For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Makar Sankranti 2021:పతంగుల పండుగ వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలేంటో తెలుసా...!

|

సంక్రాంతి పండుగ అంటేనే కోడిపందేలు.. రంగు రంగుల ముగ్గులు.. వాటి మధ్యలో గొబ్బెమ్మలు, భోగి మంటలు.. కొత్త అల్లుళ్లు.. పల్లెటూల్లో అందాల వంటివి చాలా ఫేమస్.

అయితే వీటన్నింటికంటే మరొకటి కూడా చాలా పాపులర్ అని కొద్ది మందికే తెలుసు. అదేంటంటే పతంగులను గాల్లోకి ఎగురవేయడం. సంక్రాంతి సమయంలో గాలిపటం రెక్కలు విప్పిన విమానంలా నింగిలోకి దూసుకెళ్తూ కొద్ది నిమిషాల్లో దూసుకెళ్తుంది.

అందులోనూ అందరి కంటే మన పతంగే ఎక్కువ ఎత్తుకు వెళ్తే ఎంతో హాయిగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ తమ ఇంటి మేడల పైకి, డాబాల పైకి వచ్చి గాలిపటాలను గాల్లో ఎగరేస్తూ ఎంతగానో ఆస్వాదిస్తారు. అయితే ఈ సమయంలోనే గాలిపటాలను ఎందుకు ఎగరేస్తారు.. దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటి? దీని వెనుక ఆసక్తికరమైన విషయాలేంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Happy Makar Sankranti 2021 : సంక్రాంతి సంబరాల వేళ మీ బంధుమిత్రులను హత్తుకునేలా విషెస్ చెప్పండి...!

జనవరిలోనే ఎందుకంటే..

జనవరిలోనే ఎందుకంటే..

జనవరిలో గాలిపటాలను ఎందుకు ఎగురవేస్తారంటే.. ఈ సమయంలో పతంగులను ఎగురవేయడానికి అనుకూల వాతావరణం ఉంటుంది. గాలిలో తేమ శాతం తక్కువగా ఉండటంతో పాటు ఒకవైపు నుంచి మరోవైపు కుగాలులు వీస్తుండటంతో గాలిపటాలు సులువుగా ఎగురుతాయి. తొలి దశలో వివిధ ఆకారాలలో సైనిక అవసరాలకు ఈ పతంగులను వాడేవారు. అక్కడి నుంచే ఈ సంస్కృతి ఇతర దేశాలకు పాకింది.

14వ శతాబ్దం నుంచి..

14వ శతాబ్దం నుంచి..

మనదేశంలోకి గాలిపటం 14వ శతాబ్దం వినియోగంలోకి వచ్చినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా గుజరాత్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో గాలిపటాల పండుగ ప్రతి ఏటా ఘనంగా జరుగుతుంది. మన హైదరాబాదులో కూడా మినీ కైట్ ఫెస్టివల్ జరుగుతుంది. మకర సంక్రాంతి పండుగ సందర్భంగా నింగిలోకి ఎగిరే గాలిపటాల వల్ల మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. ఎగిరే గాలిపటాల వెనుక ఎలాంటి మతపరమైన అంశాలు ఉండవు. సాధారణంగా చలికాలంలో ప్రజలందరూ దుప్పట్లో దూరేసి తమకు కావాల్సినంతా వెచ్చదనాన్ని కోరుకుంటారు. అనేక వ్యాధులు నాశనం.. సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించిన కొంత సమయం తర్వాత మన శరీరానికి సూర్యరశ్మి గురైతే అనేక వ్యాధులు నాశనం అవుతాయి. శాస్త్రీయంగా కూడా ఇది నిరూపితమైంది.

Makar Sankranti 2021 : సంక్రాంతి వేళ ఈ పనులను ఎట్టి పరిస్థితుల్లో చేయకండి.. చెడు ఫలితాలొస్తాయట...!

డాబాలపై చేరి..

డాబాలపై చేరి..

ఉత్తరాయణంలో సూర్యుడి నుండి వచ్చే వేడి వల్ల చల్లి వ్యాప్తి మరియు దాని కారణంగా వచ్చే వ్యాధులన్నీ తొలగిపోయే అవకాశం ఉంది. ప్రజలంతా ఇంటిపైకి చేరి పతంగులను ఎగరేసినప్పుడు, సూర్యుని కిరణాలు ఔషధంగా పని చేస్తాయి.

మన హైదరాబాదులో..

మన హైదరాబాదులో..

మన హైదరాబాదులో ప్రతి ఏటా తెలంగాణ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ పేరిట పెద్ద ఈవెంట్ జరుగుతుంది. ఇక్కడ పలు దేశాల నుండి ఎంతో మంది ప్రొఫెషనల్ కైట్ ఫ్లయర్స్ వస్తుంటాయి. అయితే కరోనా కారణంగా ఈసారి అలాంటి అవకాశాలు ఉండకపోవచ్చు.

స్వదేశీ మంజా..

స్వదేశీ మంజా..

మీరు గాలిపటాలు కొనుక్కునేటప్పుడు చైనీస్ కు బదులుగా స్వదేశీలో తయారైన సాధారణ మంజాను కొనండి. దీని వల్ల మీరు చాలా సురక్షితంగా ఉంటారు. జంతు పక్షులు కూడా సురక్షితంగా ఉంటాయి. కాబట్టి పర్యావరణాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి.

Makar sankranti recipes : సంక్రాంతి సంబరాల్లో నోరూరించే రుచులు.. స్పెషల్ రెసిపీలివే...!

సరైన ప్రదేశంలో..

సరైన ప్రదేశంలో..

మీరంతా పతంగిని ఎగరేసేందుకు ముందు సరైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకోండి. అప్పుడే గాలిపటాన్ని గాల్లోకి ఎగరేయండి. మీరు గాలిపటంపైనే పూర్తిగా శ్రద్ధ పెడితే ఏదైనా ప్రమాదం జరగొచ్చు. కరెంట్ స్తంబాలకు కూడా దూరంగా ఉండండి..

శరీరానికి వ్యాయామం..

శరీరానికి వ్యాయామం..

మీరు ఉదయాన్నే సూర్యుని వేడిని పొందుతూ గాలిపటాలను ఎగురవేయడం వల్ల మీ బాడీకి మంచి వ్యాయామం అయినట్టు అవుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో మీ మజిల్స్ అన్నీ బాగా ఫ్రీ అవుతాయి. మన బాడీకి కావాల్సిన విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది. శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లు కూడా తగ్గిపోతాయి.

English summary

Makar Sankranti 2021: Facts About The Kite Flying Festival in Telugu

Makar Sankranti is known as one of the most important festivals for the Hindus. It marks the onset of harvest season and the end of the winter season. But there is something more about this festival and i.e., kite-flying. Read about this in detail.