For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2020లో ఓ రాశి వారికి రెండు లక్కీ డేస్... మిగిలిన రాశులకు అదృష్ట రోజు ఎప్పుడంటే...

ఈ రాశి వారికి మార్చి నెల 8వ తేదీన అద్భుతమైన రోజుగా ఉంటుంది. వృషభ రాశిలోని శుక్రుడు యురేనస్ ను కలిసినప్పుడు మీకు ప్రయోజనాలు లభిస్తాయి.

|

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం 2020 సంవత్సరంలో అన్ని రాశుల వారికి మంచిగా ఉన్నట్లు కనబడుతోంది. అయితే ద్వాదశ రాశుల వారిలో ఓ రాశి వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉన్నట్లు నక్షత్రాల ప్రభావం బట్టి తెలుస్తోంది. గురు గ్రహం ఆ రాశిలోకి ప్రవేశించిన సమయంలో వారికి అద్భుతమైన ఘడియలు ప్రారంభమవుతాయి.

Luckiest Day In 2020

ఇది ఈ సంవత్సరమంతా సాగుతుంది. అంతేకాదు కొంత కాలం వారికి ఆ గ్రహం ఈ రాశి నుండి అస్సలు తిరిగి రాదని తెలుస్తోంది. దీని వల్ల ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న సమస్యల నుండి ఒక్కసారిగా విముక్తి లభించే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాదు ఈ సంవత్సరంలో వేగంగా అభివృద్ధి చెందే అవకాశం కూడా ఉంది. కొన్ని సమయాల్లో ప్రతికూల సంకేతాలు ఎదురైనప్పటికీ వాటన్నింటిని అధిగమిస్తారు. అలాగే ఆరోగ్య పరంగా కూడా అద్భుతంగా ఉంటుంది. ఇంతకీ ఆ రాశి చక్రం ఏదో తెలుసుకోవడానికి.. అలాగే మిగిలిన రాశి చక్రాల వారికి ఈ సంవత్సరంలో ఏ రోజు లక్కీగా ఉంటుందో తెలుసుకోవడానికి ఈ స్టోరీని పూర్తిగా చూడండి...

ఫిబ్రవరి నెలలో ఈ రాశుల వారికి అత్యంత అనుకూలమట...!ఫిబ్రవరి నెలలో ఈ రాశుల వారికి అత్యంత అనుకూలమట...!

మేష రాశి..

మేష రాశి..

ఈ రాశి వారికి అక్టోబర్ నెలలో మొదటి రోజు చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ రోజున ప్రేమ మరియు స్నేహం వంటి కొత్త అవకాశాలు మీకు ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయి. మీరు ఎక్కువగా కొత్త వాటిపై శ్రద్ధ పెడతారు. అక్టోబర్ 1వ తేదీ లాంటి రోజు మీకు మరొకటి ఉండదు.

వృషభ రాశి..

వృషభ రాశి..

ఈ రాశి వారికి మార్చి నెల 8వ తేదీన అద్భుతమైన రోజుగా ఉంటుంది. వృషభ రాశిలోని శుక్రుడు యురేనస్ ను కలిసినప్పుడు మీకు ప్రయోజనాలు లభిస్తాయి. అప్పటి నుండి కొత్త అనుభవాల కోసం కొత్త ప్రయాణాలు చేస్తారు. అందమైన ప్రదేశాలను చూస్తారు. శుక్రుడు మీ రాశి గ్రహంపై ఆర్థిక పరంగా.. పని విషయాల్లో నియంత్రణ ఉండేలా చేస్తుంది.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి వారికి ఆగస్టు 7వ తేదీన అద్భుతంగా ఉంటుంది. అప్పటి నుండి ఆర్థిక పరంగా మీరు ఎక్కువ పట్టు సాధించే అవకాశం ఉంది. పని విషయంలో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోజు నుండి మీ మనసు చాలా ఉత్సాహంగా మారుతుంది.

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి వారు ఈ సంవత్సరంలో లక్కీ కోసం చివరి నెల వరకు వేచి చూడాల్సిందే. ఎందుకంటే డిసెంబర్ 14వ తేదీన మీకు అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో మీకు సంబంధాల విషయంలో చాలా కలిసి వస్తుంది. శుక్రుడు, గురు గ్రహాల ప్రభావం వల్ల మిగిలిన పరిస్థితుల్లో మిశ్రమంగా ఉంటాయి. ఆరోగ్య పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి వారు ఈ ఏడాదిలో ప్రేమ వంటి విషయాల్లో అనుకూల సమయం కోసం ఎదురు చూస్తుంటే మీరు చాలా కాలం వేచి చూడాల్సిందే. ఎందుకంటే సెప్టెంబర్ 6వ తేదీన మీకు అద్భుతంగా ఉంటుంది. ఆరోజు మీకు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ సమయంలో చాలా మంది సహజంగా మీ వైపు ఆకర్షితులవుతారు. కాబట్టి మీరు ఆరోజు ఎవరితో అయినా కలిసేందుకు షెడ్యూల్ వంటివి ప్రిపేర్ చేసుకోవచ్చు.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి వారికి ఆగస్టు 25వ తేదీన లక్కీ డేగా వస్తుంది. ఈ సమయంలో మీరు ఏదైనా ప్రాజెక్టులను దక్కించుకోవడం వంటి వార్తలను వింటారు. ఉద్యోగస్తులు అయితే ప్రమోషన్లు, వేతనాల పెరుగుదల లాంటి శుభవార్తలను వింటారు.

