగ్ ఉంది అనేదే చాలా ముఖ్యం. జస్ట్ హాయ్ బాయ్ అనుకునే స్నేహితులు ఉన్నా లేనట్లే. వాళ్లు అసలు ఫ్రెండ్స్ లెక్కలోకి కూడా రారు. అందుకే ఎక్కువమందితో స్నేహం కాకుండా కొంతమందితో మంచి బాండింగ్ ఏర్పరచుకోవాలని ఆచార్య చాణక్యుడు వెల్లడించాడు.

కమ్యూనికేషన్ కీలకం:
స్నేహంతో సహా ఏదైనా సంబంధానికి మంచి కమ్యూనికేషన్ చాలా అవసరం. మీరు మీ స్నేహితులతో బహిరంగంగా, నిజాయితీగా కమ్యూనికేట్ చేయాలి. అలాగే చేయమని వారిని ప్రోత్సహించాలి. అవసరమైతే కష్టమైన సంభాషణలు చేయడానికి భయపడొద్దు. ఎందుకంటే ఇది దీర్ఘకారంలో మీ స్నేహాన్ని బలపరుస్తుంది.

ఒకరికొకరు మద్దతు ఇచ్చుకోవడం:
ఇది ప్రతి స్నేహంలోనూ చాలా ముఖ్యమైనది. మీ స్నేహితులకు అవసరమైనప్పుడు వారికి మద్దతు ఇవ్వాలి. మీకు అవసరమైనప్పుడు వారి మద్దతు అడగాలి. అదే నిజమైన స్నేహం అనిపించుకుంటుందని ఆచార్యుడు చెప్పాడు.

ఒకరి సరిహద్దులను గౌరవించాలి:
మీ స్నేహితుల కోసం మీరు ఉండటం ఎంత ముఖ్యమో వారి ప్రైవసీని గుర్తించి మెలగడం అంతకంటే ముఖ్యం. ప్రతి ఒక్కరికి వారి సొంత పరిమితులు, ప్రాధాన్యతలు ఉంటాయి. వాటిని గౌరవించాలి. వాటిని గుర్తించి నడుచుకోవాలి.
స్నేహం జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. కానీ దానిని పెంపొందించడానికి, నిర్వహించడానికి కృషి మరియు శ్రద్ధ అవసరం. పరిమాణం కంటే నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలి. బహిరంగంగా మరియు నిజాయితీగా కమ్యూనికేట్ చేయడం, ఒకరికొకరు మద్దతు ఇవ్వడం, ఒకరి ప్రైవసీని ఒకరు గౌరవించడం చేయాలి. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోవడం ద్వారా, మీరు మీ స్నేహాన్ని మరింత పదిలంగా ఉంచుకోగలుగుతారు. ఎలాంటి అపార్థాలకు తావు లేకుండా హ్యాపీగా ఉంటారు.



Click it and Unblock the Notifications
