For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కుజుడు మీన రాశిలోకి ఎంట్రీ : 12 రాశి చక్రాలపై ఎలాంటి ప్రభావం పడుతుందంటే...!

అంగారకుడు మీన రాశిలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ద్వాదశ రాశులపై ఎలాంటి ప్రభావం పడుతుందో చూడండి..

|

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల కదలిక వల్ల మన వ్యక్తిగత జీవితాలపై కచ్చితంగా ప్రభావం ఉంటుంది. గ్రహాలలో అతి ముఖ్యమైన గ్రహం అంగారకుడు(కుజుడు). ఈ గ్రహం అక్టోబర్ 4వ తేదీ నుండి తన స్థానాన్ని మారబోతున్నాడు.

Mars Retrograde in Pisces- 04 October 2020 Effects on Zodiac Signs in Telugu

రాశిచక్రంలోని మీన రాశిలోకి ప్రవేశించి సుమారు 81 రోజుల వరకు ఉంటుంది. ఈ గ్రహం నవంబర్ 14వ తేదీన ఉదయం 6:06 గంటల వద్ద ప్రత్యక్షమవుతుంది. అలాగే డిసెంబర్ 24వ తేదీ నుండి దాని సొంత రాశి అయిన మేషరాశి వైపు పయనిస్తుంది. దీని ఫలితంగా ద్వాదశ రాశుల వారిపై చాలా ప్రభావం పడనుంది.

Mars Retrograde in Pisces- 04 October 2020 Effects on Zodiac Signs in Telugu

ఈ నేపథ్యంలో ఏయే రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది.. ఏయే రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుందనే వివరాలతో పాటు ఏయే పరిహారాలు పాటించాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

అక్టోబరులో పుట్టిన వారికి ప్రత్యేక వ్యక్తిత్వం ఉంటుందట... అవేంటో చూసేయ్యండి...!అక్టోబరులో పుట్టిన వారికి ప్రత్యేక వ్యక్తిత్వం ఉంటుందట... అవేంటో చూసేయ్యండి...!

మేష రాశి..

మేష రాశి..

అంగారకుడు మీన రాశిలోకి ప్రవేశించే సమయంలో మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే అనారోగ్య సమస్యలు పెరిగి.. అనసవరమైన ఖర్చులు కూడా పెరుగుతాయి. మరోవైపు మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. ఉద్యోగులు చాలా ఓపికగా పని చేయాలి. తప్పుల నుండి నేర్చుకోవడానికి ప్రయత్నించాలి.

పరిహారం : హనుమాన్ చాలీసా చేస్తే శుభఫలితాలు వస్తాయి.

వృషభరాశి..

వృషభరాశి..

కుజుడు మీన రాశిలోకి ఎంట్రీ ఇచ్చే సమయంలో ఈ రాశి వారికి శుభప్రదమైన ఫలితాలు వస్తాయి. ఈ పవిత్రమైన సమయంలో మీ ఖర్చులు తగ్గిపోయి.. నెమ్మదిగా లాభాలవైపు పయనిస్తారు. మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఈ సమయంలో మీరు ఎలాంటి ప్రయత్నాలు చేసినా.. మీరు విజయం సాధిస్తారు. అయితే మీరు అనవసరమైన పనుల జోలికి వెళ్లకూడదు.

పరిహారం : మంగళవారం రోజున కార్తీకేయ స్వామిని ఆరాధించండి.

మిధున రాశి..

మిధున రాశి..

మీన రాశిలోకి కుజుడు ప్రవేశించే సమయంలో ఈ రాశి వారికి ఆర్థిక పరంగా స్థిరత్వం ఉంటుంది. మీ కోరికలు మరియు ఆశయాలను సాధించడంపై మీరు మరింత ఫోకస్ పెడతారు. అలాగే మీరు కొన్ని సవాళ్లను కూడా ఎదుర్కొంటారు. మీ శత్రువులు మీపై ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తారు. ఇలాంటి సమయంలో మీరు భయపడకుండా.. ధైర్యంగా అడుగు ముందుకేయాలి. లేకపోతే ప్రతికూల ఫలితాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఇలాంటి సమయంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలపై మీ జీవిత భాగస్వామితో చర్చించడం మంచిది. వారు మీకు సహాయం చేయొచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మంచి ఫలితాలుంటాయి. ఆరోగ్య పరంగా జాగ్రత్తగా ఉండాలి.

