Latest Updates
-
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.!
Lunar Eclipse on 26 May 2021: త్వరలో తొలి చంద్ర గ్రహణం.. 12 రాశులపై పడే ప్రభావం...!
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం చంద్ర గ్రహాణానికి ఎంతో విశిష్టత ఉంది. 2021లో తొలి చంద్ర గ్రహణం ఇదే నెలలో 26వ తేదీ, బుధవారం రోజున ఏర్పడబోతోంది. ఈ చంద్ర గ్రహణం అమెరికా, అస్ట్రేలియా, ఆసియా, పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంతో పాటు భారతదేశంలోనూ కనిపించనుంది.

మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా ఈ గ్రహాణాన్ని చూడొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇదే రోజున వైశాఖ పౌర్ణమి మరియు బుద్ధ పౌర్ణమి కావడం విశేషం. దీని ఫలితంగా ఈ గ్రహణం ప్రభావం ఎక్కువగానే ఉంటుంది.

జ్యోతిష్యశాస్త్రం అంచనాల ప్రకారం ఈసారి చంద్ర గ్రహణం వృశ్చికరాశిలో జరగనుంది. దీంతో ద్వాదశ రాశులపై కచ్చితంగా ప్రభావం పడుతుంది. ఈ సందర్భంగా ఏయే రాశిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పడు తెలుసుకుందాం...

మేష రాశి..
మే 26వ తేదీన ఏర్పడబోయే చంద్ర గ్రహణం వల్ల ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు రావొచ్చు. అంగారకుడు అధిపతిగా ఉండే మేష రాశి వారు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు నిర్లక్ష్యంగా ఉంటే ఏదైనా ప్రమాదం జరగొచ్చు. కాబట్టి అవసరమైతేనే బయటకు రండి. లేదంటే ఇంట్లోనే ఉండేందుకు ప్రయత్నించండి. చంద్ర గ్రహణం సమయంలో శుభఫలితాల కోసం హనుమాన్ చాలీసా పఠించాలి.

వృషభ రాశి..
తొలి చంద్ర గ్రహణం వల్ల ఈ రాశి వారి కోరికలు నెరవేరొచ్చు. అయితే మీ వైవాహిక జీవితంలో కొన్ని అడ్డంకులు రావొచ్చు. ఈ సమయంలో మీ భాగస్వామి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక పరంగా ఈ సమయం మంచిది. కానీ ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. కాబట్టి బడ్జెట్ ను బ్యాలెన్స్ గా ఉంచుకోవాలి.

మిధున రాశి..
ఈ రాశి వారికి చంద్ర గ్రహణం వల్ల సానుకూల ఫలితాలు వస్తాయి. అయితే మీపై కొంత ఒత్తిడి ఉంటుంది. మీరు ఇతరులతో వాదనలు మానుకోవాలి. ఆరోగ్యంగా ఉండేందుకు ద్యానం, యోగా చేయాలి.

కర్కాటక రాశి..
మే 26వ తేదీన ఏర్పడబోయే తొలి చంద్ర గ్రహణం వల్ల ఈ రాశి వారికి కొంత ఆందోళన పెరుగుతుంది. మీరు ఆధ్యాత్మిక పరంగా మరింత బలంగా మారిపోతారు. మరోవైపు వ్యాపారులకు మంచి ఫలితాలు రావొచ్చు. ఇంకోవైపు ఆరోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి.

సింహ రాశి..
తొలి చంద్ర గ్రహణం ఏర్పడే సమయంలో మీరు స్నేహితులతో ఎక్కువ సమయం గడపాలి. మరోవైపు వ్యాపారులకు ఈ సమయం చాలా మంచిగా ఉంటుంది. అయితే ఆర్థిక పరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒత్తిడి మరియు ఆందోళనలు లేకుండా ఉండాలి. ఈ సమయంలో మీ తల్లి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.

కన్య రాశి..
ఈ రాశి వారు చంద్ర గ్రహణం సమయంలో ఆకర్షణ కేంద్రంగా మారతారు. మీరు చాలా సందర్భాల్లో విజయం సాధించొచ్చు. ఉద్యోగులకు వేతనం పెరుగుదల వంటి శుభవార్తలు వినిపించొచ్చు. ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలు ఉంటాయి. అయితే తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల నుండి అప్రమత్తంగా ఉండాలి.

తుల రాశి..
తొలి చంద్ర గ్రహణం సమయంలో ఈ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. మీరు ఆర్థిక పరంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ సమయంలో పెట్టుబడులు పెట్టకూడదు. మీ భాగస్వామి మరియు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోండి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి.

వృశ్చికరాశి..
తొలి చంద్ర గ్రహణం సమయంలో ఈ రాశి వారికి ఆరోగ్య పరమైన సమస్యలు తలెత్తవచ్చు. మీ వైవాహిక జీవితంలో కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మీ జీవిత భాగస్వామితో వాదనలు మరియు విభేదాలు నివారించాలి. ఆర్థిక పరంగా నష్టపోయే అవకాశాలున్నాయి. మరోవైపు మీరు ఆధ్యాత్మిక అనుభూతి చెందుతారు. ద్యానం చేయడం ద్వారా మీరు ఆందోళనలను అధిగమించొచ్చు.

ధనస్సు రాశి..
తొలి చంద్ర గ్రహణం సమయంలో ఈ రాశి వారికి సానుకూలంగా ఉంటుంది. మీరు మీ మాటలపై నియంత్రణ ఉంచాలి. మీ ఖర్చులు కూడా పెరగొచ్చు. ఆర్థిక పరంగా నష్టాలొచ్చే అవకాశం ఉంది. మీరు నిద్రలేమి లేదా ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు.

మకర రాశి..
మే 26వ తేదీన చంద్ర గ్రహణం సమయంలో ఈ రాశి వారికి ప్రత్యేక ఫలితాలు రావొచ్చు. ముఖ్యంగా ప్రేమ జీవితంలో విజయం సాధిస్తారు. ఆర్థిక పరంగా మంచి లాభాలు వస్తాయి. అయితే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వ్యక్తిగతంగా ఎక్కువ ఖర్చులు రావొచ్చు. మీ వైవాహిక జీవితం మంచిగా ఉంటుంది.

కుంభ రాశి..
తొలి చంద్ర గ్రహణం సమయంలో ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. వ్యాపారులు ఊహించిన విధంగా ఫలితాలను పొందుతారు. ఉద్యోగులు కార్యాలయంలో సహోద్యోగులతో సామరస్యాన్ని పెంచుకుంటారు. మీరు ప్రయాణాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మీన రాశి..
తొలి చంద్ర గ్రహణం సమయంలో ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మీరు తల్లి మరియు పిల్లల ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా మీ భాగస్వామితో వాదనలను నివారించాలి. మీరు మీ అపార్థాలను అధిగమించడానికి కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించాలి.



Click it and Unblock the Notifications