For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Happy Makar Sankranti 2021 : సంక్రాంతి సంబరాల వేళ మీ బంధుమిత్రులను హత్తుకునేలా విషెస్ చెప్పండి...!

|

కరోనా మహమ్మారి కనుమరుగువుతున్న వేళ.. కరోనా వ్యాక్సిన్ వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఆంగ్ల నూతన సంవత్సరంలో తొలిసారి ఆనందంగా సంక్రాంతి పండుగ సంబరాలు చేసుకునేందుకు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు.

ముచ్చటగా మూడు రోజుల పాటు జరుపుకునే ఈ పండుగకు ఎంతో విశిష్టత ఉంది. ఈ పండుగ సందర్భంగా తెలుగు లోగిళ్లలో భోగి మంటలు.. కలర్ ఫుల్ ముగ్గులు.. వాటి మధ్యన గొబ్బెమ్మలు... హరిదాసు కీర్తనలు.. కుర్రకారు కేరింతలు.. పల్లెటూరి పడుచుల అందాలు.. కోళ్ల పందాలు.. ఎడ్ల పందాలతో ఎంతో సరాదాగా జరుపుకునే ఈ పండుగకు ప్రతి ఒక్కరూ తమ సొంత ఊరికి చేరుకుంటారు.

అంతే కాదండోయ్ ఈ పండుగ సందర్భంగా కొత్త కోడళ్లు.. కొత్త అల్లుళ్ల రాకతో ప్రతి ఇల్లు సందడిగా మారిపోతూ ఉంటుంది. ఈ పండుగ సందడి మాత్రం పట్టణంలో కంటే పల్లెటూళ్లలోనే ఎక్కువగా ఉంటుంది. రైతులందరికీ ఈ సమయంలో పంట చేతికొస్తుంది. ఈ సందర్భంగా చాలా మంది పాడి పశువులను పూజించి, తమ దైవ సమానులైన తల్లిదండ్రులను ప్రార్థించి బంధు మిత్రులతో కలిసి చేసుకునే అత్యంత ముఖ్యమైన పండుగ సంక్రాంతి. ఈ సంక్రాంతి పండుగ అర్థం ఏమిటంటే 'సం' అంటే మంచి అని.. 'క్రాంతి' అంటే అభ్యుదయం అని అర్థం.

మనందరికీ మంచి అభ్యుదయాన్ని ఇచ్చే క్రాంతి కాబట్టే 'సంక్రాంతి'గా పండితులు చెబుతున్నారు. ఈ సంక్రాంతి పండుగ సంతోషాన్ని, సరదాలను, సంబరాలను మీరు మీ బంధు మిత్రులు, శ్రేయోభిలాషులతో పంచుకుందాం. అందుకోసం సంక్రాంతి సందేశాలు, వాట్సాప్ కొటేషన్స్, ఫేసుబుక్ లో విషెస్ వంటివి చేద్దాం. ఈ సందర్భంగా మీ కోసం కొన్ని సందేశాలను, కోట్స్ ను, పొంగల్ ఇమేజ్ లను బోల్డ్ స్కై తెలుగు తీసుకొచ్చింది. వీటిలో మీకు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి. మీ కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులందరితో షేర్ చేసుకోండి.. సంక్రాంతి సంబరాలను అంబరాన్నంటేలా జరుపుకోండి....

Makar Sankranti 2021 : కోడి పందేలు.. గాల్లో పతంగులు.. కొత్త అల్లుళ్ల రాకతో సంక్రాంతి సంబురాలు...!

సూర్యుడి మకర సంక్రమణం..

సూర్యుడి మకర సంక్రమణం..

సూర్యుడి మకర సంక్రమణం..

భోగి మంటలతో వెచ్చదనం..

అంబరాన్ని తాకే పతంగుల విహారం..

అవధుల్లేని కోడి పందేల సమరం..

తెలుగు లోగిళ్లలో రంగవల్లుల హారం..

నెమరు వేసుకో మిత్రమా మరో సంవత్సర కాలం...

అని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..

సంక్రాంతి అంటే..

సంక్రాంతి అంటే..

నింగిలోకి దూసుకెళ్లే పతంగులు.. పల్లెటూళ్లో పందెం రాయుళ్ల కోడిపందాలు..

ధాన్యపు రాశులతో నిండిపోయే గదులు.. చిందులు వేసేందుకు ముస్తాబయ్యే బసవన్నలు..సంక్రాంతి అంటేనే మూడు రోజులు..

ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరికీ హ్యాపీ పొంగల్

ఎన్నెన్నో సంబరాలు..

