Latest Updates
-
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్ట యోగం..! - గురువారం, 23 ఏప్రిల్ 2026 -
చికెన్, మటన్ రుచిని మైమరిపించే ఎగ్ టమాటో గ్రేవీ..ఇలా ఈజీగా చేసేయండి! -
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో.. -
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే! -
సమాధుల మధ్య ప్రేమ..ఇదెక్కడి వింత ట్రెండ్ రా బాబూ! -
డేటింగ్ యాప్స్‌లో హనీట్రాప్ ఉచ్చు.. ఢిల్లీలో కొత్త వ్యక్తులను కలిసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వేడివేడి చికెన్ చెన్నా పులావ్,చల్లటి స్పెషల్ రైతా..ఈ కాంబో రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
ఎండల నుంచి ఉపశమనం: ఇంట్లోనే తయారు చేసుకునే ORS, దేశీ చిట్కాలు ఇవే! -
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం! -
అచ్చం రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ చికెన్ ఫ్రైస్.. ఈ స్పెషల్ సాస్ తో ట్రై చేస్తే టేస్ట్ వేరే లెవల్!
Mangal Gochar April 2022 : ఏప్రిల్ నెలలో కుంభంలోకి కుజుడి సంచారం.. 12 రాశులపై పడే ప్రభావం...!
ఏప్రిల్ నెలలో కుంభంలోకి కుజుడి సంచారం.. 12 రాశులపై పడే ప్రభావాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, అంగారక(కుజుడు) గ్రహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ గ్రహం ఎరుపు రంగులో ఉండటం వల్ల కోపం, విధ్వంసం, హింస వంటి వాటికి ప్రతీకగా భావిస్తారు.

ఎవరి జాతకంలో అయితే కుజుడి స్థానం సరిగా ఉండదో వారు వివాహ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని పండితులు కూడా చెబుతుంటారు. అదే సమయంలో కుజుడి స్థానం బలంగా ఉంటే.. వారు తమ నైపుణ్యాలను పెంచుకుంటూ పోతారు.. వాటిని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటారు.

ఈ నేపథ్యంలో కుజుడు త్వరలో తన స్థానం నుండి మరో స్థానానికి మారబోతున్నాడు. 2022 సంవత్సరంలో ఏప్రిల్ ఏడో తేదీన కుజుడు మకరం నుండి కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సందర్భంగా ద్వాదశ రాశులపై ప్రభావం పడనుంది. ఇంతకీ ఏయే రాశులపై ఎలాంటి ప్రభావం, ఏయే రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..
ఈ రాశి వారు కుజుడి సంచారం వేళ శుభ ఫలితాలను పొందుతారు. ఉద్యోగులు సహోద్యోగులతో మంచి సమయం గడుపుతారు. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీరు కష్టపడి పని చేస్తారు. మీరు తగిన ఫలితాలను పొందుతారు. మీరు కొత్త ఆదాయ వనరులను పొందడం ద్వారా, ఒత్తిడి నుండి విముక్తి పొందుతారు. మీ కుటుంబంతో సంబంధాలు మెరుగుపడతాయి. మీ జీవిత భాగస్వామితో కొన్ని అపార్థాలు ఉంటాయి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.
పరిహారం :వెర్మెలియన్ లేదా తేనేను మట్టి కుండలో ఉంచితే, శుభ ఫలితాలు వస్తాయి.

వృషభ రాశి..
ఈ సమయం మీ కెరీర్ కు అనుకూలంగా ఉంటుంది. మిమ్మల్ని మీరు నిరూపించుకోడానికి మీకు పుష్కలంగా అవకాశాలొస్తాయి. కార్యాలయంలోని సీనియర్లు మరియు సహోద్యోగులు మీ శ్రమను చూసి మిమ్మల్ని గౌరవిస్తారు. ఈ కాలంలో కష్టపడి పని చేస్తే లాభాలొస్తాయి. పెట్టుబడికి ఇది మంచి సమయం కాదు. మీ ప్రియమైన వారితో సంబంధాలు చెడిపోవచ్చు.
పరిహారం : సంతానం లేని వారికి సహాయం చేయడం ద్వారా మీరు సానుకూల ఫలితాలను పొందుతారు.

