Just In
- 3 hrs ago
ఉపవాసం ఉండే వారు పద్ధతులు తప్పనిసరిగా పాటించాలి.. లేదంటే కోరికలు నెరవేరట...!
- 5 hrs ago
ఆల్కహాల్ వల్ల బ్లడ్ షుగర్ లో వచ్చే మార్పును ఎలా ఎదుర్కోవాలో మీకు తెలుసా? ఇక్కడ తెలుసుకోండి!
- 5 hrs ago
Carbide Free Mangoes:మామిడిలో కార్బైడ్ కలిసిందా లేదా అనేది ఇలా కనిపెట్టండి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండి...
- 6 hrs ago
మీ భర్తలోని 'ఈ' లక్షణాల వల్ల మీరు సమస్యల్లో చిక్కుకోవచ్చు...!
Don't Miss
- News
ఉగ్రవాదం, సీమాంతర ఉగ్రవాదంపై జీరో టోలరెన్స్: బ్రిక్స్ సమావేశంలో జైశంకర్ స్పష్టం
- Sports
Quinton De Kock : బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నా అందుకే సెంచరీ పూర్తయ్యాక అలా సెలబ్రేట్ చేసుకున్నా
- Movies
RC15 : రామ్ చరణ్ మరో న్యూ లుక్ వైరల్.. శంకర్ ప్లాన్ మామూలుగా లేదు!
- Technology
ఈ కోడ్ల సాయంతో మీ మొబైల్‌ను ఎవరు ట్రాక్ చేస్తున్నారో కనుగొనవచ్చు
- Automobiles
హ్యుందాయ్ వెన్యూలో చాలా వేరియంట్స్ డిస్కంటిన్యూ.. కొత్త మోడల్ లాంచ్ కోసమేనా..?
- Finance
ఒక్కరోజులో రూ.7 లక్షల కోట్ల సంపద హుష్‌కాకి, ఎల్ఐసీ స్టాక్ మరింత డౌన్
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Lunar Eclipses 2022:ఈ ఏడాదిలో చంద్ర గ్రహణాలు ఎప్పుడెప్పుడు ఏర్పడనున్నాయి.. ఎక్కడ కనిపించనున్నాయి..
కరోనా వంటి కాలంలోనే మనం మరో సంవత్సరానికి గుడ్ బై చెప్పేశాం. 2021కి వీడ్కోలు పలికి 2022 ఆంగ్ల నూతన సంవత్సరంలోకి ఎన్నో ఆశలతో అడుగుపెట్టేశాం. కొత్త ఏడాదిలో అయినా ప్రతి ఒక్కరి కోరికలు, ఆశయాలు నెరవేరాలని ఆశిస్తున్నాం.
వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. కొత్త సంవత్సరంలో మొత్తం రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్ర గ్రహణాలు ఏర్పడనున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఈ సందర్భంగా చంద్ర గ్రహణం ఎప్పుడు.. ఎలా ఏర్పడుతుంది.. ఏయే రోజుల్లో.. ఏయే సమయాల్లో ఏర్పడనుంది.. సూతక్ కాలం ఉంటుందా లేదా? భారతదేశంలో చంద్ర గ్రహణం కనిపిస్తుందా? దాని ప్రభావం మనపై ఉంటుందా లేదా అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...
Vaikuntha
Ekadashi
2022:ఈ
ఏడాది
తొలి
ఏకాదశి
ఎప్పుడు?
శ్రీహరి
ఆశీస్సులు
పొందాలంటే
ఏమి
చేయాలి?

చంద్ర గ్రహణం..
సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖ మీదకు వచ్చినప్పుడు భూమి యొక్క నీడ చంద్రుడిని కప్పి వేస్తుంది. ఆ సమయంలోనే చంద్ర గ్రహణం ఏర్పడుతుందని ఖగోళశాస్త్ర నిపుణులు చెబుతారు. చంద్ర గ్రహణాలలో మొత్తం మూడు రకాలు ఉన్నాయి. అందులో ఒకటి సంపూర్ణ చంద్ర గ్రహణం, రెండోది పాక్షిక చంద్ర గ్రహణం, మూడోది పెనంబ్రల్ చంద్ర గ్రహణం.

మూడు రకాల గ్రహణాలు..
భూమి నీడ చంద్రుడిని పూర్తిగా కప్పివేస్తే దాన్ని సంపూర్ణ చంద్ర గ్రహణం అని అంటారు. ఈ సమయంలో చంద్రుడు ఎర్రగా మారిపోతాడు. అదే చంద్రుడు, సూర్యుడు మధ్య భూమి వచ్చినప్పుడు భూమి నీడ చంద్రుడిపై కొద్ది మేరకే పడినప్పుడు ఏర్పడబోయే గ్రహణాన్ని పాక్షిక చంద్ర గ్రహణం అంటారు. ఇక చివరగా సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళ రేఖ మీద లేనప్పుడు సూర్యుడు, చంద్రుడి మధ్య స్థానంలో భూమి వస్తుంది. దీన్నే పెనంబ్రల్ చంద్రగహణం అంటారు.
Makar
Sankranti
2022:
29
ఏళ్ల
తర్వాత
శని,
సూర్యుడి
సంయోగం...
12
రాశులపై
పడే
ప్రభావం...!

తొలి చంద్ర గ్రహణం..
2022 సంవత్సరంలో తొలి చంద్ర గ్రహణం మే 16వ తేదీన సోమవారం నాడు ఏర్పడనుంది. ఇది సంపూర్ణంగా ఏర్పడనుంది. సోమవారం ఉదయం 7:02 గంటల నుండి మధ్యాహ్నం 12:20 గంటల వరకు ఈ గ్రహణం కొనసాగనుంది. ఈ తొలి చంద్రగ్రహణం దక్షిణ అమెరికా, పసిఫిక్, దక్షిణ ఐరోపా, పశ్చిమ ఐరోపా, దక్షిణ ఆసియా, పశ్చిమ ఆసియా, ఉత్తర అమెరికా, అంటార్కిటికాతో పాటు మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఈ కాలంలోనే సూతక్ కాలం ఉంటుంది. ఈ చంద్ర గ్రహణానికి సుమారు తొమ్మిది గంటల ముందు సూతక్ కాలం ప్రారంభమవుతుంది. చంద్ర గ్రహణం ముగిసే వేళలో సూతక్ కాలం ముగుస్తుంది.

రెండో చంద్ర గ్రహణం..
2022 సంవత్సరంలో నవంబర్ 8వ తేదీన మంగళవారం నాడు రెండో చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఇది కూడా సంపూర్ణంగానే ఏర్పడనుంది. ఈ గ్రహణం మంగళవారం మధ్యాహ్నం 1:32 నుండి రాత్రి 7:27 గంటల వరకు కొనసాగనుంది. ఈ గ్రహణం, ఉత్తర యూరప్, తూర్పు యూరప్, ఆసియా, భారతదేశం, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ గ్రహణం కంటే ముందు కూడా సూతక్ కాలం ప్రారంభమవుతుంది. ఇది సుమారు తొమ్మిది గంటల పాటు ప్రారంభమవుతుంది. చంద్ర గ్రహణం ముగింపుతోనే సూతక్ కాలం ముగిసిపోతుంది.
కొత్త సంవత్సరంలో మొత్తం రెండు సూర్య గ్రహణాలు, రెండు చంద్ర గ్రహణాలు ఏర్పడనున్నాయని నిపుణులు చెబుతున్నారు.దక్షిణ అమెరికా, పసిఫిక్, దక్షిణ ఐరోపా, పశ్చిమ ఐరోపా, దక్షిణ ఆసియా, పశ్చిమ ఆసియా, ఉత్తర అమెరికా, అంటార్కిటికాతో పాటు మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది
2022 సంవత్సరంలో తొలి చంద్ర గ్రహణం మే 16వ తేదీన సోమవారం నాడు ఏర్పడనుంది. ఇది సంపూర్ణంగా ఏర్పడనుంది. సోమవారం ఉదయం 7:02 గంటల నుండి మధ్యాహ్నం 12:20 గంటల వరకు ఈ గ్రహణం కొనసాగనుంది. 2022 సంవత్సరంలో నవంబర్ 8వ తేదీన మంగళవారం నాడు రెండో చంద్ర గ్రహణం ఏర్పడనుంది.ఈ గ్రహణం, ఉత్తర యూరప్, తూర్పు యూరప్, ఆసియా, భారతదేశం, ఆస్ట్రేలియా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలో ఎక్కువగా కనిపిస్తుంది.