Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
February 2022:ఈ నెలలో ఈ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందట...! ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూడండి...
ఫిబ్రవరిలో లక్కీ మరియు అన్ లక్కీ రాశిచక్రాలేవి. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసెయ్యండి.
2022 సంవత్సరంలో అప్పుడే మొదటి నెల ముగిసింది. రెండో నెల ఫిబ్రవరి కూడా ప్రారంభమైంది. ఈ నెలను ప్రేమికుల మాసంగా పిలుస్తారు. ఇదిలా ఉండగా జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఫిబ్రవరి నెలలో నక్షత్రాలు, గ్రహాల కదలిక వల్ల కూడా ఈ మాసం ప్రత్యేకంగా ఉంటుంది. ఈ నెలలో తొలిరోజే అమావాస్య వచ్చింది. ఇదే సమయంలో సూర్యుడు కుంభరాశిలోకి సంచారం చేశాడు.

ఈ సమయంలో కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు వస్తాయి. అలాగే బుధుడి తిరోగమనం ఫిబ్రవరి మూడో తేదీన ముగుస్తుంది. అంతేకాదు ఫిబ్రవరి 11వ తేదీన బుధుడు మళ్లీ ఫ్లూటోలోకి సంచారం చేయనున్నాడు. ఫిబ్రవరి 16వ తేదీన శుక్రుడు, అంగారకుడు కలిసి సంచారం చేయనున్నారు.

ఈ సమయంలో మీరు కొన్ని తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు కాస్త ఓపికతో ఉండి.. ఎక్కువ కష్టపడి పని చేస్తే, కాలక్రమేణా ప్రతిదీ సరిగ్గా జరుగుతుంది. గ్రహాల కదలికల కారణంగా, కొన్ని రాశిచక్రాల వారికి మంచి అవకాశాలు మరియు విజయాలు దక్కుతాయి. అదే సమయంలో మరికొన్ని రాశిచక్రాల వారు అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా ఫిబ్రవరి నెలలో కొన్ని రాశులకు అదృష్టం.. మరి కొన్ని రాశుల వారికి దురదృష్టకరంగా ఉంటుంది. ఇంతకీ ఏ రాశుల వారికి అదృష్టంగా ఉంటుంది.. ఏ రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
ఈ రాశి వారికి ఈ నెలలో చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగులు వారి శ్రమ కారణంగా కార్యాలయంలో మంచి గౌరవాన్ని పొందుతారు. మీ యజమానితో కూడా సంబంధం గొప్పగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలలో నిమగ్నమైన వారికి, ఈ మాసం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు పదోన్నతులు లేదా ఇంక్రిమెంట్లను కూడా పొందొచ్చు.

వృషభ రాశి..
ఈ రాశి వారు ఈ నెలలో ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఈ మాసంలో మీకు కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి. మీరు చేసే పనులకు సంబంధించి ఈ కాలంలో అందరి మద్దతు పొందుతారు. ఉద్యోగులు తమ కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. వ్యాపారులు భాగస్వామ్యంతో పని చేస్తే మంచి లాభాలొస్తాయి. ఈ నెలలో మీరు అకస్మాత్తుగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల మీరు ఎక్కువగా సంపాదించడానికి అవకాశం లభిస్తుంది.

కర్కాటక రాశి..
ఈ రాశి వారికి ఈ నెలలో ప్రతికూల ఫలితాలు రావొచ్చు. ఇవి మీ జీవితంపై తీవ్ర ప్రభావం చూపొచ్చు. ఈ కారణంగా మీపై ఒత్తిడి పెరుగుతుంది. అయితే ఇది శాశ్వతంగా ఉండదని మీరు గ్రహించాలి. ఈ కాలంలో మీరు కొన్ని విషయాలను పెద్దగా పట్టించుకోకూడదు. ప్రతికూల పరిస్థితులను మీరు అంగీకరించాల్సి ఉంటుంది. మీ జీవితానికి సంబంధించిన విషయాల్లో చాలా బాధ్యతగా ఉండాలి.

సింహ రాశి..
ఈ రాశి వారు చాలా భిన్నమైన దృక్పథాన్ని కలిగి ఉంటారు. మీరు మీ భాగస్వామి నుండి కూడా దూరంగా ఉండొచ్చు. ఆరోగ్యకరమైన సంబంధం ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోవాలి. అందుకు తగ్గట్టు మీరు పాల్గొనాలి. మీరు సంబంధానికి అర్హమైన గౌరవం మరియు నమ్మకం కోసం చూడొచ్చు.

వృశ్చికరాశి..
ఈ రాశి వారు ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు మీ ప్రవర్తన సరిగ్గా ఉండాలి. అయితే మీరు ప్రపంచాన్ని మార్చాలనే ఉద్దేశ్యంతో ఉంటే చాలా ఓపెన్ మైండేడ్ గా ఉండాలి. మీరు సరళంగా మరియు కొత్త ఆలోచనలను గ్రహించడంలో చాలా సామర్థ్యం కలిగి ఉన్నారు. మీరు మీ పాత నమ్మకాలలో కొన్నింటిని విడిచిపెట్టాలి. మీరు కెరీర్ పరంగా స్థిరమైన దశలో ఉన్నారనే విషయాన్ని మీరు గ్రహించాలి. దీంతో మీరు ప్రపంచాన్ని జయించేందుకు సహాయపడుతుంది.

ధనస్సు రాశి..
ఈ రాశి వారు ఈ నెలలో ఏ రంగంలో అయినా పెద్ద విజయం సాధిస్తారు. ఈ మాసంలో మీకు చాలా విషయాల్లో అదృష్టం యొక్క మద్దతు బలంగా ఉంటుంది. మీ తెలివితేటలు మరియు నైపుణ్యాల వల్ల డబ్బు సంపాదించగలుగుతారు. వ్యాపారులు, ఉద్యోగులు ఇద్దరూ ఈ సమయంలో పురోగమిస్తారు. ఉద్యోగులకు కార్యాలయంలో సీనియర్లతో మంచి సంబంధాలు ఉంటాయి.



Click it and Unblock the Notifications