Just In
- 2 hrs ago
Today Rasi Phalalu: మిథున రాశి వ్యాపారస్తులు తమ ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి..లేదంటే మోసపోతారు..
- 14 hrs ago
ధూమపానం మీ ఊపిరితిత్తులకే కాదు మీ శరీరంలో ఇతర అవయవాలకు కూడా ప్రమాదకరమని మీకు తెలుసా?
- 14 hrs ago
ఈ వ్యాయామాలతో ఆడవాళ్లను పిచ్చెక్కించే శక్తి మీ సొంతమవుతుంది
- 15 hrs ago
Night Sweats: పిల్లల్లో రాత్రి చెమట.. కారణాలేంటి? పరిష్కారమేంటి?
Don't Miss
- News
మూడోసారి.. స్పీకర్ పోచారంకు కరోనా పాజిటివ్.. స్టేబుల్గానే
- Sports
జింబాబ్వేతో వన్డే సిరీస్.. ప్రపంచ క్రికెట్కు మంచిదన్న శిఖర్ ధావన్..! కేఎల్ రాహుల్ కెప్టెన్సీపై స్పందిస్తూ..
- Movies
Karthika Deepam కార్తీక్ కోసం మార్చురీకి వెళ్లిన దీపం.. అసలేం జరిగిందంటే?
- Finance
DigiYatra: సులభతరంగా విమాన ప్రయాణం.. అందుబాటులోకి నయా టెక్నాలజీ.. హైదరాబాద్..
- Technology
Sony నుంచి సరికొత్త ఫీచర్లతో Mini LED TV విడుదల! ధర ఎంతంటే!
- Automobiles
ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ది కోసం మహీంద్రా అడ్వాన్స్డ్ డిజైన్ యూరప్ M.A.D.E ప్రారంభం!
- Travel
ఫ్లయింగ్ రెస్టారెంట్లో రుచులు ఆస్వాదించాలని ఎవరికుండదు చెప్పండి!
Mars Transit in Aries on 27 June 2022:మేషంలోకి కుజుడి సంచారం..ఈ రాశులకు లాభం..!
జ్యోతిష్యశాస్త్రం ప్రతి నెలలో నవ గ్రహాలలో ఏదో ఒక గ్రహం తమ స్థానాన్ని మారుతూ ఉంటాయి. ఇలా తమ రాశిని మారిన ప్రతిసారీ ద్వాదశ రాశులపై కచ్చితంగా ప్రభావం పడుతుంది. ప్రతి ఒక్క గ్రహం దాని స్వభావాన్ని బట్టి శుభ ఫలితాలను మరియు అశుభ ఫలితాలను ఇస్తుంది.
అయితే అన్ని గ్రహాలలో అంగారకుడికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అంగారకుడిని గ్రహాలకు అధిపతిగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలోనే 2022 సంవత్సరంలో జూన్ 27వ తేదీన అంటే సోమవారం రోజున ఉదయం 5:39 గంటలకు కుజుడు తన సొంత రాశి అయిన మేషరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. ఈ సమయంలో కొన్ని రాశులపై ప్రత్యేక ప్రభావం పడనుంది. మరీ ముఖ్యంగా ద్వాదశ రాశులలోని నాలుగు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో ఇప్పుడే చూసెయ్యండి.

మిధున రాశి..
ఈ రాశి వారికి కుజుడి సంచారం వల్ల ప్రత్యేక ఫలితాలొస్తాయి. ఈ కాలంలో మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవెరే బలమైన అవకాశం ఉంది. మీరు ఏదైనా పనిలో విజయం సాధించాలని పట్టుదలతో ఉంటే కచ్చితంగా గెలుస్తారు. మీ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. మీ ప్రేమ జీవితంలో లేదా వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది.

కర్కాటక రాశి..
ఈ రాశి వారికి అంగారకుడి సంచారం వల్ల శుభ ఫలితాలొస్తాయి. మీరు ఈ కాలంలో డబ్బు సంపాదించడానికి అద్భుతమైన అవకాశాలను పొందుతారు. ఉద్యోగులకు కార్యాలయంలో మంచి అవకాశాలు వస్తాయి. మీరు అనేక రంగాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కూడా కొత్త ఉద్యోగావకాశాలు ఎక్కువగా వస్తాయి. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనం పొందొచ్చు. చాలా కాలంగా పెండింగులో ఉన్న భూ వివాదం ముగిసే అవకాశం ఉంది.

సింహ రాశి..
ఈ రాశి వారికి కుజుడి సంచారం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఈ కాలంలో మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. వ్యాపారులకు అనేక లాభాలు రావొచ్చు. మీరు వ్యాపారానికి సంబంధించి చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మీరు పెట్టుబడి నుండి లాభం పొందే సంకేతాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఉద్యోగులకు ఈ సమయం మంచిగా ఉంటుంది.ఎలాంటి క్లిష్టమైన పనులనైనా సులభంగా పూర్తి చేస్తారు. ప్రభుత్వ పనుల్లో నిమగ్నమైన వారికి మంచి ఫలితాలొస్తాయి.

కుంభ రాశి..
ఈ రాశి వారికి కుజుడి సంచారం వల్ల అన్ని రకాల ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. ఆర్థిక పరంగా లాభదాయకంగా ఉంటుంది. మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఈ కారణంగా మీ మనసు ఆనందంగా ఉంటుంది. ఈ కాలంలో మీ కెరీర్లో గొప్ప ఫలితాలను చూస్తారు. మీరు అనేక ఆహ్లాదకరమైన ప్రయాణాలకు అవకాశం పొందుతారు. వ్యాపారులు ఈరోజు మంచి లాభాలను పొందుతారు. మీరు కొత్త వాటిలో పెట్టుబడి పెట్టేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది.