For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Makar Sankranti 2021 : కోడి పందేలు.. గాల్లో పతంగులు.. కొత్త అల్లుళ్ల రాకతో సంక్రాంతి సంబురాలు...!

|

సంక్రాంతి అంటేనే భోగి మంటలు.. రంగు రంగుల ముగ్గులు.. అందమైన రంగవల్లులు.. రతనాల గొబ్బిళ్లు.. పిండి వంటలు.. కోడి పందేలు.. గాల్లో పతంగులు కొత్త అల్లుళ్ల సందడితో సంక్రాంతి పండుగ అందరి ఇంటా సంబరాలను తీసుకొస్తుంది.

అందుకే ఈ పండుగ సమయంలో తెలుగు రాష్ట్రాల్లోని అనేక లోగిళ్లలో సంతోషం నిండుతుంది. మరోవైపు పంట చేతికందిన తర్వాత అన్నదాత కళ్లలో ఆనందం తెచ్చే సంక్రాంతి అచ్చమైన తెలుగు వారి పండుగ.

అంతేకాదండోయ్ ఈ పండగొచ్చొందంటే చాలు బసవన్న చిందులు.. హరిదాసుల సంకీర్తనలు.. గాలిపటాలు.. బావమరదళ్ల సరసాలు.. ఇలా ఎన్నో సరదాలతో సంక్రాంతి పండుగను అందరూ ఆనందంగా జరుపుకుంటారు. అలాంటి పండుగ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Makar Sankranti 2021 : ఈ సంక్రాంతికి మీ రాశిని బట్టి ఇవి దానం చేస్తే మంచి ఫలితం వస్తుందంట..!

భోగి మంటలతో..

భోగి మంటలతో..

మకర సంక్రాంతికి ముందు రోజు వచ్చే పండుగ భోగి. ఈ సమయంలో భగభగ మండే మంటల్లో పాత వస్తువులను, గోవు పిడకలను వేయడంతో ఈ పండుగ ప్రారంభమవుతుంది. ఇదేరోజున చిన్నారులపై భోగి పళ్లను పోస్తారు. పురాణాల ప్రకారం, ఈరోజున బదరీ వనంలో శ్రీమహా విష్ణువును పసిబాలుడిగా మార్చి దేవతలు బదరీ పండ్లు(రేగి పళ్లు)తో అభిషేకం చేశారు.

ఆయురారోగ్యాలతో..

ఆయురారోగ్యాలతో..

ఈ భోగి పళ్లే కాలక్రమంలో రేగి పళ్లుగా రూపాంతరం చెందాయి. ఈరోజు చిన్నపిల్లలకు పూలు, రేగి పళ్లు, కలిపి భోగిపళ్లుగా పోయడం వల్ల వారు ఏడాదంతా ఆయురారోగ్యాలతో ఉండాలని చాలా మంది నమ్మకం.

సూర్యుడి ఉత్తరాయణం..

సూర్యుడి ఉత్తరాయణం..

రెండో రోజు అంటే మకర సంక్రాంతి సమయంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇదే రోజున సూర్యభగవానుడు దక్షిణయానం నుండి ఉత్తరయాణలోకి రావడం వల్ల పుణ్యకాలం ప్రారంభమవుతుంది.

మకర సంక్రాంతి 2021: ఈ పండుగ జరుపుకోవడానికి 5 కారణాలు...

కనుమ పండుగ..

కనుమ పండుగ..

ఇక మూడు రోజు కనుమ పండుగ. ఈ సమయంలో పశువులను అలంకరించి పూజిస్తారు. ఈ పండుగ సందర్భంగా నాలుగో రోజున ముక్కనుమగా వ్యవహరిస్తారు. ఈరోజున కొన్ని ఊళ్లలో కొత్తగా వివాహం చేసుకున్న యువతులు తమ సౌభాగ్యం కోసం బొమ్మల నోము, సావిత్రి గౌరీ వ్రతం చేస్తారు. అలాగే సంక్రాంతి రోజున పిత్రు దేవతల ఆత్మ శాంతి కోసం వారి వారి సామర్థ్యం మేరకు దాన ధర్మాలు చేస్తారు.

ప్రత్యేక వంటకాలు..

ప్రత్యేక వంటకాలు..

