Latest Updates
-
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు!
zodiac signs: ఈ రాశుల వారు పని రాక్షాసులట.. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూడండి...!
ఈ రాశుల వారు అత్యంత ఎక్కువగా పని చేస్తారట. ఆ రాశుల జాబితాలో మీ రాశి ఉందేమో చూడండి...!
మనలో చాలా మంది ఏదైనా పని చేయాలంటే దాని నుండి తప్పించుకోవాలని భావిస్తుంటారు. ఇక కష్టమైన పని అయితే ఏదో ఒక కారణం చెప్పి ఎస్కేప్ అవుతూ ఉంటారు. ఎప్పుడెప్పుడు సెలవులు దొరుకుతాయా.. ఎలా టైంపాస్ చేద్దామా.. ఎలా ఎంజాయ్ చేద్దామా అని ఆలోచిస్తుంటారు.

మరికొంతమంది వ్యక్తులు పనిని చాలా మొక్కుబడిగా చేస్తుంటారు. పనిని ఏదో చేయాలంటే చేయాలన్న విధంగా చేస్తుంటారు. కానీ కొందరు వ్యక్తులు అనునిత్యం పనిలో మునిగిపోతుంటారు. కొంచెం ఖాళీ సమయం దొరికినా, ఆ టైంలో ఏ పని చేయాలా అని ఆలోచిస్తుంటారు. ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండరు.

అలాంటి వారిని మనం పని రాక్షసులు అని పిలుస్తూ ఉంటాం. అయితే జ్యోతిష్యశాస్త్రం గ్రహాల ఆధారంగా రాశిచక్రాల ఆధారంగా కొందరు ఎల్లప్పుడూ పని గురించే ఆలోచించేవారట. ఇంతకీ పని రాక్షసులుగా పిలువబడే.. ఆ రాశిచక్రాలేవి.. ఆ రాశుల జాబితాలో మీ రాశి కూడా ఉందేమో చూడండి...

మేష రాశి..
ఈ రాశి వారు చాలా విషయాల్లో బలంగా ఉంటారు. వీరు పని విషయంలో చాలా కచ్చితంగా ఉంటారు. ఎల్లప్పుడూ ఏదో ఒక పని చేయాలని ఆశపడుతూ ఉంటారు. వీరు ఖాళీ సమయాన్ని ఇష్టపడరు. వీరు సెలవు రోజుల్లో కూడా ఏదో ఒక పని చేయాలని కోరుకుంటారు. వీరు టైం పాస్ చేయడాన్ని అస్సలు ఇష్టపడరు. వీరు తమ ఆనందాన్ని కేవలం పని చేయడంలో మాత్రమే చూసుకుంటారు.

మిధున రాశి..
ఈ రాశి వారు చాలా తెలివిగా వ్యవహరిస్తారు. వీరి చుట్టూ ఎవరైనా పని చేస్తుంటే చాలు.. వీరు ఆటోమేటిక్ గా పనిలోకి దిగిపోతారు. వీరు ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి నిద్ర పోయేంత వరకు ఏదో ఒక పని చేయడాన్ని బాగా ఇష్టపడతారు. అంతేకాదు వీరి చుట్టూ ఉండే వారిని కూడా పని చేయడానికి ప్రేరేపిస్తారు. అందరినీ పని చేయమని ప్రోత్సహిస్తారు. ఏ పని అయినా త్వరగా పూర్తవ్వకుండా అస్సలు వదిలిపెట్టరు.

కన్య రాశి..
ఈ రాశి వారు పని విషయంలో చాలా నిజాయితీగా ఉంటారు. కొందరిలాగా వీరు పనిని ఏదో చేయాలంటే చేయరు. చాలా విశ్వాసంతో చేస్తారు. అంతేకాదు ప్రతి పని గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. అందుకే వీరు ఏ పని పూర్తి చేయడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకుంటారు. వీరు కేవలం పని విషయంలో మాత్రమే కాదు.. కుటుంబ సభ్యులకు కూడా బాగా సహాయపడతారు. వీరు ఏదైనా వ్యాపారంలో ఉంటే.. ఆ పనులను కూడా బాగా చేయడానికి ఇష్టపడతారు.

మకర రాశి..
ఈ రాశి వారు అనునిత్యం ఏదో ఒక పని చేయడానికి బాగా ఆసక్తి చూపుతారు. వీరు ఏ పని చేసినా కచ్చితంగా ఫలితం వస్తుందని నమ్ముతారు. అంతేకాదు ప్రతి పనిని ఎంత ఆలస్యమైన పూర్తి చేసేంత వరకు నిద్రపోరు. తమ పనిలో ఏదైనా సమస్యలు ఎదురైనా అస్సలు భయపడరు. చాలా ధైర్యంగా ఆ పనులను ఎలా పూర్తి చేయాలా ఆలోచిస్తూ ఉంటారు. వీరు ఖాళీ సమయంలో కూడా ఏదో ఒక పని చేయాలని కోరుకుంటారు. ముఖ్యంగా సెలవు రోజుల్లో సైతం ఆఫీసుకు వెళ్లి ఏదో ఒక పని చేయడం లేదా ఇంట్లోనే ఆఫీసుకు సంబంధించి ఏదో ఒక పని చేయడం వంటివి చేస్తూ ఉంటారు.
గమనిక : ఇక్కడ ఇవ్వబడిన రాశుల ఫలితాలను ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాలు ఆధారంగా చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫలితాలు అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తున్నాము. మీకు మీ రాశి చక్రం గురించి సంపూర్ణమైన వివరాలు తెలియాలంటే మీరు వ్యక్తిగత జాతక పరిశీలనలో అనుభవం ఉన్నవారిని సంప్రదించి మీ గురించి పూర్తిగా తెలుసుకోగలరు. ఈ రాశి ఫలాలను పూర్తిగా నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం... ఈ రాశి ఫలితాలకు బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు అని పాఠకులు గమనించగలరు.



Click it and Unblock the Notifications