Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
Chanakya Niti: శునకం నుండి మనం నేర్చుకోవాల్సిన గుణాలున్నాయంటున్న చాణక్యుడు..!
శునకాలను చూసి కొన్ని గుణాలు అలవర్చుకోవాలని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. కుక్కలో ఉండే ఆ లక్షణాల వల్ల మనిషి చాలా సంతోషంగా ఉంటాడని.. ప్రశాంతకరమైన జీవితాన్ని గడుపుతాడని వివరించాడు.
ఆచార్య చాణక్యుడు తన జీవిత కాలం అంతా అనేక విషయాలపై పూర్తి అవగాహన పెంచుకున్నాడు. ఒక మనిషి ఎలా ఉంటే సంతోషంగా జీవించగలడే విషయాలను మనకు అందించే ప్రయత్నం చేశాడు. మనుషులు ఎలా ఉండాలి, ఎలా ఉంటే సంతృప్తిగా జీవిస్తారు, ఎలాంటి లక్షణాలు లేకపోతే మనిషి ఎదగగలడు వంటి విషయాల గురించి వివరించాడు.

మనకు తెలిసినంత వరకు చాలా మంది పెద్దలు.. వాళ్లను చూసి నేర్చుకో, వీళ్లని చూసి నేర్చుకో అంటూ హితబోధ చేస్తారు. కానీ ఆచార్య చాణక్యుడు మాత్రం మనుషుల కంటే కూడా పశువులను, పక్షులు, ప్రకృతి, చెట్లు, నదులను చూసి నేర్చుకోమని చెప్పాడు. ఏవైనా కష్టాల్లో కూరుకుపోయినపుడు పశువులు, పక్షుల లాగా అంటే వాటి గుణాలను చూసి మనమూ అలా మారి సమస్యలను తొలగించుకోవాలని వివరించాడు. ముఖ్యంగా శునకాలను చూసి కొన్ని గుణాలు తెచ్చుకోమని చెబుతున్నాడు. కుక్కలో ఉండే ఆ లక్షణాల వల్ల మనిషి చాలా సంతోషంగా ఉంటాడని.. ప్రశాంతకరమైన జీవితాన్ని గడుపుతాడని వివరించాడు. అయితే కుక్కలో ఉన్న ఆ సుగుణాలు ఏంటి, అందులో మనం నేర్చుకోవాల్సిన ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం
దొరికింది తింటూ సంతృప్తి పడాలి..!
ఆచార్య చాణక్యుడు చాణక్య నీతిలో కుక్కలో ఉండే సంతృప్తి భావన మనుషుల్లో కూడా ఉండాలని చెప్పాడు. కుక్కకు బాగా ఆకలి వేసినప్పుడు ఎది లభించినా అది సంతృప్తికరంగా కడుపునిండా తింటుందని.. అలాగే మనిషి కూడా అదే తినాలి, ఇదే తినాలనే ఆలోచనతో కాకుండా.. దొరికినదానితో కడుపు నింపుకోవాలని సూచించాడు. దేనికైనా అత్యాశ ఎక్కువ అయినప్పుడు జీవితంలో అశాంతి కూడా వస్తుందని చెప్పాడు.
అప్రమత్తంగా నిద్రపోవాలి..!
ఆచార్యుడు.. మనుషులు ఎప్పుడూ శునకాల్లాగా నిద్ర పోవాలని చెబుతుంటాడు. కుక్క ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూనే కొంచెం శబ్దం అయినా వెంటనే మేల్కుంటుందని తెలిపారు. అలాగే మనుషులు కూడా కుక్కలా నిద్రపోయి.. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని వివరించారు. ఇలా పడుకోవడం వల్ల ఎప్పుడూ సురక్షితంగా ఉంటారని చెప్పారు.
విశ్వాసపాత్రంగా ఉండాలి..!
కుక్క చాలా నమ్మకమైన జంతువు అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆచార్య చాణక్యుడు కుక్క నుండి మానవులు కూడా అలాగే విశ్వాసపాత్రంగా, విధేయతగా ఉండాలని తెలిపారు. ఒక వ్యక్తి తన జీవితంలో విధేయతతో ఉంటే ప్రతీ పనిలో విజయం సాధిస్తాడని.. ప్రజలు కూడా అతడిలోని నిజాయితీని త్వరగా గుర్తిస్తారని స్పష్టం చేశారు.
ప్రతీ సమస్యను ధైర్యంగా ఎదుర్కోవాలి..!
కుక్క నిర్భయ జంతువు. దానికి కాస్త అన్నం పెట్టిన వారి కోసం అది ఎంతకైనా తెగిస్తుంది. వారి ప్రాణాల మీదకు వస్తే ఎవరితోనైనా పోరాడగలదు. యజమాని భద్రత కోసం, కుక్క నిర్భయంగా ప్రతీ సమస్యతో పోరాడుతుంది. మానవులు కూడా ఇలాంటి సుగుణాలను కుక్కల నుంచి నేర్చుకోవాలని ప్రతీ సమస్యను దృఢంగా ఎదుర్కోవాలని ఆచార్య చాణక్యుడు చాణక్య నీతిలో వివరించారు.



Click it and Unblock the Notifications