For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Makar Sankranti 2022: 29 ఏళ్ల తర్వాత శని, సూర్యుడి సంయోగం... 12 రాశులపై పడే ప్రభావం...!

|

హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏటా జనవరి నెలలో మకర సంక్రాంతి వస్తుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ సమయంలో సూర్యుడు, శని మకర రాశిలోకి ప్రవేశించనున్నారు. ఇక్కడే సుమారు నెల రోజుల పాటు ఉండనున్నారు.

ఈ కాలంలో సూర్యుడు శనిపై ఉన్న కోపాన్ని మరచిపోతాడు. ఇలాంటి అరుదైన సంఘటన 2022 సంవత్సరంలో జనవరి 14వ తేదీన జరగబోతోంది. సూర్యుడి, శని సంయోగం 1993 తర్వాత దాదాపు 29 ఏళ్ల తర్వాత జరగబోతోంది. ఈ రెండు గ్రహాల కలయిక అత్యంత ఆసక్తికరమైనదిగా పరిగణించబడుతుంది. గ్రహాలలో సూర్యుడిని రాజుగా భావిస్తారు.

శని గ్రహం నెమ్మదిగా కదులుతుంది. ఇది మన కర్మను సూచిస్తుంది. అయితే ఈ గ్రహాల సంయోగం కారణంగా సంబంధాలు సాధారణంగా దెబ్బ తింటాయి. ఈ నేపథ్యంలో సూర్యుడు మరియు శని యొక్క ఈ కలయిక ద్వాదశ రాశులపై ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం...

Makar Sankranti 2022:సంక్రాంతి వేళ మీ రాశిని బట్టి ఏ వస్తువులను దానం చేయాలో తెలుసా...

మేష రాశి..

మేష రాశి..

ఈ కాలంలో ఈ రాశి వారికి మంచి గుర్తింపు తెచ్చుకోవాలనే బలమైన కోరిక ఉంటుంది. అయితే ఇది అంత సులభం కాదు. ఉద్యోగులకు ఉన్నతాధికారులతో లేదా యజమానితో విభేదాలు రావొచ్చు. వివాహితులు ఈ సమయంలో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. కొందరికి కెరీర్లో గందరగోళం ఎదురుకావొచ్చు.

వృషభ రాశి..

వృషభ రాశి..

ఈ రాశి వారు ఈ కాలంలో విజయం సాధించాలంటే క్రమశిక్షణతో ఉండాలి. ఈ సమయంలో మీరు దూర ప్రయాణాలు చేయొచ్చు. మీరు విదేశాల్లో స్థిరపడాలని నిర్ణయించుకుంటారు. మరోవైపు మీకు తండ్రితో విభేదాలు రావొచ్చు. మరోవైపు వారి ఆరోగ్యం కూడా దెబ్బతినొచ్చు. వారికి వైద్య పర్యవేక్షణ అవసరం కావొచ్చు.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ రాశి వారిలో భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నవారు ఆకస్మిక విజయాన్ని పొందుతారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా అనుకోని గాయం కాకుండా జాగ్రత్తగా ఉండాలి. మీలో కొందరు వారసత్వ సంబంధిత విషయాల గురించి ప్రతికూలతను ఎదుర్కోవచ్చు. జ్యోతిష్యరంగంలో వారికి కొత్త విషయాలు తెలియవచ్చు.

Vaikuntha Ekadashi 2022:ఈ ఏడాది తొలి ఏకాదశి ఎప్పుడు? శ్రీహరి ఆశీస్సులు పొందాలంటే ఏమి చేయాలి?

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి వారికి ఈ కాలంలో వివాహిక జీవితంలో కొన్ని గొడవలు రావొచ్చు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కూడా క్షీణించొచ్చు. మరోవైపు వ్యాపారులకు ఒప్పందాల విషయంలో కొన్ని సమస్యలు రావొచ్చు. మీ వ్యక్తిగత మరియు వ్రుత్తి జీవితంలో మీరు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి వారికి ఈ కాలంలో కెరీర్లో అవకాశాలు మెరుగవుతాయి. మీరు అదనపు బాధ్యతలో కొత్త అవకాశాలను ఏర్పరచుకుంటారు. మీరు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు. కానీ త్వరగా కోలుకుంటారు. మీ దినచర్యను కొనసాగించండి. కాబట్టి మీరు క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేయండి.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి వారికి ఈ కాలంలో కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి కలుగుతుంది. స్టాక్ మార్కెట్ లో ఉండే వారికి నష్టాలు రావొచ్చు. మీ పిల్లలు కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు. రిలేషన్ షిప్ లో ఉన్నవారు కొంత గందరగోళాన్ని ఎదుర్కొంటారు.