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి వారికి 2020 సంవత్సరంలో ఫిబ్రవరి 7వ తేదీన చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రేమ మరియు సంబంధాల విషయంలో ఈ నెల చాలా మంచిగా ఉంటుంది. ముఖ్యంగా వాలెంటైన్స్ మంత్ గా పిలుచుకునే ఈ నెలలో మీకు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ప్రేమ విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా కూడా అద్భుతంగా ఉంటుంది.

<strong>2020లో మీ రాశికి సరైన జోడి ఎవరో తెలుసుకోండి...!</strong>2020లో మీ రాశికి సరైన జోడి ఎవరో తెలుసుకోండి...!

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ రాశి వారు ఈ సంవత్సరంలో లక్కీ డే కావాలంటే కొంత కాలం ఎదురుచూడాల్సిందే. మీకు ఈ సంవత్సరం అక్టోబర్ 3వ తేదీన అద్భుతంగా ఉంటుంది. ఈ సమయం నుండి ప్రేమ వంటి విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ సమయంలో మీ మనసుకు సంబంధించిన వారిని ఆకర్షించే అవకాశాలు వస్తాయి.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి వారు తమకు అద్భుతమైన రోజు కావాలంటే ఈ ఏడాది చివరి వరకు ఆగాల్సిందే. ఎందుకంటే వీరికి డిసెంబర్ 15వ తేదీన అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో ప్రేమ మరియు సంబంధాల విషయంలో కొత్తగా ఉంటుంది. మీరు ఇది వరకే ఎవరితో అయినా రిలేషన్ షిప్ లో ఉంటే మీ బంధాన్ని మరింత బలంగా మార్చుకోవాలి అనిపిస్తుంది. వ్యాపార అవకాశాలు కూడా మెరుగుపడతాయి.

మకర రాశి..

మకర రాశి..

అన్ని రాశుల వారికి ఈ ఏడాది ఒక్కరోజే అద్భుతంగా ఉంటే.. ఈ రాశి వారికి మాత్రం ఈ సంవత్సరం రెండు సార్లు లక్కీ డే అవకాశాలు కలసి వస్తున్నాయి. ఈ రాశి వారికి కొత్త సంవత్సరం అంతా అద్భుతంగా ఉంటుంది. మీరు కొత్త శక్తిని పొందుతారు. మీకు ఫిబ్రవరి 20వ తేదీ మరియు మార్చి 28వ తేదీ లక్కీ డేలుగా ఉంటాయి. ఫిబ్రవరి 20వ తేదీన శని, గురు, ఫ్లూటో, బుధుడు, చంద్ర గ్రహాలు మీకు అనుకూల సంకేతంలో ఉంటారు. దీని వల్ల మీకు మంచి అనుభూతి కలుగుతుంది. ఇక మార్చి 28నాడు ప్రేమ లేదా పెళ్లి వంటి విషయాలకు సరైన రోజు అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి వారికి మార్చి 31వ తేదీన లక్కీ అదృష్టం కలసి వస్తుంది. ఈ రోజున మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించడానిక లేదా వ్యాపారాన్ని ప్రారంభించడానిని అద్భుతమైన రోజు అవుతుంది. అంతే కాదు మంచి ఫలితాలు కూడా వస్తాయి.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి వారు కూడా ఈ సంవత్సరంలో అదృష్టం కావాలంటే చివరి నెల వరకు ఆగాల్సిందే. ఎందుకంటే మీకు డిసెంబర్ 5వ తేదీన అదృష్టం కలిసి రానుంది. ఆ సమయంలో మీ సామర్థ్యం పెరుగుతుంది. మీకే తెలియకుండా అప్పటి నుండి అన్ని విషయాల్లో సౌకర్యాన్ని పొందుతారు. ఇలాంటివి మీ జీవితంలో మరింత ప్రేమను తీసుకురావడానికి సహాయపడుతుంది.

చూశారు కదా.. మీ అదృష్ట రోజును గుర్తుంచుకోండి. ఆ సమయం వచ్చినప్పుడు మీకు కావాల్సిన ప్రయోజనాలను పొందాలని నిర్ధారణకు వచ్చేయండి..

English summary

Luckiest Day In 2020 For Each Zodiac Sign

Here is the Luckiest Day In 2020 For Each Zodiac Sign. Take a look
Story first published:Wednesday, February 5, 2020, 12:28 [IST]
Desktop Bottom Promotion