For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gandhi Jayanti 2023:అంతర్జాతీయ అహింసా దినోత్సవం ఎప్పుడో తెలుసా...

|

Gandhi Jayanti 2023:మనలో ఒకరిగా పుట్టి పెరిగిన గాంధీజీ కేవలం అహింస అనే ఆయుధంతో ప్రపంచంలోని మనుషులందరినీ ప్రభావితం చేశాడు. మన దేశ జాతిపితగా పిలుచుకునే మహాత్మగాంధీ ఎలాంటి యుద్ధాలు, దండయాత్రలు చేయకుండా ఆంగ్లేయులను అనేక ముప్పుతిప్పలు పెట్టాడు.

Mahatma Gandhi Biography in telugu: Know Gandhiji Life History, Quotes, Slogans, Family Tree Details in telugu

ఈ విశ్వానికి సత్యాగ్రహం, అహింస అనే కత్తుల్లాంటి ఆయుధాలను పరిచయం చేసిన గొప్ప మేధావి. వాటిని కనిపెట్టడమే కాదు.. ఆచరణలోనూ తనే తొలి అడుగు వేశాడు. అందుకు ఎంతో ధైర్యం కావాలని కూడా నిరూపించారు.

Mahatma Gandhi Biography in telugu: Know Gandhiji Life History, Quotes, Slogans, Family Tree Details in telugu

ఆరు పదుల వయసు దాటినా.. ఆంగ్లేయులను భయపెట్టారు. రవి అస్తమించని సామ్రాజ్యంలా ఉన్న బ్రిటీష్ వారిని కేవలం అహింస, శాంతియుత మార్గంలోనే తరిమికొట్టారు. అక్టోబర్ రెండో తేదీ గాంధీజీ జయంతి సందర్భంగా ఆ మహాత్ముని జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Insert link1Gandhi Jayanti 2021 :మహ్మాత్ముని అద్భుతమైన సూక్తులను ఓ స్మరించుకుందాం...Insert link1Gandhi Jayanti 2021 :మహ్మాత్ముని అద్భుతమైన సూక్తులను ఓ స్మరించుకుందాం...

మళ్లీ పుడతారా?

మళ్లీ పుడతారా?

భారత జాతిపితగా పిలుచుకునే మహాత్మగాంధీ 1869 సంవత్సరం అక్టోబర్ రెండో తేదీన గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్ లో కరం చంద్, పుత్లీబాయి దంపతులకు జన్మించారు. వీరి తండ్రి పోర్బందర్ లో ఒక దివాన్ గా పని చేసేవారు. తల్లి ఇంటి దగ్గరే ఉండేవారు. ఈయన చిన్నతనంలో కేవలం పండ్లు, గింజలు, మాత్రమే తీసుకున్నారట. తనకు ఉన్న అనారోగ్య సమస్యల వల్ల పాలను అస్సలు తీసుకోలేదట. ఇదిలా ఉండగా.. ప్రముఖ శాస్త్రవేత్త గాంధీనుద్దేశించి ఈ మాటలను అన్నారు. ‘గాంధీజీ జీవితం గురించి తెలుసుకున్న వారికి, గాంధీయిజాన్ని అర్థం చేసుకున్న వారికి ఈ మాటలు అతిశయోక్తిగా అనిపించవు. ఇలాంటి వ్యక్తి భూమి మీద మళ్లీ పుడతారా? ఓ సినీ కవి అన్నట్టు.. ‘భరత మాత తల రాతను మార్చిన విధాత గాంధీ.. తరతరాల యమ యాతన తీర్చిన వరదాత గాంధీ'.

విజ్ణానాన్ని సంపాదించు..

విజ్ణానాన్ని సంపాదించు..

‘రేపు చనిపోతావనే ఆలోచనతోనే బతుకు.. శాశ్వతంగా ఉంటానన్న భావనతో విజ్ణాన్ని సంపాదించు'

గాంధీజీ విద్యలో అంత చురుకుగా లేకపోయినప్పటికీ, తన ఆత్మకథ ‘సత్యంతో నా ప్రయోగం' అనే పుస్తకంలో అనేక విషయాలను వివరించారు. తన వ్యక్తిగత జీవితంలో పాల ఉత్పత్తులను తీసుకోవడం మానేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే తన ఆరోగ్యం దెబ్బతినడంతో తన డెసిషన్ ను మార్చుకున్నారు. అనంతరం మేక పాలు ప్రారంభించారు. కొన్ని సందర్భాల్లో తాజా మేక పాల కోసం ప్రయాణాల్లోనూ ఆయన వెంట మేకను తీసుకెళ్లేవారట. ఈ నేపథ్యంలో ‘ది మోరల్ బేసిస్ ఆఫ్ వెజిటేరియనిజం' పేరిట ఆయన ఓ పుస్తకాన్ని రాశారు. ఉన్నత విద్య కోసం దక్షిణాఫ్రికా వెళ్లిన గాంధీజీకి అక్కడ కూడా అవమానాలే ఎదురయ్యాయి. అప్పటినుండే గాంధీజీ తిరుగుబాటు మొదలుపెట్టారు.