ఈ రాశి వారు మీ ప్రేమికుడు అయితే, మీరు అదృష్టవంతులు

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి వారు ఈ కాలంలో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. మీరు భూమికి సంబంధించిన విషయాలలో పెట్టుబడికి దూరంగా ఉండాలి. మీ తల్లిదండ్రులు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు. వారికి వైద్య సంరక్షణ అవసరం కావొచ్చు. కొన్ని ఊహించని కెరీర్ మార్పులను పొందుతారు.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ రాశి వారికి ఈ కాలంలో వ్యక్తిగత లేదా కెరీర్ పరంగా కొన్ని అనుకోని ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. ఈ సమయంలో మీరు ఒప్పందాలు లేదా పత్రాలపై సంతకం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ చిన్న తోబుట్టువులతో సంబంధాలు చెడిపోతాయి. కాబట్టి మీరు మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి వారికి ఈ కాలంలో కొన్ని వస్తుపరమైన లాభాలు రావొచ్చు. మీ బ్యాంకు అకౌంట్లోకి ఊహించని కొంత సొమ్ము వచ్చి చేరొచ్చు. అయితే, ఆరోగ్యానికి అదనపు శ్రద్ధ అవసరం. మీకు కన్ను లేదా గొంత ఇన్ఫెక్షన్ పట్ల జాగ్రత్త వహించాలి. వ్యక్తిగత లేదా కెరీర్ పరంగా వాదనలకు దూరంగా ఉండాలి.

మకర రాశి..

మకర రాశి..

ఈ కాలంలో మీ వ్యక్తిత్వంలో కొన్ని అంతర్గత వైరుధ్యాలు ఉండొచ్చు. ఇది మీ మనసులో గందరగోళానికి దారి తీస్తుంది. ఇతరులు మిమ్మల్ని అర్థం చేసుకోవడం కష్టంగా ఉండొచ్చు. మీ వ్యక్తిగత జీవితంలో అనవసరమన ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉన్నందున మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి వారికి ఈ కాలంలో మానసిక ప్రశాంతత చెదిరిపోవచ్చు. మీరు కెరీర్ పరంగా విదేశాలకు వెళ్లాల్సి రావొచ్చు. కంటి సంబంధిత రుగ్మతల పట్ల జాగ్రత్త వహించాలి. ఈ కాలంలో మీరు ఆసుప్రతికి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే మీరు కొన్ని దానాలు చేయాల్సి ఉంటుంది.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి వారికి ఈ కాలంలో ఆర్థికంగా లాభం ఉంటుంది. అయితే అన్నదమ్ములతో లాభాలు రావొచ్చు. పాత స్నేహితుడు మిమ్మల్ని వెన్నుపోటు పొడవచ్చు. కాబట్టి ఎవ్వరినీ గుడ్డిగా నమ్మకండి. మీ పిల్లలు ఉన్నత చదువులు చదవగలరు. మీరు పరీక్షల్లో బాగా రాణించగలరు. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది.

2022 సంవత్సరంలో సూర్యుడు, శని సంయోగం ఎప్పుడు జరగనుంది? ఎన్ని ఏళ్ల తర్వాత?

2022 సంవత్సరంలో సూర్యుడు, శని గ్రహాల సంయోగం జనవరి 14వ తేదీన జరగనుంది. 29 సంవత్సరాల తర్వాత ఈ కలయిక జరగనుంది.సూర్యుడి, శని సంయోగం 1993 తర్వాత మళ్లీ ఈ నెలలోనే జరగనుంది. ఈ నేపథ్యంలో ద్వాదశ రాశులపై తీవ్ర ప్రభావం పడనుంది.

English summary

Makar Sankranti 2022: Know the impact of Sun-Saturn conjunction after 29 years in Telugu

Makar Sankranti 2022: The conjunction of Sun and Saturn is now taking place on January 14 after a gap of 29 years. Know the impact on 12 zodiac signs in Telugu
Story first published: Monday, January 10, 2022, 15:49 [IST]
Desktop Bottom Promotion