Latest Updates
-
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..
ఆ రాశుల వారు కొత్త సంవత్సరంలో తమ జీవిత భాగస్వామిని కలుసుకోబోతున్నారు
2023 కొత్త సంవత్సరంలో ఏయే రాశుల వారు పెళ్లి చేసుకోబోతున్నారు, ఎవరికి గురుబలం ఉంది, ఏయే రాశుల వారికి ఎప్పుడు పెళ్లయ్యే అవకాశం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎవరిని పెళ్లి చేసుకుంటాం, ఎప్పుడు చేసుకుంటాం అనేది విధి. దానినే జ్యోతిష్య శాస్త్రంలో యోగం అంటారు. వివాహ యోగం కలిసి వచ్చినప్పుడే వివాహం జరుగుతుంది. పెళ్లికి బలం ఉంటేనే జరుగుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా బలం వచ్చేంత వరకు ఆగాల్సిందేనని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. వివాహం జరగడానికి గురుబలం ఉండాలి. గురుబలం లేకపోతే ఏదో ఒక కారణంతో పెళ్లి జరగదు.

కొందరు ప్రేమలో ఉన్నా పెళ్లికి మాత్రం అడుగు ముందుకు పడదు. కొంతమంది సంబంధాలు చూస్తూనే ఉంటారు. వారికి వీరు నచ్చకపోవడం, వీరికి వారు నచ్చకపోవడం, ఇద్దరికీ నచ్చినా ఏదో ఒక సమస్య రావడంతో పెళ్లి జరగదు.
2023 కొత్త సంవత్సరంలో ఏయే రాశుల వారు పెళ్లి చేసుకోబోతున్నారు, ఎవరికి గురుబలం ఉంది, ఏయే రాశుల వారికి ఎప్పుడు పెళ్లయ్యే అవకాశం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

వృషభం
వృషభ రాశి వారికి 2023 సంవత్సరం అద్భుతంగా ఉండనుంది. ప్రేమ జీవితాన్ని ఆస్వాదించనున్నారు. ఫిబ్రవరి 15, 2023న శుక్రుడు మీనరాశిలోకి వెళ్లి బృహస్పతిని కలవనున్నాడు. ఇది ప్రేమ జీవితంలో ఆనందాన్ని తెస్తుంది. మీరు ఒంటరిగా ఉన్నట్లయితే, మీరు ఒకరి పట్ల ఆకర్షితులై వారితో స్నేహాన్ని ప్రారంభించే మంచి అవకాశం ఉంది.
ట
ఏప్రిల్ 22, 2023 వరకు దేవ బృహస్పతి వృషభ రాశి జాతకంలో ఉండనున్నాడు. బృహస్పతి యొక్క శుభ ప్రభావం కారణంగా వృషభరాశి వారికి వివాహం జరగనుంది.

సింహ రాశి
సింహ రాశి వారికి 2023 సంవత్సరం చాలా మెరుగ్గా ఉండనుంది. 22 ఏప్రిల్ 2023 నాడు బృహస్పతి తొమ్మిదవ ఇంటి నుండి సంచరించనున్నాడు. ఇప్పటికే తొమ్మిదవ ఇంట్లో ఉన్న సూర్యుడితో కలయిక ద్వారా అద్భుతమైన యోగం ఏర్పడనుంది. సింహ రాశి వారు 2023 సంవత్సరంలో పెళ్లి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి 2023 ఏడాది బేషుగ్గా ఉండనుంది. 22 ఏప్రిల్ 2023 నాడు బృహస్పతి ఐదో ఇంట్లో అంటే ప్రేమ గృహంలో వస్తున్నందున వృశ్చిక రాశి వారికి కలిసి వస్తుంది. ప్రేమ విషయంలో ప్రయోజనకరంగా ఉంటుంది.
వృశ్చిక రాశి వారు ఇప్పటికే ప్రేమలో ఉంటే ఇంట్లో వారిని ఒప్పించి పెళ్లి చేసుకుంటారు. ధైర్యంగా ప్రేమ విషయం ఇంట్లో చెప్పండి గ్రహ పరిస్థితులు అన్నీ సానుకూలంగా ఉన్న దృష్ట్యా పెద్దగా అడ్డుచెప్పకుండానే పెళ్లికి ఒప్పుకునే అవకాశం ఉంది. పెళ్లి కోసం చూస్తున్నవారికి అతి త్వరలో సంబంధం ఖాయం కానుంది.

తులారాశి
కొత్త సంవత్సరం తులారాశి వారు ప్రేమలో ఓలలాడనున్నారు. కొంత ఇగో ప్రాబ్లమ్ ఉన్నప్పటికీ చిన్న చిన్న చిట్కాలతో బయటపడవచ్చు. సంబంధాలు ఖాయం అవుతాయి. పెళ్లి చేసుకోనున్నారు. అమ్మాయైనా, అబ్బయైనా 2023లో తులారాశి వారికి మంచి సంబంధంతో పెళ్లి జరగనుంది.

కర్కాటక రాశి
2023 సంవత్సరం కర్కాటక రాశి వారికి చాలా అనుకూలంగా ఉండనుంది. బృహస్పతి ఇంట్లో శుభ గృహంలో ఉండటం గురుబలం కలిసి రానుంది. గురుబలం ఉన్న వ్యక్తులకు పెళ్లి త్వరగా జరుగుతుంది. ప్రేమికులైనా, కాకపోయినా పెళ్లి జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

కుంభరాశి
వివాహ యోగం పరంగా 2023 సంవత్సరం కుంభరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. గురుబలం ఎక్కువగా ఉన్నందున వివాహం జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వివాహం జరిగితీరుతుంది. వివాహానికి సిద్ధంగా ఉన్న కుంభరాశి వారికి 2023 ఏడాదిలో పెళ్లి జరుగుతుంది.



Click it and Unblock the Notifications