Latest Updates
-
కొవిడ్ ఇచ్చిన కిక్.. డిగ్రీ పట్టా లేదు, వ్యాపారం కాదు.. కానీ 20 ఏళ్లకే నెలకు రూ. లక్షల్లో ఆదాయం.! -
పచ్చిమిర్చి ఊరగాయ ఇలా చేస్తే..ఒక్క ముద్ద తినేవాళ్లు నాలుగు ముద్దలు లాగించేస్తారు! -
కౌమార దశలో బాలికలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఏంటో తెలుసా.? -
చికెన్ బిర్యానీ తిన్నా షుగర్, బరువు పెరగకుండా ఉండాలంటే ఇలా చేయండి! -
డా. మంతెన ఆరోగ్య చిట్కాలు.. అన్ని విటమిన్లనూ ఒకే కప్పులో అందించే ప్రకృతి రహస్యం ఇదే.! -
రాత్రి అన్నం మిగిలితే ఇలా ఊతప్పం చేయండి.. పిల్లలు, పెద్దలు లొట్టలేసుకుని తింటారు! -
చీర ఎత్తితే చీరేస్తారు: పంక్షన్లలోనే కాదు.. రైళ్లలోనూ హిజ్రాల బీభత్సం! -
ఉదయాన్నే ఒక కప్పు చాలు.. ఒంటి నొప్పులను తగ్గించి, పుష్టిగా బలాన్ని ఇచ్చే హెల్తీ బ్రేక్ఫాస్ట్.! -
బెంగాలీ స్పెషల్ రాధాభల్లవి పూరీ..ప్లేట్ లోనే స్వర్గం కనిపించేస్తది! -
మరో పది రోజుల్లో మంగళ గోచారం.. వీరికి దీనికి మించిన మంచి సమయం ఉండదు.!
Mars Transit in Aries on 27 June 2022:మేషంలోకి కుజుడి సంచారం..ఈ రాశులకు లాభం..!
2022లో జూన్ 27న మేషరాశిలోకి కుజుడి సంచారంతో ఈ రాశులకు ప్రయోజనాలు కలగనున్నాయట.
జ్యోతిష్యశాస్త్రం ప్రతి నెలలో నవ గ్రహాలలో ఏదో ఒక గ్రహం తమ స్థానాన్ని మారుతూ ఉంటాయి. ఇలా తమ రాశిని మారిన ప్రతిసారీ ద్వాదశ రాశులపై కచ్చితంగా ప్రభావం పడుతుంది. ప్రతి ఒక్క గ్రహం దాని స్వభావాన్ని బట్టి శుభ ఫలితాలను మరియు అశుభ ఫలితాలను ఇస్తుంది.

అయితే అన్ని గ్రహాలలో అంగారకుడికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అంగారకుడిని గ్రహాలకు అధిపతిగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలోనే 2022 సంవత్సరంలో జూన్ 27వ తేదీన అంటే సోమవారం రోజున ఉదయం 5:39 గంటలకు కుజుడు తన సొంత రాశి అయిన మేషరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. ఈ సమయంలో కొన్ని రాశులపై ప్రత్యేక ప్రభావం పడనుంది. మరీ ముఖ్యంగా ద్వాదశ రాశులలోని నాలుగు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో ఇప్పుడే చూసెయ్యండి.

మిధున రాశి..
ఈ రాశి వారికి కుజుడి సంచారం వల్ల ప్రత్యేక ఫలితాలొస్తాయి. ఈ కాలంలో మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవెరే బలమైన అవకాశం ఉంది. మీరు ఏదైనా పనిలో విజయం సాధించాలని పట్టుదలతో ఉంటే కచ్చితంగా గెలుస్తారు. మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. మీ ప్రేమ జీవితంలో లేదా వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది.

కర్కాటక రాశి..
ఈ రాశి వారికి అంగారకుడి సంచారం వల్ల శుభ ఫలితాలొస్తాయి. మీరు ఈ కాలంలో డబ్బు సంపాదించడానికి అద్భుతమైన అవకాశాలను పొందుతారు. ఉద్యోగులకు కార్యాలయంలో మంచి అవకాశాలు వస్తాయి. మీరు అనేక రంగాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కూడా కొత్త ఉద్యోగావకాశాలు ఎక్కువగా వస్తాయి. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనం పొందొచ్చు. చాలా కాలంగా పెండింగులో ఉన్న భూ వివాదం ముగిసే అవకాశం ఉంది.

సింహ రాశి..
ఈ రాశి వారికి కుజుడి సంచారం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఈ కాలంలో మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. వ్యాపారులకు అనేక లాభాలు రావొచ్చు. మీరు వ్యాపారానికి సంబంధించి చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మీరు పెట్టుబడి నుండి లాభం పొందే సంకేతాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఉద్యోగులకు ఈ సమయం మంచిగా ఉంటుంది.ఎలాంటి క్లిష్టమైన పనులనైనా సులభంగా పూర్తి చేస్తారు. ప్రభుత్వ పనుల్లో నిమగ్నమైన వారికి మంచి ఫలితాలొస్తాయి.

కుంభ రాశి..
ఈ రాశి వారికి కుజుడి సంచారం వల్ల అన్ని రకాల ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. ఆర్థిక పరంగా లాభదాయకంగా ఉంటుంది. మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఈ కారణంగా మీ మనసు ఆనందంగా ఉంటుంది. ఈ కాలంలో మీ కెరీర్లో గొప్ప ఫలితాలను చూస్తారు. మీరు అనేక ఆహ్లాదకరమైన ప్రయాణాలకు అవకాశం పొందుతారు. వ్యాపారులు ఈరోజు మంచి లాభాలను పొందుతారు. మీరు కొత్త వాటిలో పెట్టుబడి పెట్టేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications
