Just In
- 56 min ago
రాత్రిపూట సాక్స్‌లో ఉల్లిపాయను పెట్టుకుని పడుకోవడం వల్ల ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో తెలుసా?
- 1 hr ago
మిమ్మల్ని అవసరానికి వాడుకుంటున్నారని మీకు డౌటా? ఇలా గుర్తించొచ్చు!
- 1 hr ago
మీకు పీరియడ్స్.. సమస్యను మీ బాబుకు చెప్పడం ఎలా?
- 2 hrs ago
ఎడమచేతి వాటం ఉన్నవారు చాలా తెలివైన వారని మీకు తెలుసా? మీకు తెలియని ఎన్నో రహస్య విషయాలు ఇక్కడ ఉన్నాయి!
Don't Miss
- News
సోనియాగాంధీని కలిసిన తర్వాత ''టీక్ హై.. .ముజే కహనా హోగా.. అంటారు??
- Finance
Damani Vs Ambani: పోరులోకి దమానీ, అంబానీ.. ఆ రంగంపై పట్టుకోసం ప్రయత్నాలు..
- Technology
8 యూట్యూబ్ ఛానెల్‌లను బ్యాన్ చేసిన భారత ప్రభుత్వం!! కారణం ఏమిటో...
- Travel
పచ్చని కునూర్‌లో.. పసందైన ప్రయాణం చేద్దామా?!
- Automobiles
చెన్నై రోడ్లపై టెస్టింగ్ చేస్తూ కనిపించిన హ్యుందాయ్ ఐయానిక్ 5, భారత్‌లో విడుదలకు సిద్ధమైనట్లేనా?
- Sports
IND vs ZIM: రాహుల్ త్రిపాఠిది టూరిస్ట్ వీసానా?.. రుతురాజ్ లేడు మ్యాచ్ చూడమ్! ఫ్యాన్స్ ఫైర్!
- Movies
Godfather Teaser రాబోయేది అప్పుడే.. ఈసారి మరో స్పెషల్ సర్ప్రైజ్
Lunar Eclipse May 2022 Astrology :ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం వేళ ఈ రాశులకు చాలా కష్టాలు...!
2022 సంవత్సరంలో ఏప్రిల్ చివర్లో తొలి సూర్యగ్రహణం ప్రపంచవ్యాప్తంగా కనిపించింది. ఇప్పుడు చంద్ర గ్రహణం సమయం వచ్చేసింది.
అతి త్వరలో చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఇదే ఏడాదిలో మే నెలలో 16వ తేదీన అంటే సోమవారం నాడు తొలి చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఇదిలా ఉండగా జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహణాల సమయంలో శుభకార్యాలు నిషేధించబడ్డాయి.
అదే సమయంలో గ్రహణం వల్ల ప్రతి ఒక్కరి సాధారణ జీవితం ప్రభావితమవుతుందని చాలా మంది నమ్ముతారు. ఈ నేపథ్యంలోనే చంద్ర గ్రహణ ప్రభావం ద్వాదశ రాశులపై కచ్చితంగా పడుతుంది. ఈ సందర్భంగా చంద్ర గ్రహణ ప్రభావం వల్ల ఏయే రాశులకు సానుకూల ఫలితాలు రానున్నాయి.. ఏయే రాశులకు ప్రతికూల ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...
మీ
పర్సులో
ఇవి
కచ్చితంగా
ఉండేలా
చూసుకోండి...
ఎందుకంటే
ఆర్థిక
సమస్యలను
అధిగమించొచ్చు...!

మేష రాశి..
ఈ రాశి వారు చంద్ర గ్రహణం సమయంలో ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు రుణాలు తీసుకోవడం వాయిదా వేసుకోవాలి. మీ తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మీరు చేసే పని పట్ల ఉత్సాహం చూపడం మంచిది.

వృషభ రాశి..
చంద్ర గ్రహణం సమయంలో ఈ రాశి వారికి కొంత గందరగోళంగా ఉండొచ్చు. ఈ కారణంగా మీరు సరైన నిర్ణయం తీసుకోలేరు. మీ మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం ద్వారా ఒత్తిడిని అధిగమించేందుకు ప్రయత్నించండి. సానుకూల ఫలితాల కోసం యోగా, ధ్యానం వంటివి చేయాలి.

మిధున రాశి..
చంద్ర గ్రహణం వేళ ఈ రాశి వారు కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు. మీరు ఆదాయానికి సంబంధించిన కొన్ని శుభవార్తలను వినొచ్చు. మీరు కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. మీరు వాహనాన్ని జాగ్రత్తగా నడపాలి.
ఇతర
రాశి
స్త్రీల
కంటే
ఈ
5
రాశుల
స్త్రీలతో
పురుషులు
ఎక్కువగా
ప్రేమలో
పడతారు..
ఎందుకో
తెలుసా?