ఈ పండుగ సమయంలో చేసే ప్రత్యేక వంటకాలు ప్రతి ఒక్కరినీ నోరూరిస్తాయి. ఇలాంటి పిండి వంటలు ఏ పండగకూ చేయరంటే అతిశయోక్తి కాదేమో. చాలా మందికి వాటి నుండి వచ్చే సువాసనకే కడుపు నిండిపోతూ ఉంటుంది. ఎందుకంటే సున్నుండలు, అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, గోరువిటిలు, పూతరేకులు, పాకుండలు, బూరెలు, గారెలు, ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే పెరుగుతుంది తప్ప తగ్గదు. ఈ పండుగ సందర్భంగా ఎవరికిష్టమొచ్చిన వంటలు వారు వండుకుంటూ.. వాటిని చుట్టుపక్కల వారికి కూడా పంచుతూ సంక్రాంతి సంతోషాన్ని అందిరితో పంచుకుంటారు.

కొత్త అల్లుళ్ల హడావుడి..

కొత్త అల్లుళ్ల హడావుడి..

సంక్రాంతి సమయంలో కొత్త అల్లుడు ఇంటికి వస్తున్నాడంటే.. ఆ హడావుడే వేరు. మరదళ్ల సరసాలు.. బావమరదళ్లను ఆటపట్టించడాలు అబ్బో ఆ ఆనందమే వేరు. ఈ పండక్కి అల్లుళ్ల అలక.. అత్త,మామల బుజ్జగింపులతో సంక్రాంతి అంతా సందడిగా ఉంటుంది.

Pongal Special Recipe : సంక్రాంతికి ఈ రెసిపీ చాలా స్పెషల్ అని మీకు తెలుసా...

గాల్లో పతంగులు..

గాల్లో పతంగులు..

ఇంకా కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతి సమయంలో ఉదయం మరియు సాయంత్రం వేళలో గాలిపటాలను ఎగురవేస్తారు. ఈ సమయంలో పెద్దవారు కూడా పిల్లలైపోతారు.

హరిదాసుల కీర్తనలు.

హరిదాసుల కీర్తనలు.

ఇటీవలి కాలంలో కాలంలో బసవన్నల సందడి పెద్దగా కనిపించడం లేదు. అదేవిధంగా హరిదాసుల కీర్తనలు కూడా చాలా వరకు తగ్గిపోయాయి. అయితే అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో హరిదాసులు స్కూటర్లపై వస్తూ సందడి చేస్తున్నారు.

కోడి పందేలు..

కోడి పందేలు..

సంక్రాంతి సమయంలో కోడి పందేలు, ఎడ్ల పందేలతో అందరిలో ఉత్సాహం ఓ రేంజ్ ను దాటుతుంది. ఇక కోడి పందేలకు గోదావరి జిల్లాలకు పెట్టింది పేరు. ఈ పండుగ వేళ ఎక్కడెక్కడి నుండో వచ్చి ఇక్కడ కోడి పందాలను చూడటానికి వస్తుంటారు. కేవలం సంక్రాంతి సమయంలోనే కోట్ల రూపాయల పందేలు జరుగుతాయంటే ఆ పోటీలు ఏ రేంజ్ లో ఉంటాయో ఓసారి ఊహించుకోండి. మరోవైపు ప్రకాశం జిల్లాలో ఎడ్ల పందేలు నిర్వహిస్తారు. ఈ పందేలు తెలుగు సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయి.

పండగంతా పల్లెల్లోనే..

పండగంతా పల్లెల్లోనే..

ఈ సంక్రాంతి సమయంలో పండుగ అంతా పల్లెటూళ్లలోనే కనబడుతుంది. ఉద్యోగులు, కూలీ పని చేసుకునే వాళ్లు, వలస వెళ్లిన వారంతా పట్నం వదలి పల్లెటూళ్ల బాట పడతారు. సంక్రాంతి తమ కుటుంబంతో సరదాగా గడిపేందుకు స్వస్థలాలకు చేరుకుంటారు. వీరి రాకతో పల్లెలు మరింత శోభతో వెలిగిపోతాయి. వెళ్తూ.. వెళ్తూ.. ఏడాదికి సరిపోయే ఆనందాన్ని తీసుకెళ్తారు. అందుకే సంక్రాంతిని ఆనందాల క్రాంతి అంటారు.

English summary

Makar Sankranti 2021: Story, Rituals and Significance

Here we talking about the Makar Sankranti 2021 : Story, Rituals and significance. Read on
Story first published: Friday, January 8, 2021, 15:59 [IST]