For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Makar Sankranti 2022: మకరంలో మూడు గ్రహాల కలయిక.. ఈ 5 రాశులకు అశుభ ఫలితాలు...!

|

మనమంతా ఎంతో ఉత్సాహంతో.. ఎన్నో ఆశలతో ఆంగ్ల నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టి విజయవంతంగా రెండు వారాలు పూర్తి చేసుకున్నాం.

ఇప్పుడు మనం మన తెలుగు పండుగ సంక్రాంతి సంబరాలను సంతోషంగా జరుపుకుంటున్నాం. ఇదిలా ఉండగా.. ఈ నేపథ్యంలోనే చాలా మందికి ప్రస్తుత పరిస్థితులతో పాటు.. రాబోయే కాలంలో ఏం జరుగుతుందనే విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది.

దీని కోసం చాలా మంది జ్యోతిష్యశాస్త్ర సహాయం తీసుకుంటారు. ఇదే సమయంలో ఈ ఏడాది కూడా మకర రాశిలో గ్రహాల కలయికలు విచిత్రంగా ఉండనున్నాయి. దీంతో సామాన్యులపై తీవ్ర ప్రభావమే పడనుంది. మకరరాశిలోకి ఇప్పటికే శని దేవుడు సంచారం చేస్తున్నాడు.

జనవరి 5వ తేదీనే బుధుడు కూడా ఇదే రాశికి చేరుకున్నాడు. అదే విధంగా జనవరి 14వ తేదీన అంటే గురువారం నాడు సూర్యుడు కూడా మకర రాశిలోకి ప్రవేశించడంతో సూర్య, శని, బుధ కలయిక కలిసి త్రిగ్రహ యోగం ఏర్పడనుంది. ఈ నేపథ్యంలో కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఎదురవ్వనున్నాయట. ఈ సమయంలో వారు ఏ పని చేసినా అశుభ ఫలితాలే వస్తాయట. ఇంతకీ ఆ రాశులేవి.. ఆ రాశుల జాబితాలో మీ రాశి ఉందేమో చూడండి.. ఈ కాలంలో మరింత జాగ్రత్తగా ఉండండి...

Pongal: సరదాల సంక్రాంతి ప్రత్యేకతలేంటి... పొంగల్ అంటే అసలైన అర్థమేంటో తెలుసా...

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి వారికి మకరరాశిలో త్రిగ్రహ కలయిక వల్ల ప్రతికూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు అనేక సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఈ కాలంలో ప్రత్యర్థులు మిమ్మల్ని బాధపెట్టడానికి మరియు మీ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారు. అయితే మీరు ప్రశాంతంగా ఉండాలి. మీరు దౌత్య పద్ధతిలో పరిస్థితిని నివారించాలి. లేకుంటే అది మీ కెరీర్ పై ప్రభావం చూపుతుంది. మీ ఉన్నతాధికారులు కూడా మీకు మద్దతు ఇవ్వలేరు. ఈ సమయంలో మీరు మానసిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు ఒత్తిడిని అధిగమించేందుకు ధ్యానం సాధన చేయండి.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి వారికి త్రిగ్రహ కలయిక వల్ల ఆరోగ్య పరమైన సమస్యలు రావొచ్చు. ఈ కాలంలో మీరు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొందరికి కడుపు నొప్పి వంటి సమస్యలు ఇబ్బంది పెట్టొచ్చు. ఈ సమయంలో మీరు ఆహారం, పానీయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు జంక్ ఫుడ్ మానేయండి. కారంగా ఉండే ఆహారాన్ని తగ్గించాలి. కేవలం ఇంట్లో చేసుకున్న ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. మీరు ఆరోగ్యంగా మరియు ఫిట్ గా ఉండాలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.

Makar Sankranti 2022: 29 ఏళ్ల తర్వాత శని, సూర్యుడి సంయోగం... 12 రాశులపై పడే ప్రభావం...

తుల రాశి..

తుల రాశి..

మకరరాశిలో మూడు గ్రహాల సంయోగం వల్ల ఈ రాశి వారికి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. దీని వల్ల మీకు విపరీతమైన మానసిక ఒత్తిడి ఉంటుంది. మీ పరిస్థితులు అద్వానంగా ఉంటే, మీరు ఆసుప్రతి పర్యటనలు చేయాల్సి ఉంటుంది. మీకు గొంతు, ఛాతీ లేదా వెన్నునొప్పికి సంబంధించిన సమస్యలు ఉండొచ్చు. మిమ్మల్ని మీరు ఫిట్ గా ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఇందుకోసం ప్రతిరోజూ వ్యాయామం చేయండి.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి వారు మూడు గ్రహాల కలయిక వల్ల జనవరి మాసంలో అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఈ కాలంలో మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలుంటాయి. మీరు మీ జీవిత భాగస్వామితో కొన్ని విషయాల్లో గొడవ పడొచ్చు. మీరు ఈ పరిస్థితిని ఎదుర్కోవటానికి ఈ సమయంలో ప్రశాంతంగా ఉండటం మంచిది. మీరు ఏ విధమైన సంఘర్షణలో లేదా చర్చల్లో చిక్కుకుంటే, అప్పుడు పరిస్థితులు మరింత దిగజారొచ్చు. మీరు మీ ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

మకర రాశి..

మకర రాశి..

ఇదే రాశిలో మూడు గ్రహాల కలయిక జరుగుతున్నందున మీరు చాలా సందర్భాల్లో కష్టపడాల్సి ఉంటుంది. అయితే మీరు మంచి ఫలితాలను మంచి ఆశించకండి. కేవలం ప్రాథమిక ఫలితాలపై ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఈ సమయంలో ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు పెరుగుతాయి. మీ ఖర్చులు కూడా పెరుగుతాయి. ఈ సమయంలో మీరు డబ్బును నియంత్రణలో ఉంచుకోవాలి. లేదంటే ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆరోగ్యంపై కూడా ఎక్కువ ఫోకస్ పెట్టాలి.

2022లో మకర సంక్రాంతి రోజున మకరంలోకి ఎన్ని గ్రహాల కలయిక జరగనుంది?

2022 సంవత్సరంలో మకర సంక్రాంతి రోజున మకర రాశిలోకి మూడు గ్రహాల కలయిక జరగనుంది. సూర్యుడు, శని, బుధ గ్రహాలు మకరంలోకి సంచారం చేయనున్నాయి.

English summary

Makar Sankranti 2022 : Trigrahi Yoga will be formed in Capricorn may increase difficulty for these zodiac signs in Telugu

Makar Sankranti 2022 : Trigrahi Yoga will be formed Capricorn zodiac of Saturn in the year 2022, it may increase difficult for these zodiac signs. Know more
Story first published: Saturday, January 15, 2022, 14:12 [IST]
Desktop Bottom Promotion