కర్కాటక రాశి..
ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. మీ ఆదాయం కంటే ఎక్కువ ఖర్చులు కావడం బడ్జెట్ బ్యాలెన్స్ తప్పుతుంది. దీంతో మీపై ఒత్తిడి పెరుగుతుంది. వివాహితులకు పిల్లల ఆరోగ్యం కూడా ఇబ్బంది పెట్టొచ్చు.

సింహ రాశి..
ఈ రాశి వారికి ఆర్థిక పరంగా కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఈ కారణంగా మీరు ఒత్తిడికి లోనవుతారు. మీ వైవాహిక జీవితంలో పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. మీరు చాలా వివాదాలకు దూరంగా ఉండాలి. మీ మానసిక ఆరోగ్యం కోసం ఒత్తిడికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి.

కన్య రాశి..
చంద్ర గ్రహణం సమయంలో ఈ రాశి వారికి ఏదో తెలియని భయం మనసులో నాటుకుపోతుంది. ఇలాంటి సమయంలో మీరు శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మరోవైపు ఉద్యోగులు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.
Chandra
Grahan
2022:ఈ
ఏడాది
సంపూర్ణ
చంద్ర
గ్రహణం
ఎప్పుడు?
ఎక్కడ
కనిపిస్తుంది?

తుల రాశి..
చంద్ర గ్రహణం సమయంలో చాలా ప్రశాంతంగా ఉండాలి. ఎంత పెద్ద సమస్య వచ్చినా దాన్ని ప్రశాంతమైన మనసుతో అధ్యయనం చేయాలి. ఆర్థిక పరమైన లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబంలో తోబుట్టువులతో విభేదాలు రావొచ్చు. మీరు ఓపికతో పరిస్థితిని పరిష్కరించుకోవాలి.

వృశ్చిక రాశి..
ఈ రాశి వారు చంద్ర గ్రహణం సమయంలో ఏదైనా ఖర్చులు చేసేటట్లయితే ముందుగానే ప్రణాళిక వేసుకోవాలి. మీ మనసులో ప్రతికూల ఆలోచనలు రావొచ్చు. మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీ వైవాహిక సంబంధంలో ఒడిదుడుకులు ఉండొచ్చు.

ధనస్సు రాశి..
ఈ రాశి వారు చంద్ర గ్రహణం సమయంలో తప్పుడు పనులు చేయకుండా ఉండాలి. లేకుంటే సమాజంలో మీ ప్రతిష్ట దెబ్బతినొచ్చు. మరోవైపు మీరు ఇంటి పెద్దలు ముఖ్యంగా మీ తల్లిగారి ఆశీస్సులు తీసుకోండి.

మకర రాశి..
ఈ రాశి వారు చంద్ర గ్రహణం సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరమైన విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. మరోవైపు ఆరోగ్య సమస్యలు కూడా ఉండొచ్చు. మీరు చాలా ఓపికగా ఉండాలి.

కుంభ రాశి..
ఈ రాశి వారు చంద్ర గ్రహణం వేళ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏ చిన్న పొరపాటు చేసినా భారీగా ఖర్చులు పెరుగుతాయి. మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కొత్త ఆదాయ వనరులు ఏర్పాటు చేసుకునేందుకు సమయం పట్టొచ్చు. కొంత కాలం ఓపికగా ఉండాలి.

మీన రాశి..
ఈ రాశి వారు చంద్ర గ్రహణం సమయంలో కొంత మానసిక ఒత్తిడిని అనుభవించొచ్చు. మీరు కోపాన్ని తగ్గించుకోవాలి. ఇతరులకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉండాలి. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఇందుకోసం మీరు యోగా మరియు ధ్యానం చేయొచ్చు.
2022 సంవత్సరంలో తొలి చంద్ర గ్రహణం మే 16వ తేదీన అంటే సోమవారం ఉదయం 7:02 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది మధ్యాహ్నం 2:20 గంటల వరకు కొనసాగుతుంది. అయితే ఈ చంద్ర గ్రహణం భారతదేశంలో కనిపించదు. కాబట్టి సూతక్ కాలం ప్రభావం ఇక్కడ ఉండదు. 2022లో ఏర్పడే తొలి చంద్ర గ్రహణం నైరుతి ఐరోపా, నైరుతి ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికాలోని చాలా ప్రాంతాల్లో, దక్షిణ అమెరికా, పసిఫిక్ మహా సముద్రం, హిందూ మహా సముద్రం, అట్లాంటిక్ మరియు అంటార్కిటికా వంటి ప్రాంతాల్లో మాత్రమే ఈ తొలి చంద్ర గ్రహణం కనిపిస్తుంది.