పరిహారం : మంగళవారం రోజున ఉపవాసం ఉంటే మంచి ఫలితాలు వస్తాయి.

అక్టోబర్ నెలలో మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి...అక్టోబర్ నెలలో మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి...

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

కుజుడు మీన రాశిలోకి ఎంట్రో ఇచ్చే సమయంలో ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో ప్రయాణాలు వంటివి చేయకూడదు. ఎందుకంటే వాటి వల్ల మీకు అనవసరమైన ఖర్చులు మరియు నష్టాలు పెరగొచ్చు. ఉద్యోగులు మీ పనులను సకాలంలో పూర్తి చేయాలి. లేదంటే అనేక సమస్యలను ఎదుర్కొంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు రావాలంటే కొంచెం ఎక్కువ కష్టపడాలి. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉండాలి.

పరిహారం : మంగళవారం రోజున మీ కుడి చేతి ఉంగరపు వేలికి గోల్డ్ రింగ్ వేసుకోండి(మీకు వీలైతేనే)

సింహ రాశి..

సింహ రాశి..

మీన రాశిలోకి అంగారకుడు సంచరించే సమయంలో సింహ రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. మీరు కొన్ని విషయాల గురించి ఎక్కువగా ఆందోళన చెందుతారు. వీటన్నింటిని ఎదుర్కోటానికి మీరు సానుకూల ఆలోచనా విధానాన్ని కలిగి ఉండాలి. ఈ సమయంలో మీరు రుణాలు, బాధ్యతలు ఇతర వ్యక్తుల వనరులపై ఆధారపడొద్దు. ఎందుకంటే మీరు నిరాశకు గురవుతారు. మరోవైపు మీ జీవిత భాగస్వామితో మీ సంబంధాన్ని తిరిగి పెంచుకోవడానికి ఇది ఉత్తమ సమయం, కాబట్టి, వారితో ఎక్కువ నాణ్యమైన సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి. ఆరోగ్య పరంగా అప్రమత్తంగా ఉండాలి.

పరిహారం : మంగళవారం రోజున హనుమంతునికి సింధూరం సమర్పిస్తే శుభ ఫలితాలొస్తాయి.

కన్య రాశి..

కన్య రాశి..

మీన రాశిలోకి కుజుడు ప్రవేశించే సమయంలో కన్య రాశి వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. అయితే మీరు పనికి సంబంధించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. మీ కెరీర్ కు సంబంధించి మీరు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. కొన్నిసందర్భాల్లో మీరు చాలా ఓపికగా ఉండాలి. వైవాహిక జీవితంలో మీరు మీ భాగస్వామికి గౌరవం ఇవ్వాలి. సాధ్యమైనంత వరకు మీరు ఉత్తమమైన పరిష్కారాన్ని రూపొందించాలి. ఆర్థిక పరంగా మంచిగానే ఉంటుంది. వ్యక్తిగతంగా మాత్రం సంబంధాలలో కొన్ని ఇబ్బందులుంటాయి.

పరిహారం : మంగళవారం రోజున రాగి వస్తువులను దానం చేస్తే మంచి జరుగుతుంది.

ఈ అక్టోబర్ నెలలో వచ్చే పండుగలు.. వ్రతాలు, శుభముహుర్తాలివే...!ఈ అక్టోబర్ నెలలో వచ్చే పండుగలు.. వ్రతాలు, శుభముహుర్తాలివే...!

తుల రాశి..

తుల రాశి..

కుజుడు మీన రాశిలోకి సంచార సమయంలో ఈ రాశి వారికి అడ్డంకులన్నీ తొలగిపోయే అవకాశం ఉంటుంది. మీరు మీ పోటీదారులపై పై చేయి సాధించే అవకాశం ఉంది. మీరు చాలా తెలివిగా పని చేయాలి. ఆర్థిక పరంగా మీరు రుణాలు ఇవ్వడం వంటివి చేయకూడదు. ఎందుకంటే దాన్ని తిరిగి పొందడం కష్టం. మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. మీ భాగస్వామితో వీలైనంత మేరకు ఎక్కువగా నాణ్యమైన సమయాన్ని గడపాలి.

పరిహారం : మంగళవారం రోజున నరసింహ స్వామిని ఆరాధిస్తే శుభ ఫలితాలొస్తాయి.

