For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ రాశుల పిల్లల నుండి ప్రశాంతత అనేదే ఉండదట...!

ఈ రాశుల వారి తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య అస్సలు సఖ్యత కుదరదట. ఆ జాబితాలో మీ రాశి ఉందేమో చూడండి.

|

ఈ లోకంలో పిల్లలపై ఎలాంటి స్వార్థం లేని ప్రేమ చూపేది ఒక్క తల్లిదండ్రులే అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

List of Worst parent-child zodiac combination in Telugu

మిగిలిన వారంతా మనల్ని ఇష్టపడతారు అంతే కానీ.. మనల్ని మనస్పూర్తిగా ప్రేమిస్తున్నారంటే... దాని వెనుక ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. అయితే పిల్లల నుండి ఏమీ ఆశించకుండా వారు బాగుంటే చాలనుకునేది ఒక్క తల్లిదండ్రులే.

List of Worst parent-child zodiac combination in Telugu

అందుకే తల్లీబిడ్డ బంధం తర్వాతే ఎలాంటి బంధమైనా అని పెద్దలు చెబుతూ ఉంటారు. తమ పిల్లలు తమను వద్దనుకున్నా.. తల్లిదండ్రులు మాత్రం వారిని ప్రేమిస్తూనే ఉంటారు. వారు మంచిగా, సంతోషంగా ఉండాలనే కోరుకుంటారు. వారి నుండి తిరిగి ప్రేమను తప్ప మరేమీ ఆశించరు. అయితే ఇలా అందరూ తల్లిదండ్రులు ఉంటారా అంటే చెప్పడం కొంచెం కష్టమే. అయితే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, కొన్ని రాశుల తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య సంబంధాల్లో నిత్యం గొడవలు వస్తుంటాయట. వారిద్దరి మధ్య ప్రేమానురాగాలు కరువై అనునిత్యం ఏదో ఒక విషయంలో విభేదాలు వస్తాయట. దీంతో కొన్ని రాశుల తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య రిలేషన్ షిప్ లో ప్రశాంతత అనేదే ఉండదట.. ఈ సందర్భంగా ఆ రాశుల వారెవరో చూసెద్దాం పదండి...

Mercury Transit in Libra on 22 September 2021:తుల రాశిలోకి బుధుడి సంచారం.. ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావమంటే...!Mercury Transit in Libra on 22 September 2021:తుల రాశిలోకి బుధుడి సంచారం.. ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావమంటే...!

మేషం-కర్కాకటం..

మేషం-కర్కాకటం..

ఈ రాశుల వారిలో మేష రాశి పిల్లలు, లక్ష్యాలు, ఆశయాల పట్ల అత్యంత ఉత్సాహంగా ఉంటారు. వీరు విజయం సాధించేందుకు, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునేందుకు వచ్చిన ప్రతి ఛాన్స్ ను సద్వినియోగం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు. అయితే కర్కాటక రాశి వారిలో మాత్రం ఇలాంటి ఉత్సాహం అంతగా ఉండదు. కానీ వీరు మంచిగానే ఉంటారు. వీరు పెద్దగా లక్ష్యాల గురించి పట్టించుకోరు. ఈ నేపథ్యంలో ఈ రెండు రాశుల తల్లిదండ్రులు, పిల్లల మధ్య అభిప్రాయాల మధ్య కొన్ని తారతమ్యాలు వచ్చి ఇబ్బందులు పడే అవకాశం ఉంది.

వృషభం-మిధునం..

వృషభం-మిధునం..

ఈ రెండు రాశుల వారు ఒకరికొకరు పూర్తిగా భిన్నమైన వారు. వీరిద్దరిలో మిధున రాశి వారికి కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. వీరు ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉండాలని ఆశిస్తారు. అయితే వృషభ రాశి వారు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటారు. వీరు లోలోపలే అన్ని విషయాలు ఉండాలని కోరుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో తమ మనసులోని బయటపెట్టకూడదని నిర్ణయించుకుంటారు. వీరు ఎవ్వరితోనూ ఎక్కువగా కలవలేరు. అందుకే ఈ రెండు రాశుల తల్లిదండ్రులు, పిల్లల మధ్య అభిప్రాయాలు ఒకటి కాకుండా.. వీరు దూరమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

సింహం-వృశ్చికం

సింహం-వృశ్చికం

ఈ రెండు రాశుల వారికి ఒకరంటే ఒకరికి అస్సలు గిట్టదు. వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం లేకపోవడం వల్ల తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి. అయితే ఈ రెండు రాశుల వారికి పుష్కలంగా లీడర్ షిప్ క్వాలిటీస్ ఉంటాయి. అందుకే వీరు ఒకరి మాటను మరొకరు లెక్కచేయరు. తమకు నచ్చిన విధంగా చేయాలని కోరుకుంటారు. ఇలా ఇద్దరూ ఎల్లప్పుడూ డామినేట్ చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. దీంతో వీరిద్దరి మధ్య రెగ్యులర్ గా అభిప్రాయ భేదాలు వస్తూ ఉంటాయి.