ఎన్నెన్నో సంబరాలు..

కష్టాలను కాల్చివేసే భోగి మంటలు.. భోగాలను అందించే భోగి పళ్లు.. కొత్త అల్లుళ్లకి స్వాగతం పలికే తోరణాలు.. బరిలో పోరుకు సిద్ధమైన కోళ్లు..పిండివంటలు.. కొత్తబట్టలు.. ఇంకా ఎన్నెన్నో సంబరాలను జరుపుకోవాలని కోరుకుంటూ..

మీకు, మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..

సరదాలు సంవత్సరమంతా..

సరదాలు సంవత్సరమంతా..

మీ ఇంట్లో వారందరికీ భోగ భాగ్యాలు కలగాలని.. సంక్రాంతి సరదాలు సంవత్సరమంతా కొనసాగాలని..

కొత్త సంవత్సరంలో కొత్త వెలుగులు నిండాలని.. కోరుకుంటూ మకర సంక్రాంతి శుభాకాంక్షలు..

Makar sankranti recipes : సంక్రాంతి సంబరాల్లో నోరూరించే రుచులు.. స్పెషల్ రెసిపీలివే...!

రంగు రంగుల ముగ్గులతో..

రంగు రంగుల ముగ్గులతో..

ఇంటి లోగిలి వద్ద రంగు రంగుల ముగ్గులతో.. వాటి మధ్యన అందమైన గొబ్బెమ్మలతో.. మీ ఇంటి తలుపులు మామిడి తోరణాలతో.. ఆనంద నిలయంగా మారి.. మీ ఇంటిల్లి పాది అందరూ నిత్యం సుఖ సంతోషాలతో కోరుకుంటూ హ్యాపీ పొంగల్.

తెలుగుదనాన్ని లోకమంతా..

తెలుగుదనాన్ని లోకమంతా..

తెలుగుదనాన్ని లోకమంతా చాటుతూ.. మన సంప్రదాయాన్ని విశ్వమంతా తెలుపుతూ.. పల్లెటూరి పవర్ ఏంటో చూపుతూ.. సంక్రాంతి పండుగను జరుపుకోండి... తెలుగు వారసత్వాన్ని నిలుపుకోండి.. అని కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..

Makar Sankranti 2021 : సంక్రాంతి వేళ ఈ పనులను ఎట్టి పరిస్థితుల్లో చేయకండి.. చెడు ఫలితాలొస్తాయట...!

సరదాలు తెచ్చే సంక్రాంతి..

సరదాలు తెచ్చే సంక్రాంతి..

అందరికీ భోగభాగ్యాలనిచ్చే భోగి.. సరదాలు తెచ్చే సంక్రాంతి.. ఇప్పటి నుండి కొత్తగా.. సరికొత్తగా.. మరింత ఆనందాన్ని పంచాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..

పల్లెటూరిలోని పైరుల అందం..

పల్లెటూరిలోని పైరుల అందం..

అన్ని గుమ్మాలలో మామిడి తోరణం.. హరిదాసుల మధుర సంగీతం..

బసవన్నల సుందర నాట్యం.. పల్లెటూరిలోని పైరుల అందం..

కొత్త అల్లుళ్లు.. కోడళ్ల సరదాల వినోదం.. గుర్తుండి పోయే ప్రతి క్షణం..

మీకు, మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..

ఎడ్ల పందాలు..

ఎడ్ల పందాలు..

భోగిపళ్లుగా మారే రేగిపళ్లు.. చిన్నారుల ముసి ముసి నవ్వులు.. కలర్ ఫుల్ ముగ్గులు.. వాటి మధ్య గొబ్బెమ్మలు.. ఎక్కడ చూసినా హరిదాసుల కీర్తనలు.. కోడిపందాలు.. ఎడ్ల పందాలను ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..

ఉప్పొంగే ఉత్సాహంతో

ఉప్పొంగే ఉత్సాహంతో

భోగి మంటలతో వస్తుంది వెచ్చదనం.. కోడి పందాలతో పెరుగుతుంది పౌరుషం.. పల్లెటూళ్లో పెరుగుతుంది జన సందోహం.. సంక్రాంతి సరదాలతో ఉప్పొంగే ఉత్సాహంతో ఈ పండుగను జరుపుకోవాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..

English summary

Makar Sankranti 2021 Wishes, Greetings, Quotes, Messages, Facebook and Whatsapp Status Messages in Telugu

Here we talking about makar sankranti 2021 wishes, quotes, sms messages, status and; Greetings. Read on