మిధున రాశి..
ఈ రాశి వారికి కుజుడి సంచారం వల్ల ఆర్థిక పరంగా శుభ ప్రదంగా ఉంటుంది. మీరు కొత్త వ్యక్తులతో కనెక్ట్ అవుతారు. ఆస్తి సంబంధిత పనులు చేసే వ్యక్తులు విజయం సాధిస్తారు. అయితే కెరీర్ పరంగా ఈ కాలంలో కొన్ని ఇబ్బందులొస్తాయి. మీ ప్రతిష్టను దిగజార్చడానికి కొందరు ప్రయత్నిస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మీరు మీ భాగస్వామితో కలిసి ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు. మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ధ్యానం మరియు యోగా సాధన చేయండి.
పరిహారం : మీరు ప్రతిరోజూ హనుమంతుడిని పూజించాలి.

కర్కాటక రాశి..
ఈ రాశి వారు కుజుడి రవాణా సందర్భంగా కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. ఈ సమయంలో మీరు నిరాశగా ఉంటారు. మీరు మీ బడ్జెట్ ను ప్లాన్ చేస్తేనే మీ ఖర్చులను మీరు చూసుకోగలరు. మీరు ఎక్కువ ఖర్చు చేస్తే ఇబ్బందుల్లో పడొచ్చు. మీ జీవిత భాగస్వామితో సంబంధాలు అనుకూలంగా ఉండవు. మీరు మీ కుటుంబానికి దూరంగా ఉండాల్సి రావొచ్చు. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
పరిహారం : మీరు మతపరమైన ప్రదేశాలలో బియ్యం, బెల్లం మరియు పప్పును అందించొచ్చు.

సింహ రాశి..
ఈ రాశి వారికి కుజుడి సంచారం సమయంలో ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారులు లాభాలను ఆర్జిస్తారు. ఉద్యోగులకు శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం ఎంచుకోవాలి. మీ నైతికతను కాపాడుకోండి. మీ డబ్బు ఎక్కడైనా నిలిచిపోయి ఉంటే, దాన్ని తిరిగి పొందుతారు. మీరు ఆరోగ్య సమస్యల నుండి విముక్తి పొందుతారు.
పరిహారం : మంగళవారం రోజున ‘ఓం అంగారకాయ నమః' అని మంత్రాన్ని పఠించాలి.

కన్య రాశి..
ఈ రాశి వారు కుజుడి సంచారం వేళ, ఎన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ, మానసికంగా చాలా బలంగా ఉంటారు. మీరు కష్టపడి పని చేస్తారు. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కాబట్టి మీరు ఖర్చుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు మతపరమైన కార్యక్రమాల్లో కూడా పాల్గొనొచ్చు. మీ తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మీరు మంచి ఫలితాలను పొందుతారు.
పరిహారం : పిల్లలు పుట్టినవారు మిఠాయిలకు బదులు ఉప్పు పంచితే శుభ ఫలితాలొస్తాయి.

తుల రాశి..
ఈ రాశి వారు కుజుడి సంచారం సమయంలో, కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీరు కొత్త ఉద్యోగం కోసం వెతకొచ్చు. మీరు కొంత నష్టపోవాల్సి ఉంటుంది. కాబట్టి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకండి. మీ జీవిత భాగస్వామితో సంబంధాలు సాధారణంగా ఉంటాయి. మీ పిల్లల పనితీరు దెబ్బ తింటుంది. ఇది మీకు ఒత్తిడిని కలిగించొచ్చు. మీ పిల్లల పనితీరు దెబ్బ తింటుంది. మీ ఆరోగ్యం కూడా ప్రభావితం కావొచ్చు. మీరు మానసికంగా మరియు శారీరకంగా బాగానే ఉంటారు.
పరిహారం : ప్రతి మంగళవారం రోజున హనుమాన్ చాలీసా పఠనం చేయాలి.

వృశ్చిక రాశి..
కుజుడి సంచారం సమయంలో మీకు స్నేహితులు, కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. అయితే మీరు దూకుడుగా ప్రవర్తిస్తే, మీకు దగ్గరగా ఉన్న వ్యక్తులతో సంబంధాన్ని పాడు చేస్తుంది. మీరు వివాదాలు రాకుండా తెలివిగా మాట్లాడాలి. మీ ఆర్థిక స్థితి మంచిగా ఉంటుంది. కాబట్టి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం అంత మంచి ఆలోచన కాదు. మీ తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.
పరిహారం : మీరు ప్రతిరోజూ లేదా ప్రతి మంగళవారం రోజున అంగారక గ్రహానికి పూజలు చేయాలి.

ధనస్సు రాశి..
కుజుడి సంచారం వేళ ఈ రాశి వారు చాలా రంగాల్లో విజయం సాధిస్తారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే మంచి రాబడులు వస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అయితే మీ ఖర్చులు కూడా పెరుగుతాయి. మీ బడ్జెట్ ను జాగ్రత్తగా చూసుకోవాలి. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. మీరిద్దరూ ఈ క్షణం నుండి ఆనందిస్తారు. ఈ కాలంలో మీ ఆరోగ్యం బాగుంటుంది.
పరిహారం : అహంకారానికి దూరంగా ఉండాలి, మీ తమ్ముడితో మంచిగా ప్రవర్తించాలి. ఇలా చేస్తే మీకు మంచి ఫలితాలొస్తాయి.

మకర రాశి..
కుంభంలోకి కుజుడి సంచారం వేళ ఈ రాశి వారి వాతావరణం మంచిగా ఉంటుంది. అందువల్ల మీరు చాలా ఒత్తిడిలో ఉండొచ్చు. ఈ కాలంలో పెట్టుబడులు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఆర్థిక పరిస్థితి మంచిగా ఉంటుంది. మీరు చాలా డబ్బు సంపాదిస్తారు. ఆరోగ్య పరంగా ఈ కాలం మంచిగానే ఉంటుంది. మీరు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
పరిహారం : మీరు మీ పూర్వీకులకు గౌరవం ఇవ్వాలి మరియు ఏదైనా ఆలయంలో వేప చెట్టును నాటాలి.

కుంభ రాశి..
ఇదే రాశిలోకి కుజుడు ప్రవేశించడం వల్ల ఈ రాశి వారు మంచి ఫలితాలను పొందుతారు. ఉద్యోగులు కార్యాలయంలో మంచిగా రాణిస్తారు. మీరు ఇచ్చిన గడువు కంటే ముందే మీ పనిని పూర్తి చేస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. కొత్త వెంచర్ ప్రారంభించడం మానుకోండి. ఈ కాలంలో మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎంత డబ్బు ఖర్చు చేస్తున్నారో చూడండి. మీరు ఏదైనా అంటు వ్యాధికి గురయ్యే అవకాశం ఉన్నందున మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.
పరిహారం : ప్రజలు విరాళంగా ఇచ్చే ఉచితాలను లేదా వస్తువులను తీసుకోవద్దు.

మీన రాశి..
కుంభంలోకి కుజుడి సంచారం సమయంలో మీ ప్రయత్నాలు విఫలం కావొచ్చు. మీ ప్రత్యర్థులు మీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నించొచ్చు. జాగ్రత్తగా ఉండాలి. మీరు కూడా దూషించే పదాలను వాడొద్దు. దూకుడుగా ఉండొద్దు. ఈ కాలంలో మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు కూడా. మీ వ్యక్తిగత జీవితం కాస్త బిజీగా ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామితో బాగా కమ్యూనికేట్ చేయాలి. మిమ్మల్ని మీరు ఫిట్ గా ఉంచుకోవడానికి యోగా మరియు ధ్యానం చేయాలి.
పరిహారం : ప్రతిరోజూ ఉదయాన్నే తేనే తీసుకోవాలి.
కుజుడు త్వరలో తన స్థానం నుండి మరో స్థానానికి మారబోతున్నాడు. 2022 సంవత్సరంలో ఏప్రిల్ ఏడో తేదీన కుజుడు మకరం నుండి కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సందర్భంగా ద్వాదశ రాశులపై ప్రభావం పడనుంది. ఈ గ్రహం ఎరుపు రంగులో ఉండటం వల్ల కోపం, విధ్వంసం, హింస వంటి వాటికి ప్రతీకగా భావిస్తారు. ఎవరి జాతకంలో అయితే కుజుడి స్థానం సరిగా ఉండదో వారు వివాహ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని పండితులు కూడా చెబుతుంటారు. అదే సమయంలో కుజుడి స్థానం బలంగా ఉంటే.. వారు తమ నైపుణ్యాలను పెంచుకుంటూ పోతారు.. వాటిని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటారు.



Click it and Unblock the Notifications