Numerology: బర్త్ డేను బట్టి మీ పర్సనాలిటీ గురించి ఎలా తెలుసుకోవచ్చంటే...!Numerology: బర్త్ డేను బట్టి మీ పర్సనాలిటీ గురించి ఎలా తెలుసుకోవచ్చంటే...!

సింహం-తుల రాశి..

సింహం-తుల రాశి..

ఈ రాశుల వారిలో సింహ రాశి వారు పుట్టినప్పటి నుండి పెరిగి పెద్దయ్యే వరకు అందరినీ ఆకర్షించాలని ఆశపడుతూ ఉంటారు. అందరూ తమను ప్రత్యేకంగా గుర్తించాలని.. తమకు సమాజంలో ప్రత్యేక గౌరవం ఇవ్వాలని కోరుకుంటారు. అయితే వీరు ఎక్కువ మందితో ఫ్రెండ్ షిప్ చేయాలని మాత్రం కోరుకోరు. కానీ తాము చేస్తున్న పనిని మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తించాలని.. తమను ప్రశంసించాలని ఆశపడుతూ ఉంటాయి. కానీ కుంభ రాశి వారు మాత్రం పూర్తి భిన్నంగా ఉంటారు. వీరు అంత సులభంగా ఎవ్వరితోనూ కలవడానికి ఇష్టపడరు. వీరు ఇతరుల నిర్ణయాలను ఎక్కువగా పట్టించుకోరు. దీంతో ఈ రెండు రాశుల మధ్య రిలేషన్.. ముఖ్యంగా తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఎప్పటికీ సఖ్యత కుదరదు.

కన్య-తుల..

కన్య-తుల..

ఈ రాశుల వారిలో తుల రాశి వారు చాలా సమతుల్యంగా ప్రవర్తిస్తారు. వీరు తమ సెక్యూరిటీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. వీరు వీరి చుట్టూ పక్కల ఉండేవారిని.. ముఖ్యంగా కుటుంబ సభ్యులందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. అయితే కన్యరాశి వారు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తారు. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చేస్తాయి. అందుకే వీరిద్దరూ ఒకరంటే ఒకరికి ద్వేషం పెంచుకుంటారు.

ధనస్సు-మకరం..

ధనస్సు-మకరం..

ఈ రాశుల వారిలో ఒకరు ఎడ్డెం.. మరొకరు తెడ్డెం అంటారు. అంటే వీరిద్దరిలో ఏ ఒక్కరూ పాజిటివ్ గా ఆలోచించినా.. మరొకరు పూర్తి నెగిటివ్ గా ఆలోచిస్తారు. దీంతో వీరిద్దరూ రియల్ లైఫ్ లో ఎక్కువగా గొడవ పడటం జరుగుతూ ఉంటాయి. వీరిద్దరూ ఎక్కువ కాలం కలిసి జీవించడానికి ఇష్టపడరు. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య తరచుగా ఘర్షణ జరుగుతూ ఉంటుంది.

ధనస్సు-మీనం..

ధనస్సు-మీనం..

ఈ రాశులు వాస్తవ జీవితం కంటే.. ఎక్కువగా ఊహల్లో జీవిస్తూ ఉంటారు. అయితే ఈ రెండు రాశుల వారిలో దనస్సు రాశి వారు తమ ఊహలను నిజం చేసుకోవాలని ఆరాట పడుతూ ఉంటారు. వాటిని ఆచరణలో సైతం పెట్టాలని ఆశపడతారు. అయితే మీన రాశి వారు మాత్రం వారి ఊహలను నిజం చేసుకునేందుకు భయపడతారు. ఇలా వీరిద్దరి ఆలోచనలు భిన్నంగా ఉండటం వల్ల పరిస్థితులు ప్రతికూలంగా మారతాయి.

English summary

List of Worst parent-child zodiac combination in Telugu

Here are the list of worst parent-child zodiac combination in Telugu. Have a look
Story first published:Thursday, September 23, 2021, 12:14 [IST]
Desktop Bottom Promotion