చంపారన్ సత్యాగ్రహం..

చంపారన్ సత్యాగ్రహం..

గాంధీజీ విదేశాల్లో న్యాయ విద్యను చదువుకుని భారతదేశానికి తిరిగొచ్చాక తొలిసారిగా చంపారన్ సత్యాగ్రహంలో పాల్గొన్నారు. నీలి మందు ఉద్యమంలో రైతుల తరపున ఆయన పోరాటంలో పాల్గొని కీలకపాత్ర పోషించారు. అదే సమయంలో ఆయన్ను రైతులు మహాత్మా అని సంబోధించారు. అలాగే స్వాతంత్య్ర పోరాటానికి ముందే మహిళలకు సమాన హక్కుల కోసం గాంధీజీ పోరాడారు. అలా దేశంలోని ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకొని మన దేశానికి స్వాతంత్య్రం రావడంలో కీలక పాత్ర పోషించారు. అలా మనకు జాతిపితగా మారిపోయారు.

<strong>Gandhi Jayanti 2021: గాంధీజీకి ‘మహాత్మ' అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా...</strong> Gandhi Jayanti 2021: గాంధీజీకి ‘మహాత్మ' అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా...

నమ్మిన సిద్ధాంతం కోసం..

నమ్మిన సిద్ధాంతం కోసం..

సామాన్య కుటుంబంలో పుట్టిన గాంధీజీ తను నమ్మిన సిద్ధాంతం కోసం చాలా పట్టుదలగా పని చేసేవారట. అందుకే ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేశారు. నేటికీ ఆయన చూపిన సత్యం, అహింసా మార్గాలు భావితరాలకు బంగారు బాటగా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు అంటరానితనం, నిర్మూలన కోసం.. కులాలు, మతాలకు అతీతంగా అన్ని వర్గాల వారిని సమానంగా చూడాలని ఆయన పిలుపునిచ్చారు. అందుకే మహాత్మ గాంధీజీ జన్మదినం రోజైన అక్టోబర్ రెండో తేదీన ‘అంతర్జాతీయ అహింసా దినోత్సవం'గా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఇదే మన దేశానికి ఎంతో గర్వకారణం.

20 లక్షలకు పైగా జనం..

20 లక్షలకు పైగా జనం..

మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఏడాదిలోపే 1948 సంవత్సరంలో జనవరి 30వ తేదీన గాంధీజీ హత్యకు గురయ్యారు. ఢిల్లీ నగరంలోని బిర్లా నివాసం వద్ద ప్రార్థన మందిరానికి వెళ్తున్న గాంధీజీపై గాడ్సే కాల్పులు జరిపారు. ఆ సమయంలో గాంధీజీ ‘హే రామ్' అంటూ తన ప్రాణాలను కోల్పోయారు. ఆ తర్వాత మహాత్మ గాంధీజీకి వీడ్కోలు పలికేందుకు సుమారు 20 లక్షల మందికి పైగా వచ్చారు. ఆయన అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చిన వారు సుమారు 10 కిలోమీటర్ల మేర బారులు తీరారు. గాంధీజీ పేరును నోబెల్ శాంతి పురస్కారం కోసం ఐదుసార్లు నామినేట్ చేయగా.. ఒక్కసారి కూడా ఆయనకు అవార్డు రాలేదు. ఈ నేపథ్యంలోనే మన దేశంలో గాంధీ శాంతి బహుమతి పేరిట అవార్డులు ఇవ్వడం ప్రారంభించింది.

గాంధీయిజం ఒక పాఠం..

గాంధీయిజం ఒక పాఠం..

ప్రపంచంలోని ప్రతి ఒక్క వ్యక్తికి గాంధీయిజం ప్రస్తుతం ఒక పాఠంగా మారిపోయింది. నేటి పాలకులు, ప్రజలకు గాంధీజీ సిద్ధాంతాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా మారిపోయాయి. సత్యం, అహింస అనే ఆయుధాలతో గాంధీజీ ప్రపంచానికి కొత్త దారి చూపి మహాత్ములయ్యారు. మనం ఎప్పుడైతే గాంధీజీ నమ్మిన సిద్ధాంతాలను పాటిస్తామో.. అప్పుడే ఆయన ఆశయాలను నెరవేరుస్తామో.. అప్పుడే తనకు నిజమైన నివాళి అర్పించినట్టు...

FAQ's
  • గాంధీ జయంతిని ఎప్పుడు జరుపుకుంటారు?

    ప్రతి సంవత్సరం అక్టోబర్ రెండో తేదీన గాంధీ జయంతిని జరుపుకుంటారు.

English summary

Gandhi Jayanti 2023: Mahatma Gandhi Biography in telugu: Know Gandhiji Life History, Quotes, Slogans, Family Tree Details in telugu

Here we are talking about the gandhi jayanti 2021: Interesting facts about the father of the nation and mahatma gandhi biography in Telugu. Have a look
Desktop Bottom Promotion