Latest Updates
-
అమ్మమ్మల నాటి చిట్కా..గ్యాస్, ఎసిడిటి,అజీర్తి సమస్యలకు చెక్! -
కృష్ణాష్టమి ఉపవాసం ఉంటున్నారా? అయితే నీరసం రానివ్వని ఈ సగ్గుబియ్యం వడలు ట్రై చేయండి! -
పెళ్లిళ్లు, పండుగల్లో అమ్మాయిలూ జాగ్రత్త.. మెహందీ పెట్టుకుంటే పొట్ట ఇన్ఫెక్షన్ల ప్రమాదం.! -
ఉప్మా తినడం ఇష్టం లేని వారికి రవ్వతో ఇలా చేసి పెట్టండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.! -
జన్మాష్టమి రోజు ద్వాపర యుగం నాటి అరుదైన సంఘటన.. ఈ ఐదు రాశుల వారిపై కృష్ణయ్య కటాక్షం.! -
వంట చేసే ఓపిక లేదా? కేవలం 10 నిమిషాల్లో ఈ పచ్చిమిర్చి నువ్వుల రైస్ చేసి చూడండి, టేస్ట్ అదుర్స్! -
కుజ-గురు కలయికతో ద్విద్వాదశ యోగం..ఈ 4 రాశులకు అడుగడుగునా అదృష్టమే! -
దక్షిణ భారతదేశంలో అతిపెద్ద జిల్లా ఏదో తెలుసా?.. 90% మంది తప్పుగానే చెప్తారు! -
Jeera Biscuits Recipe:హెల్తీ, టేస్టీ జీరా బిస్కెట్స్..బేకరీని మించిన రుచితో ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
బ్రకోలీ, బాదంతో సూపర్ హెల్తీ పాస్తా..రుచి చూస్తే వదిలిపెట్టరు!
మార్చి 31 వరకు ఈ 4 రాశుల వారికి అదృష్టం వరిస్తుందట...!
ఈ రాశుల వారికి 2022లో మార్చి 31 వరకు అద్భుత ఫలితాలు రానున్నాయట. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూడండి.
మరో వారం రోజుల్లో మార్చి నెల ముగుస్తోంది. 2022 సంవత్సరంలో ఏప్రిల్ మాసంలోకి అడుగు పెట్టబోతున్నాం. తెలుగు క్యాలెండర్ ప్రకారం ఛైత్ర మాసం అంటే ఏప్రిల్ లో ఉగాది నుండి నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది.

ఇదిలా ఉండగా.. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, రాబోయే రోజుల్లో అంటే మార్చి చివరి వరకు ద్వాదశ రాశుల్లోని నాలుగు రాశుల వారికి అదృష్టం రానుంది. ఆదాయ పరంగా అద్భుత ఫలితాలు వస్తాయి.

గ్రహాల స్థానాల్లో మార్పులు రావడం వల్ల ఈ సమయంలో ఊహించిన విధంగా లాభాలను పొందుతారు. ఈ సందర్భంగా ఏయే రాశుల వారికి రాబోయే వారం రోజుల్లో అదృష్టం లభించనుందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, రాబోయే వారం రోజుల్లో మేష రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగులకు కార్యాలయంలో సహోద్యోగుల నుండి, ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. మరోవైపు వ్యాపారులకు కూడా ఊహించిన విధంగా లాభాలొస్తాయి. ఇప్పటిదాకా మీరు ఏదైనా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటే, వాటి నుండి ఉపశమనం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు చేసే ప్రతి పనిలోనూ కచ్చితంగా విజయం సాధిస్తారు. మీ వైవాహిక జీవితంలో అంతా సంతోషంగా ఉంటుంది.

మిథున రాశి..
ఈ రాశి వారికి రాబోయే వారం రోజుల్లో ఆర్థిక పరంగా అద్భుతంగా ఉంటుంది. మీరు ఈ కాలంలో తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలను పొందుతారు. ఏ పని పూర్తి చేయడంలో అయినా కష్టం అనేదే ఉండదు. వ్యాపారులకు ఈ సమయం లావాదేవీలకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలొస్తాయి. ఉద్యోగులకు, వ్యాపారులకు పురోగతి అవకాశాలు ఉన్నాయి. కార్యాలయంలో మీకు గౌరవం పెరుగుతుంది.

కన్య రాశి..
ఈ రాశి వారు ఈ వారం రోజుల్లో ఆర్థిక సమస్యల నుండి బయటపెడతారు. ఉద్యోగులు, వ్యాపారులకు ఈ సమయం అనుకూలంగా ఉంది. మీ వైవాహిక జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. మీరు స్నేహితుల మద్దతు పొందుతారు. మీరు చేసిన పనులకు ప్రశంసలు పొందుతారు.

మీన రాశి..
ఈ రాశి వారు రాబోయే వారం రోజుల్లో చాలా విషయాల్లో అదృష్టం పొందడం ఖాయం. వ్యాపారులకు ఊహించిన విధంగా లాభాలొస్తాయి. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీ కీర్తి, ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి రాబడి వస్తుంది.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, రాబోయే రోజుల్లో అంటే మార్చి చివరి వరకు ద్వాదశ రాశుల్లోని నాలుగు రాశుల వారికి అదృష్టం రానుంది. ఆదాయ పరంగా అద్భుత ఫలితాలు వస్తాయి. గ్రహాల స్థానాల్లో మార్పులు రావడం వల్ల ఈ సమయంలో ఊహించిన విధంగా లాభాలను పొందుతారు. ఆ రాశులేవంటే మేష రాశి, మిధున రాశి, కన్య రాశి, మీన రాశి



Click it and Unblock the Notifications