Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
కొత్త ఏడాదికి ముందు ఈ శుభయోగాలు చాలా ప్రత్యేకమంట... అవేంటో తెలుసా...!
కొత్త ఏడాదికి ముందే కొన్ని శుభ యోగాలు కలగనున్నాయంట.
ఆంగ్ల నూతన సంవత్సరం ప్రారంభం కావడానికి మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది ప్రజలు తమ మనసులో కొత్త సంవత్సరంలో ఏదైనా కొత్తగా చేయాలని ఆలోచిస్తుంటారు.

కొంచెం కొత్తగా కావాలని ఆశిస్తుంటారు. 2020 సంవత్సరం మనలో అందరికీ కష్టాలు ఎదురైన సంగతి తెలుసు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ముగియబోతోంది. అదే సమయంలో కొత్త సంవత్సరం కూడా ప్రారంభమవుతుంది.

దీంతో కొత్త ఏడాదిలోనైనా తమకు సంతోషకరంగా ఉంటుందా? 2021లోనైనా తమ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా అని చాలా మంది ఊహించుకుంటున్నారు. ఈ సందర్భంగా 2020 సంవత్సరం చివరి రోజు మరియు కొత్త సంవత్సరం ప్రారంభంలోని మొదటి ఉదయం వరకు చాలా శుభ యోగాలు జరగనున్నాయట.

ఈ శుభ యోగాలలో కొత్త సంవత్సరం చాలా ప్రత్యేకమైనదని చాలా మంది నమ్ముతున్నారు. ఈ సందర్భంగా కొత్త ఏడాది వేళ ఏ శుభ యోగం వల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

సర్వార్థ సిద్ధి..
హిందూ పంచాంగం ప్రకారం కొత్త ఏడాది వేళ తొలిరోజున సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుందట. ఇది 2020 డిసెంబర్ 31వ తేదీ సూర్యోదయం నుండి జనవరి 1వ తేదీ సూర్యోదయం వరకు ఉంటుంది. సర్వార్థ సిద్ధియోగం చాలా ప్రత్యేకమైనదిగా పండితులు చెబుతున్నారు. ఈరోజున ఎవరైనా ఏ శుభకార్యాలు చేస్తే దాని ఫలితాలు కూడా చాలా పవిత్రమైనవని నమ్ముతారు.

లక్ష్మీదేవి అనుగ్రహం..
ఈ సంవత్సరంలో తొలిరోజున సర్వార్థ సిద్ధియోగం ఉండటమనేది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సూచిస్తుంది. మీరు ఏడాది పొడవునా మంచి పనులు చేస్తే మీరు మహాలక్ష్మీని అనుగ్రహాన్ని కచ్చితంగా పొందుతారని పండితులు చెబుతున్నారు.

అమృత సిద్ధి యోగం..
నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు.. అదే సమయంలో 2020కి గుడ్ బై చెప్పేందుకు చాలా మంది ఇప్పటికే ప్లాన్ చేసుకుని ఉంటారు. అయితే ఇదే సమయంలో అమృత సిద్ధి యోగం సంభవించబోతుంది. దీని వల్ల నూతన సంవత్సరం ప్రారంభంలో మరింత ప్రత్యేకంగా ఉంటుంది. ఈ అమృత సిద్ధి యోగం కొత్త పనులకు మరియు మంచి పనులకు ఎంతో ప్రత్యేకమైనదిగా భావిస్తారు.

శుభప్రదంగా..
ఈ సంవత్సరం 2020 డిసెంబర్ 31వ తేదీన ఉదయం 7:49 గంటల వరకు సూర్యోదయం ఉంటుంది. అమృత సిద్ధి యోగం వల్ల ఈ ఏడాది ప్రారంభంలో చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో కరోనా విరుగుడుకు సంబంధించి కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. ఈ మహమ్మారి నుండి సురక్షితంగా బయటపడేందుకు టీకా రెడీ రెడీ అయ్యే అవకాశం ఉంటుంది.

గురుపుష్య యోగం..
2020 సంవత్సరంలో డిసెంబర్ 31వ తేదీన ముచ్చటగా మూడో యోగం ఏంటంటే గురుపుష్య యోగం. గురుపుష్య యోగం సమయంలో భానుడిని పూజించడం వల్ల ప్రత్యేకమైన ఫలితాలు లభిస్తాయని పండితులు చెబుతారు. ఈ సమయంలో మీరు ఆరోగ్యవంతంగా, ఏడాది మొత్తం అనారోగ్యం బారిన పడకుండా ఉండాలని కోరుకుంటే.. మీ కోరికలు నెరవేరే అవకాశం ఉంది.

విష్ణువును ఆరాధించడం..
గురుపుష్య యోగం శుభ సమయంలో మీరు శ్రీమహావిష్ణువును ఆరాధించడం వల్ల చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ సమయంలో ఆ విష్ణుమూర్తిని కొలవడం వల్ల మీ జీవితంలో అనేక ఆటంకాలన్నీ పూర్తవుతాయి. గురుపుష్య యోగం డిసెంబర్ 31 ఉదయం 7:49 గంటల నుండి జనవరి 1వ తేదీ సూర్యోదయం వరకు ఉంటుంది.



Click it and Unblock the Notifications