వృశ్చిక రాశి..

వృశ్చిక రాశి..

ఈ రాశి వారికి ఈ సమయంలో అనుకూలంగా ఉంటుంది. మీరు ఏ పని చేసినా.. ఫలితం ఆశించకుండా ప్రయత్నం చేస్తే.. కచ్చితంగా సానుకూల ఫలితాలు వస్తాయి. వ్యక్తిగతంగా ఈ సమయంలో కొన్ని సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి, మీ సంబంధాలలో మీ స్వభావాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. మీరు వివాహం చేసుకోవాలనుకుంటే, సమయం అనుకూలంగా లేదు. మరోవైపు విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఏర్పడతాయి.

పరిహారం : మీ కుడి చేతి ఉంగరపు వేలుపై ఎర్రని రంగులో ఉండే పగడాన్ని ధరించండి.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

మీన రాశిలోకి కుజుడు ప్రవేశించే సమయంలో మీకు ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. మీరు నిరాశ, చిరాకు, ఆందోళన పడొచ్చు. అలాగే మీరు అన్ని నిర్బంధాల నుండి త్వరగా కోలుకోవాలని కోరుకుంటారు. అయితే ఇందుకోసం మీరు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. లేదంటే మీకు నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఓపికగా ఉండాలి. ఆర్థిక పరంగా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య పరంగా బిపి మరియు రక్త సంబంధిత వ్యాధులు ఈ కాలంలో పెరుగుతాయి.

పరిహారం : హనుమాన్ చాలీసా పఠిస్తే శుభ ఫలితాలొస్తాయి.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి వారికి ఈ సమయంలో శుభ ఫలితాలు వస్తాయి. మీ పనికి సంబంధించి ఎలాంటి ప్రయత్నాలు చేసినా.. మీరు వాటిలో విజయం సాధించవచ్చు. మీరు మీ లక్ష్యాలను మరియు ఆశయాలను సాకారం చేసుకోవడానికి ఎక్కువగా కష్టపడాలి. నిరుద్యోగులకు కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి. మీ వ్యక్తిగత సంబంధంలో మీరు రొమాన్స్ చేయడానికి ఆసక్తి చూపుతారు.

పరిహారం : పవిత్రమైన భక్తితో అంగారకుని స్త్రోత్రం పఠిస్తే శుభ ఫలితాలు వస్తాయి.

కుంభ రాశి..

కుంభ రాశి..

మీన రాశిలోకి కుజుడు సంచరించేసమయంలో కుంభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాల్లో లాభ, నష్టాలు సమానంగా ఉండొచ్చు. అయితే మీరు అకస్మాత్తుగా ఎలాంటి కొనుగోళ్లు చేయకుండా ఉండాలి. భవిష్యత్తు గురించి ప్రణాళిక వేయాల్సి ఉంటుంది. అలాగే బడ్జెట్ ప్రకారం ఖర్చు చేయాలి. పనిలో కొన్ని కఠినమైన సవాళ్లు ఎదురవుతాయి. అయితే దీని వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు కలగవు. ఆరోగ్య పరంగా మాత్రం కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

పరిహారం : రిన్ మోచక్ మంగల్ స్తోత్రం పఠిస్తే సానుకూల ఫలితాలు వస్తాయి.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశిలోకే కుజుడు ప్రవేశించడం వల్ల మీన రాశిపై కచ్చితమైన ప్రభావం ఉంటుంది. ఈ సమయంలో మీరు ఎంత కష్టపడినా సరైన ఫలితాలు రాకపోవచ్చు. అలాగే మీ కుటుంబసభ్యులతో సంబంధంలో కూడా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మీ సంబంధాలలో చాలా అడ్డంకులు రావొచ్చు. ఇలాంటి సమయంలో మీరు ప్రశాంతంగా ఉండాలి. ఆరోగ్య పరంగా కూడా ఈరోజు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

పరిహారం : ప్రతిరోజూ మీ నుదుటిపై చందనం లేదా చందన తిలకం రాస్తే శుభ ఫలితాలొస్తాయి...

English summary

Mars Retrograde in Pisces- 04 October 2020 Effects on Zodiac Signs in Telugu

Mars in its retrograde motion will move from its own sign Aries to Pisces on 04th October 2020. Read more to find out how it will impact your zodiac sign.
Desktop Bottom Promotion